పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-676-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలాత్మ! కరాదానము
శుల్కాదికము గరము దారుణ మని ధై
ర్యమునన్ దీర్ఘమఖవ్యా
మునం దద్వర్తనంబు మమతి విడిచెన్.

టీకా:

విమలాత్మ = స్వచ్ఛమైన మనసు కలవాడు; కరాదానము = పన్నులు వసూలు చేయుట; దమశుల్క = అపరాధశుల్కము, జరిమానా; ఆదికము = మొదలగునవి; కరము = మిక్కిలి; దారుణము = కఠినము; అని = అని; ధైర్యమునన్ = ధైర్యముగా; దీర్ఘమఖ = చిరకాలయాగము; వ్యాజమునన్ = వంకతో; తత్ = ఆ; వర్తనంబున్ = పద్దతిని; సమ = సమత్వపు; మతిన్ = భావముతో; విడిచెన్ = వదలివేసెను.

భావము:

పుణ్యాత్మా! పన్నులు, కప్పాలు పుచ్చుకొనడం దారుణమైన పని అని భావించి విజితాశ్వుడు దీర్ఘసత్రం అనే మహాయజ్ఞాన్ని ప్రారంభించి దాని కారణంగా పన్నులు మొదలైన వానిని గ్రహించడం విడిచిపెట్టాడు.