పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-593-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మీ సురయోని యం దని
వారితులై జనన మందలసెను నే దు
ర్వా బలాఢ్యుడ నయ్యును
వారింపగనోప విప్రచనము లెందున్.

టీకా:

మీరు = మీరు; అసుర = రాక్షసుల; యోనిన్ = గర్భము; అందు = అందు; అనివారితులు = వారింపరానివారు; ఐ = అయ్యి; జననము = పుట్టుక; అంద = పొంద; వలసెను = వలసినదే; నేన్ = నేను; దుర్వార = నివారింపరాని; బల = బలము కలవారిలో; ఆఢ్యుడను = అధికుడను; అయ్యున్ = అయినప్పటికిని; వారింపగన్ = వారించుటకు; ఓపన్ = సమర్థుడను కాను; విప్ర = బ్రాహ్మణుల; వచనములు = మాటలను; ఎందున్ = ఎందులోనైనసరే.

భావము:

“మీరు తప్పనిసరిగా రాక్షసజాతిలో పుట్టవలసి వచ్చింది. నేను అడ్డులేని శక్తిసామర్థ్యాలు ఉన్నవాడనైనా బ్రాహ్మణుల శాపాన్ని నివారించలేను.