పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-631-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వుడు దానవేంద్రుఁడు హుతాశనుకైవడి మండి పద్మలో
ను నెదిరించు వేడుకలు సందడిగొల్ప ననల్పతేజుఁడై
గదఁ గేలఁ బూని త్రిజద్భయదాకృతిఁ దాల్చి వ్రేల్మిడిం
నియె రసాతలంబునకుఁ జండ భుజాబల దర్ప మేర్పడన్.

టీకా:

అనవుడు = అనగా; దానవ = రాక్షసులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; హుతాశను = అగ్ని {హుతాశనుడు - హుతము (యజ్ఞమున హోత్రము చేయబడినది) తీసుకెళ్లవాడు, అగ్ని}; కైవడి = వలె; మండి = మండిపడి; పద్మలోచనున్ = విష్ణుమూర్తిని {పద్మ లోచనుడు - పద్మముల వంటి లోచనములు (కన్నులు) ఉన్నవాడు, హరి}; ఎదిరించు = ఎదిరించే; వేడుకలు = ఉత్సాహములు; సందడి = తొందర; కొల్పన్ = చేస్తుండగ; అనల్ప = మిక్కిలి; తేజుడు = తేజస్సు కలవాడు; ఐ = అయ్యి; ఘన = గొప్ప; గదన్ = గదను; కేలన్ = చేత; పూని = ధరించి; త్రి = మూడు; జగత్ = లోకములకు; భయద = భయమును కలిగించు; ఆకృతిన్ = రూపమును; తాల్చి = ధరించి; వ్రేల్మిడిన్ = చిటికెలో; చనియెన్ = వెళ్ళెను; రసాతలంబున్ = పాతాళమున; కున్ = కు; చండ = భయంకరమైన; భుజాబలమున్ = బాహుబలము; దర్పమేర్పడన్ = గర్వము ప్రదర్శిస్తూ.

భావము:

అలా నారదమహర్షి చెప్పగా, హిరణ్యాక్షుడు అగ్నిహోత్రంలా మండిపడ్డాడు. కమలలోచనుడైన విష్ణువును ఎదిరించా లని ఉత్సాహపడ్డాడు. ముల్లోకాలకు భయం కలిగించేలా, తన భుజబలాన్ని ప్రదర్శించుతూ, పెద్ద గదను చేతబట్టి, అతిశయించిన తేజస్సుతో ఆ మహా సముద్రగర్భంలోనికి అతి వేగంగా వెళ్ళాడు.