పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : కృష్ణావతారంబు

  •  
  •  
  •  

2-181-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మందుని గతి యము నాంబువు
లందు నిసిం గ్రుంకి బద్ధుఁడై చిక్కిన యా
నందుని వరుణుని బంధన
మందు నివృత్తునిగఁ జేసె రి సదయుండై.

టీకా:

మందుని = తెలివి తక్కువ వాని; గతిన్ = వలె; యమున = యమున యొక్క; అంబువులు = నీటి; అందున్ = లో; నిసిన్ = రాత్రి వేళ; క్రుంకి = మునిగి; బద్ధుఁడై = (వరుణునిచే) బంధింపబడి; చిక్కినన్ = చిక్కుకొనగా; ఆ = ఆ; నందునిన్ = నందుని; వరుణునిన్ = వరుణుని యొక్క; బంధనము = బంధనము; అందున్ = నుండి; నివృత్తునిగఁన్ = విడివడినవానిగ; చేసెన్ = చేసెను; హరి = కృష్ణుడు {హరి - దుఃఖములను హరించు వాడు}; సదయుండు = దయగల వాడు; ఐ = అయి.

భావము:

ఒక రాత్రివేళ నందుడు మందమతి వలె యమునా నదీ జలాలలో స్నానం చేస్తూ మునిగి, అక్కడ వరుణుని పాశాలలో చిక్కకొన్నాడు. అప్పుడు దయాసింధుడైన హరి ఆ బంధంనుండి అతణ్ణి విడిపించాడు.