పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : భక్తియోగంబు

  •  
  •  
  •  

3-971-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని సకలభూతగణములు
మున నానందజలధిగ్నము లగుచున్
బహుమాన పురస్సర
యముఁ బాటిల్ల వినుతు ర్థిం జేయున్.

టీకా:

కని = చూసి; సకల = సమస్తమైన; భూత = జీవ; గణములున్ = రాసులును; మనమునన్ = మనసులో; ఆనంద = ఆనందము అనెడి; జలధిన్ = సముద్రమున; మగ్నములు = మునిగినవి; అగుచున్ = అవుతూ; ఘన = గొప్ప; బహుమాన = సమ్మానములు; పురస్సరమున్ = పురోగమనములు; అనయమున్ = ఎల్లప్పుడు; పాటిల్లన్ = కలుగునట్లు; వినుతులు = స్తోత్రములు; అర్థిన్ = కోరి; చేయున్ = చేయును.

భావము:

(అటువంటి పుణ్యాత్ముని) సమస్త ప్రాణికోటి ఎంతో గౌరవభావంతో చూచి, ఎప్పుడూ అభినందిస్తూ సంతోష సముద్రంలో మునిగి తేలుతుంటారు.