పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల వైకుంఠ గమనంబు

  •  
  •  
  •  

3-505-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హనీయ పట్టణము నందు వసించెడు వార లాత్మఁ ని
ష్కాఫలంబె సత్ఫలముగాఁ దలపోసి ముముక్షుధర్ము లై
శ్రీహిళాధిపాంఘ్రిసరసీరుహ పూజ లొనర్చుచున్ మహో
ద్ధామఁ దదీయ రూపములఁ దాల్చి సుఖించుచు నుందు రెప్పుడున్.

టీకా:

ఆ = ఆ; మహనీయ = గొప్ప; పట్టణము = నగరము; అందున్ = లో; వసించెడు = నివసించుచున్న; వారలు = వారు; ఆత్మ = తమ మనసులో; నిష్కామ = కోరికలు లేని/పోవు స్థితి యను; ఫలంబె = ఫలితమునే; సత్ఫలమున్ = సత్ఫలితము; కాన్ = అని; తలపోసి = అనుకొని; ముముక్షు = ముక్తి కోరెడి అను; ధర్ములు = ధర్మము కలవారు; ఐ = అయ్యి; శ్రీమహిళాధిప = విష్ణుని {శ్రీ మహి ళాధిపుడు - శ్రీ (లక్ష్మీ) మహిళ (దేవి) యొక్క అధిపుడు (భర్త), విష్ణువు}; అంఘ్రి = పాదములు అనెడి; సరసీరుహన్ = పద్మములకు {సరసీరుహములు - సరసు అందు పుట్టునవి, పద్మములు}; పూజలున్ = పూజలు; ఒనర్చుచున్ = చేస్తూ; మహ = మిక్కిలి; ఉద్దామ = ఉత్తమమైన; తదీయ = అతని; రూపములన్ = రూపములను; ధరించి = తాల్చి; సుఖించుచున్ = సుఖమును పొందుతూ; ఉందురు = ఉంటారు; ఎప్పుడున్ = ఎల్లప్పుడును.

భావము:

ఆ వైకుంఠ మహానగరంలో నివసించేవారు నిష్కామ ఫలమే తమకు సత్ఫలంగా భావిస్తూ, కైవల్యధర్మం కలవారై, విష్ణు పాదపద్మాలను పూజిస్తూ, అపురూపాలైన విష్ణు స్వరూపాలను ధరించి ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు.