పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-656-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మనమున నే దుఃఖము
యంబు నెఱుంగనట్టి ర్చి నిజాధీ
శుని ప్రాణరహిత దేహము
నుఁగొని విలపించి విగతకౌతుక యగుచున్.

టీకా:

తన = తన యొక్క; మనమునన్ = మనసులో; ఏ = ఏ; దుఃఖమున్ = దుఃఖమును; అనయంబున్ = ఎప్పుడును; ఎఱుంగన్ = తెలియని; అట్టి = అటువంటి; అర్చి = అర్చి; నిజ = తన; అధీశునిన్ = భర్త యొక్క; = ప్రాణ = ప్రాణములు; రహిత = లేని; దేహమున్ = కళేబరమును; కనుగొని = పొడగని; విలపించి = పెద్దగా ఏడ్చి; విగత = విడిచిన; కౌతుక = సంతోషము, కోరిక కలది; అగుచున్ = అవుతూ.

భావము:

ఏనాడూ ఆమె దుఃఖం అన్నమాట ఎరుగదు. ఈనాడు ప్రాణంలేని భర్త శరీరాన్ని చూచి గోడుగోడున విలపించింది. ఆమె తన సంతోషం అంతరించగా…