పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : కర్దమప్రజాపతి వంశాభివృద్ధి

  •  
  •  
  •  

4-19-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక, సంతానార్థంబు నానావిధ పూజలు గావించి నా చిత్తంబున ధరియించిన మహాత్ముం డొక్కరుండ” యనిన నమ్మువ్వురు విబుధశ్రేష్ఠులు నతనిం గనుంగొని సుధామధురంబు లయిన వాక్యంబుల నిట్లనిరి.

టీకా:

అదియునుం = అంతే; కాక = కాకుండ; సంతానార్థంబు = సంతానముకోరి; నానావిధ = అనేక విధములైన; పూజలు = పూజలు; కావించి = చేసి; నా = నా యొక్క; చిత్తంబునన్ = మనసులో; ధరియించిన = నిలుపుకొన్న; మహాత్ముండు = గొప్పవాడు {మహాత్ముడు – గొప్ప ఆత్మ కలవాడు, గొప్పవాడు}; ఒక్కరుండ = ఒక్కడినే; అనినన్ = అనగా; ఆ = ఆ; మువ్వురు = ముగ్గురు; విబుధ = దేవతలలో; శ్రేష్ఠులు = శ్రేష్ఠులు; అతనిన్ = అతనిని; కనుంగొని = చూసి; సుధా = అమృతము వలె; మధురంబులు = తీయనివి; అయిన = అయినట్టి; వాక్యంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

అంతేకాక నేను సంతానం కోసం పెక్కువిధాలైన పూజలు చేసి నా మనస్సులో నిలుపుకున్న మహాత్ముడు ఒక్కడు మాత్రమే” అని అత్రిమహర్షి పలుకగా త్రిమూర్తులు అమృతం వంటి తియ్యనైన మాటలతో ఇలా అన్నారు.