చతుర్థ స్కంధము : పురంజను కథ
- ఉపకరణాలు:
అనయంబుఁ గాల పుత్రిక
యను నొక కామిని వరేచ్ఛ నఖిల జగంబుం
దనయంతఁ గలయఁ దిరుగుచుఁ
జనిచని యొకనాడు రాజసత్తమ! వింటే.
టీకా:
అనయంబున్ = ఎల్లప్పుడు; కాలపుత్రిక = కాలపుత్రిక {కాలపుత్రిక - అవసాన కాలమున జనించునది}; అను = అనెడి; ఒక = ఒక; కామిని = స్త్రీ; వర = వరుని కొఱకైన; ఇచ్ఛన్ = కోరికతో; అఖిల = సమస్తమైన; జగంబుల్ = లోకములు; తనయంతన్ = తనంతతనే; కలయన్ = కలియ; తిరుగుచున్ = తిరుగుతూ; చనిచని = వెళ్ళి; = ఒక = ఒక; నాడు = దినమున; రాజసత్తమ = రాజులలో మిక్కిలి సత్తువ ఉన్నవాడా; వింటే = విన్నావా.
భావము:
రాజశ్రేష్ఠా! విను. కాలుని పుత్రిక అయిన ఒక కన్య వరుని కోరి తనంత తానే అన్ని లోకాలలోను తిరుగుతూ ఉండేది.