పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : భక్తియోగంబు

  •  
  •  
  •  

3-964-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిశము సర్వభూతహృదయాంబుజవర్తి యనం దనర్చు నీ
శు ను నవజ్ఞసేసి మనుజుం డొగి మత్ప్రతిమార్చనా విడం
మున మూఢుఁడై యుచితక్తిని నన్ను భజింపఁడేని న
మ్మనుజుఁడు భస్మకుండమున మానక వేల్చిన యట్టివాఁ డగున్.

టీకా:

అనిశమున్ = నిత్యమును; సర్వ = సమస్తమైన; భూత = జీవుల; హృదయ = హృదయములను; అంబుజ = పద్మములందు; వర్తి = తిరిగెడువాడు; అనన్ = అనగా; తనర్చు = అతిశయించు; ఈశున్ = భగవంతుని; ననున్ = నన్ను; అవజ్ఞ = అవమానము; చేసి = చేసి; మనుజుండు = మానవుడు; ఒగిన్ = ఆడంబరముగ; మత్ = నా; ప్రతిమ = బొమ్మలను; అర్చనా = పూజించెడి; విడంబనమున = మోసము అనుకరించి; మూఢుడు = మూర్ఖుడు; ఐ = అయ్యి; ఉచిత = తగిన; భక్తిన్ = భక్తితో; నన్నున్ = నన్ను; భజింపడు = కొలువని వాడు; ఏని = అయినట్లైతే; ఆ = ఆ; మనుజుండు = మానవుడు; భస్మ = బూడిద; కుండమునన్ = గుంటలో; మానక = విడువక; వేల్చిన = హోమము చేసిన; అట్టి = అటువంటి; వాడు = వాడు; అగున్ = అగును.

భావము:

ఎల్లప్పుడు అఖిల జీవుల హృదయ కమలాలలో అంతర్యామినై ఉండే నన్ను అలక్ష్యం చేసి కేవలం నా విగ్రహాలను మాత్రమే ఆడంబరంగా పూజిస్తూ లోకాన్ని మోసగించేవాడు మూర్ఖుడు. అచంచలమైన భక్తితో నన్ను ఆరాధింపని వాని పూజలు బూడిదలో పోసిన హోమద్రవ్యాలవలె నిరర్థకాలు.