పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-641-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుత! భూమివలనను
ముల మర్యాదఁ గొనుచు దాన నిమిత్తం
బునఁ గ్రమ్మఱఁ దా నిచ్చుచు
దినాయకుఁ బోలి వసుమతీపతి యొప్పెన్.

టీకా:

జన = ప్రజలచే; వినుత = స్తుతింపబడువాడ; భూమి = నేల; వలనను = నుండి; ధనములన్ = సంపదలను; మర్యాదన్ = గౌరవమును; కొనుచున్ = తీసుకొనుచు; దాన = దానము; నిమిత్తంబునన్ = పేరుతో; క్రమ్మఱన్ = మరల; తాన్ = తను; ఇచ్చుచున్ = ఇస్తూ; = దిననాయకున్ = సూర్యుని {దిన నాయకుడు - దిన (పగలు)కి నాయకుడు, సూర్యుడు}; పోలి = వలె; వసుమతీపతి = రాజు {వసుమతీపతి - వసుమతి (భూమి)కి పతి, రాజు}; ఒప్పెన్ = చక్కగా యుండెను.

భావము:

జనస్తుతుడవైన విదురా! సూర్యుడు భూమినుండి నీటిని గ్రహించి అవసర మైనపుడు వర్షించు విధంగా పృథుచక్రవర్తి ప్రజలనుండి పన్నులను గ్రహిస్తూ, అవసరమైనప్పుడు తిరిగి ప్రజలకే దానరూపంలో పంచి ఇచ్చేవాడు.