పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విష్ణు సర్వాంగ స్తోత్రంబు

  •  
  •  
  •  

3-930-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లజు మాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయై
లదళాభనేత్రములు ల్గి హృదీశ్వర భక్తి నొప్పు న
క్కల నిజాంకపీఠమునఁ గైకొని యొత్తు పరేశుజాను యు
గ్మము హృదయారవిందమున క్కువఁ జేర్చి భజింపగా దగున్.

టీకా:

కమలజు = బ్రహ్మదేవుని {కమలజుడు - కమలమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; మాత = తల్లి; ఐ = అయ్యి; సుర = దేవతల; నికాయ = సమూహములచే; సమంచిత = చక్కగ కూడి; సేవ్యమాన = సేవింపబడుచున్నది; ఐ = అయ్యి; కమల = కలువపూల; దళ = రేఖల; ఆభ = వంటి; నేత్రములు = కన్నులు; కల్గి = కలిగి ఉండి; హృదీశ్వర = భర్త (విష్ణువు) యందలి {హృదీశ్వరుడు - హృదయములకు ఈశ్వరుడు, విష్ణువు, భర్త}; భక్తిన్ = భక్తితో; ఒప్పున్ = చక్కగ ఉండెడి; ఆ = ఆ; కమల = లక్ష్మీదేవి; నిజ = తన; అంకపీఠమునన్ = ఒడిలో {అంకపీఠము - అంక (ఒడి, తొడ) అను పీఠము (ఆసనము, పీట)}; కైకొని = ఉంచుకొని; ఒత్తు = ఒత్తెడి; పరేశు = విష్ణుమూర్తి యొక్క {పరేశుడు - పర (అతీతమైన) ఈశుడు (ప్రభువు), విష్ణువు}; జాను = మోకాళ్ళ; యుగ్మము = జంటను; హృదయ = హదయము అనెడి; అరవిందమునన్ = పద్మమున; మక్కువన్ = ఆపేక్షతో; చేర్చి = చేర్చుకొని; భజింపగాన్ = పూజించుట; తగున్ = చేయవలసినది.

భావము:

బ్రహ్మకు తల్లియై, దేవతలందరికీ ఆరాధ్యురాలై, కమల దళాలవంటి కన్నులుగల లక్ష్మీదేవి తన హృదయేశ్వరుడైన శ్రీహరి మోకాళ్ళను ఎంతో భక్తితో ఒడిలో చేర్చుకొని ఒత్తుతూ ఉన్న మనోహర దృశ్యాన్ని మనస్సులో మననం చేసుకోవాలి.