పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-632-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యీ గతిఁ బంకరుహా
సుతుఁడును బ్రహ్మబోధశాలియు నగు నా
యోగివల్లభునిచే
ను దెలియఁగఁ బడిన బ్రహ్మత్త్వుం డగుచున్.

టీకా:

అని = అని; ఈ = ఈ; గతిన్ = విధముగ; పంకేరుహాసన = బ్రహ్మదేవుని; సుతుడునున్ = పుత్రుడును; బ్రహ్మబోధశాలియున్ = బ్రహ్మజ్ఞాని; అగున్ = అయిన; ఆ = ఆ; ఘన = గొప్ప; యోగి = యోగులలో; వల్లభుని = ప్రభువు (సనత్కుమారుడు); చేతనున్ = చేత; తెలియగబడిన = తెలుపబడిన; బ్రహ్మతత్త్వుండు = బ్రహ్మజ్ఞానము కలవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

అని ఈ విధంగా బ్రహ్మపుత్రుడూ, బ్రహ్మవిదుడూ, పరమ యోగీంద్రుడూ అయిన సనత్కుమారుని చేత బ్రహ్మతత్త్వాన్ని చక్కగా తెలిసికొన్నవాడై…