పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-601-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినఁబడు వచనన్యాయం
బు నుద్గతములగు ప్రాణములఁ గ్రమ్మఱఁ బొం
ను గోరువాడునుం బలె
నుచర ఋత్విక్సదస్యుఁడై పృథుఁ డంతన్.

టీకా:

వినబడు = వినబడెడి; వచన = వాక్యముల; న్యాయంబున = న్యాయము ప్రకారము; ఉద్గతములు = పైకి లేచినవి; అగు = అయిన; ప్రాణములన్ = ప్రాణములను; క్రమ్మఱన్ = మరల; పొందను = పొందుటను; కోరువాడునున్ = కోరెడివాడు; వలె = వలె; అనుచర = అనుసరిస్తున్న; = = ఋత్విక్ = ఋత్విక్కులు; సదస్యుడు = సభ్యులు కలవాడు; ఐ = అయ్యి; పృథుడున్ = పృథుచక్రవర్తి; అంతన్ = అంతట.

భావము:

శాస్త్రకారుల మాట చొప్పున పైకి లేచిన ప్రాణాలను మళ్ళీ పొందగోరిన వానివలె పృథుచక్రవర్తి ఋత్విక్కులతోను, సదస్యులతోను కూడి లేచి ఎదురు వెళ్ళాడు.