పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-576-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్మమూర్తివి జగత్కర్తవు నగు నీవు-
ప్రోవంగఁ దగువారిఁ బ్రోవవేని
విరళ వేదోక్త గు ధర్మమార్గమ-
న్మార్గ మగుఁ గాన త్త్త్వగుణ వి
శిష్టుండ వగుచు నీ జీవసంఘముసేమ-
రసి రక్షింతు నీ దైన శక్తి
చేను ధర్మవిఘాతుల దండించు-
నీకు సంచిత మైన నిగమధర్మ

3-576.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మార్గ నాశక విధములు దికి నింపు
గావు విప్రుల యందు సత్కరుణ మెఱసి
నతఁ బలికిన వినయవాక్యములు నీకు
యుక్త మగు చుండు సతతంబు క్తవరద!

టీకా:

ధర్మ = ధర్మము; మూర్తివి = రూపము ధరించినవాడవు; జగత్ = విశ్వమును; కర్తవు = నిర్మించినవాడవు; అగు = అయిన; నీవు = నీవు; ప్రోవంగన్ = కాపాడబడుటకు; తగు = తగిన; వారిన్ = వారిని; ప్రోవవు = కాపాడకపోయిన; ఏనిన్ = ఎడల; అవిరళ = దట్టమైన; వేద = వేదములందు; ఉక్తము = చెప్పబడినది; అగు = అయిన; ధర్మ = ధర్మబద్ధమైన; మార్గము = జీవన విధానము; అసత్ = చెడు; మార్గము = జీవన విధానము; అగున్ = అయిపోవును; కాన = కనుక; సత్త్వగుణ = సత్త్వగుణములుకల; విశిష్టుండవు = గొప్పవాడవు; అగుచున్ = అవుతూ; ఈ = ఈ; జీవ = జీవుల; సంఘము = సమూహము యొక్క; క్షేమమున్ = శుభమును; అరసి = కోరి, కనిపెట్టి; రక్షించు = కాపాడెదవు; నీది = నీది; ఐన = అయిన; శక్తి = శక్తి; చేతను = వలన; ధర్మ = ధర్మమునకు; ఘాతులన్ = హానిచేయువారిని; దండించు = శిక్షిస్తుండే; నీకున్ = నీకు; సంచితము = కూడబెట్టినది; ఐన = అయినట్టి; నిగమ = వేదముల; ధర్మ = ధర్మ; మార్గ = మార్గమునకు; నాశక = నాశనకరములైన; విధములు = విధానములు;
మదిన్ = మనసున; కిన్ = కి; ఇంపు = ఇష్టము; కావు = కావు; విప్రుల = బ్రాహ్మణుల; అందున్ = ఎడల; సత్ = మంచి; కరుణ = దయ; మెఱసి = ఉద్భవించి; ఘనతన్ = గొప్పగా; పలికిన = పలికినట్టి; వినయ = వినయ పూర్వక; వాక్యములున్ = మాటలు; నీకున్ = నీకు; యుక్తము = తగినవి; అగుచున్ = అయ్యి; ఉండున్ = అండును; సతతంబున్ = ఎల్లప్పుడును; భక్తవరద = విష్ణుమూర్తి {భక్తవరదుడు - భక్తులకు వరములను ప్రసాదించువాడు, భగవంతుడు}.

భావము:

నీవు ధర్మమూర్తివి, సమస్త విశ్వానికి కర్తవు. అటువంటి నీవు రక్షింపదగినవారిని రక్షించకపోతే వేదాలలో చెప్పిన ధర్మమార్గం అధర్మమార్గం అవుతుంది. కనుక సత్త్వగుణాన్ని స్వీకరించినవాడవై ఈ ప్రాణుల క్షేమాన్ని తెలుసుకొని రక్షిస్తావు. ధర్మద్రోహులను నీ దైవశక్తిచేత దండించే నీకు వేదధర్మ... మార్గాన్ని నాశనం చేసే పద్ధతులు ప్రియంకావు. బ్రాహ్మణులపై దయ కలిగి వినయంతో పల్మిన ఈ మాటలు భక్తవరుదుడవైన నీకు యుక్తమై ఉన్నాయి.