పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు

  •  
  •  
  •  

3-5-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుఁగొని తత్పాదంబులు
ఫాలము సోక మ్రొక్కి గ నిట్లనియెన్
"మునివర! సకల జగత్పా
చరితుఁడు గృష్ణుఁ డఖిల వంద్యుం డెలమిన్.

టీకా:

కనుఁగొని = చూచి; తత్ = అతని; పాదముల్ = పాదములను; తన = తన యొక్క; ఫాలము = నుదురు; సోకన్ = తగులునట్లు; మ్రొక్కి = నమస్కరంచి; తగన్ = తగినట్లుగ; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను; ముని = మునులలో; వర = ఉత్తమా; సకల = సమస్త; జగత్ = లోకములను; పావన = పవిత్రము చేయు; చరితుడు = ప్రవర్తన కలవాడును; కృష్ణుడు = కృష్ణుడు; అఖిల = అందరి చేతను; వంద్యుండు = పూజింపబడువాడు; ఎలమిన్ = కుతూహలముతో;

భావము:

అలా మైత్రేయుణ్ణి దర్శించి ఆ మహాముని పాదాలపై తన నుదురు సోకేలా నమస్కారం చేసి విదురుడు ఇలా అన్నాడు, “మునిశేఖరా! మైత్రేయా! సర్వలోకాలను పవిత్రము చేయు చరిత్ర కలవాడు, అందరిచేత పూజింపబడేవాడు ఐన శ్రీకృష్ణుడు....