పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : భాగవత వైభవంబు

  •  
  •  
  •  

2-216-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని వాణీశుఁడు నారద
మునివరునకుఁ జెప్పినట్టి ముఖ్యకథా సూ
మతిభక్తిఁ బరీక్షి
జ్జపాలునితోడ యోగిచంద్రుఁడు నుడివెన్.

టీకా:

అని = అని; వాణీశుఁడు = బ్రహ్మ {వాణీశుడు - వాణి (సరస్వతి) కి ఈశుడు (భర్త), బ్రహ్మ}; నారద = నారదుడు అను; ముని = మునులలో; వరున్ = శ్రేష్ఠుని; కున్ = కి; చెప్పినట్టిన్ = చెప్పినది; ముఖ్య = ముఖ్యమైన; కథా = కథ యొక్క; సూచనమున్ = సూచనను; అతి = మిక్కిలి; భక్తిఁన్ = భక్తితో; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; జన = జనులను; పాలునిన్ = పాలించు వాని; తోడన్ = తో; యోగి = యోగులలో; చంద్రుడున్ = శ్రేష్ఠుడు; నుడివెన్ = చెప్పెను.

భావము:

ఇలా పూర్వం బ్రహ్మదేవుడు ఋషీశ్వరుడైన నారదునికి భాగవత ముఖ్యకథను వివరించాడు. ఆ విషయాన్ని యోగీశ్వరుడైన శుకుడు మహా భక్తితో పరీక్షిన్మహారాజుకు తెలియజేప్పాడు.