పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సృష్టి భేదనంబు

  •  
  •  
  •  

3-377-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రవింద సంభవు నంగుష్ఠమున దక్షుఁ-
డూరువువలనను నాదుండు,
నాభిఁ బులహుఁడు, గర్ణములఁ బులస్త్యుండు-
త్వక్కున భృగువు, హస్తమునఁ గ్రతువు,
నాస్యంబువలన నయ్యంగిరసుఁడు, ప్రాణ-
మున వసిష్టుఁడు, మనమున మరీచి,
న్నుల నత్రియుఁ గాఁ బుత్రదశకంబు-
లిగిరి వెండియు లినగర్భు

3-377.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్షిణస్తనమువలన ర్మ మొదవె
వెన్నువలనను నుదయించె విశ్వభయద
మైన మృత్యు, వధర్మంబు నంద కలిగె,
నాత్మఁ గాముండు జననము నందె మఱియు.

టీకా:

అరవిందసంభవుని = బ్రహ్మదేవుని {అరవిందసంభవుడు - అరవింద (పద్మము) న సంభవించిన వాడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; అంగుష్టమునన్ = బొటకనవేలి యందు; దక్షుడు = దక్షుడు; ఊరువులు = తొడలు; వలనన్ = వలన; నారదుండు = నారదుడు; నాభిన్ = బొడ్డున; పులహుడు = పులహుడు; కర్ణములన్ = చెవులందు; పులస్త్యుండు = పులస్త్యుడు; త్వక్కున = చర్మమున; భృగువు = భృగువు; హస్తమున = చేతియందు; క్రతువు = క్రతువు; ఆస్యంబు = ముఖము; వలనన్ = వలన; ఆ = ఆ; అంగీరసుడు = అంగీరసుడు; ప్రాణమునన్ = ప్రాణమునందు; వసిష్టుడు = వసిష్టుడు; మనమునన్ = మనస్సునందు; మరీచి = మరీచి; కన్నులన్ = కన్నులలో; అత్రియున్ = అత్రి; కాన్ = అగునట్లు; పుత్ర = పుత్రులు; దశకంబున్ = పదిమంది (10); కలిగిరి = పుట్టిరి; వెండియున్ = ఇంకనూ; నలినగర్భు = బ్రహ్మదేవుని {నలినగర్భుడు - నలినము (పద్మము)న గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; దక్షిణ = కుడి; స్తనము = రొమ్ము; వలనన్ = వలన; ధర్మము = ధర్మము; ఒదవెన్ = పుట్టెను; వెన్ను = వెన్నెముక; వలనన్ = వలన; ఉదయించెన్ = పుట్టెను; విశ్వ = విశ్వమునకు; భయదము = భయమును కలిగించునది; ఐన = అయిన; మృత్యువు = మరణము; అధర్మంబున్ = అధర్మము; అందన్ = దానిలో; కలిగె = పుట్టెను; ఆత్మన్ = ఆత్మనుండి; కాముండు = మన్మథుడు {కాముడు - కామమును ప్రేరేపించు వాడు, మన్మథుడు}; జననము = పుట్టుక; ఒందెన్ = పొందెను; మఱియున్ = ఇంకనూ.

భావము:

బ్రహ్మ బొటనవ్రేలు నుండి “దక్షుడు”, తొడనుండి “నారదుడు”, నాభి నుండి “పులహుడు”, చెవులనుండి “పులస్త్యుడు”, చర్మంనుండి “భృగువు”, చేతి నుండి “క్రతువు”, ముఖంనుండి “అంగిరసుడు”, ప్రాణంనుండి వశిష్టుడు, మనస్సునుండి మరీచి, కన్నులనుండి “అత్రి” ఆవిర్భవించారు. ఈవిధంగా పదిమంది కుమారులు పుట్టారు. ఇంకా బ్రహ్మ దేవుని కుడి వైపు స్తనంనుండి “ధర్మం” జనించింది. వెన్నునుండి లోకభయంకరమైన “మృత్యువూ”, జనించాయి. ఆత్మనుండి “మన్మథుడు” పుట్టాడు.