పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : మైత్రేయునిఁ గనుగొనుట

  •  
  •  
  •  

3-173.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లఁచి విజ్ఞానతత్త్వంబు రణిమీఁదఁ
దాల్చి జనకోటి కెఱిఁగింపఁ గిన ధీరుఁ
డుద్ధవుఁడు దక్క నితరులేనోప రితఁడు
నిర్జితేంద్రియుఁ డాత్మసన్నిభుఁ డటంచు

టీకా:

నావుడు = అనగా; రాజ = రాజులలో; ఇంద్రున = శ్రేష్ఠున; కున్ = కు; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈవిధముగ; అను = అనెను; మున్ను = పూర్వము; లోకేశు = బ్రహ్మదేవుడు {లోకేశుడు - లోకములకు ప్రభువు, బ్రహ్మదేవుడు}; చేత = చే; సంప్రార్థితుండు = చక్కగా ప్రార్థింపబడినవాడు; ఐన = కాగా; జలరుహనాభుండు = కృష్ణుడు {జలరుహనాభుడు - నీటిలో పుట్టినది (పద్మము) బొడ్డున కలవాడు, విష్ణువు}; వసుమతి = భూమి; పైన్ = మీద; యదు = యాదవ; వంశమునన్ = వంశము; అందున్ = లో; ఉదయించి = పుట్టి; తనున్ = తనను; తాన = తనే; మదిన్ = మనసు; లోనన్ = లో; చింతించి = భావించుకొని; తెలివి = తెలుసు; ఒంది = కొని; ఆత్మీయ = తన యొక్క; కుల = వంశము; వినాశము = నశించుట; ఒనరించి = చేసి; తానున్ = తనను; పంచ = ఐదు; ఉపనిషత్ = ఉపనిషత్తులచే; మయము = నిండి ఉన్నది; అగు = అయిన; దివ్య = భౌతికము కాని దివ్యమైన; దేహంబున్ = శరీరమును; చెందన్ = చేర; తలచి = భావించి;
విజ్ఞాన = పరా; తత్త్వమున = తత్త్వజ్ఞానముతో; ధరణి = భూమి; మీద = మీద; తాల్చి = ధరించి; జన = జనుల; కోటి = సమూహముల; కిన్ = కి; ఎఱిగింపన్ = తెలియజేయుటకు; తగిన = తగినట్టి; ధీరుడు = ధీరుడు, విద్వాంసుడు; ఉద్ధవుడు = ఉద్ధవుడు; తక్క = తప్ప; ఇతరులు = ఇంకొకరు; లేనోపరు = సమర్థులుకారు; ఇతండు = ఇతడు; నిర్జిత = జయించిన; ఇంద్రియ = ఇంద్రియములు కలవాడు; ఆత్మ = తనకు; సన్నిభుడు = సమానమై ఉండువాడు; అటంచున్ = అంటూ.

భావము:

ఇలా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రార్థించగా పుండరీకాక్షుడు భూలోకంలో యదువంశంలో అవతరించాడు. తనంత తానే మనస్సులో చేసుకున్న సంకల్పానుసారం తన కులాన్నంతా అంతం చేసాడు. ఐదు ఉపనిషత్తులతో కూడిన పరబ్రహ్మ స్వరూపమైన దివ్యదేహాన్ని పొందదలచి, తన తర్వాత విజ్ఞాన తత్త్వాన్ని అందుకొని లోకంలో జిజ్ఞాసువులైన ప్రజలకు తెలియజేయగల ప్రజ్ఞాశాలి, జితేంద్రియుడు, తనంతటి వాడు ఒక్క ఉద్ధవుడు తప్ప ఇంకొకడు లేడని భావించాడు.