పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నారయ కృతి ఆరంభంబు

  •  
  •  
  •  

2-107-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అ మ్మహాత్ముం డైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుం డంటేని.

టీకా:

ఆ = ఆ; మహాత్ముడు = మహాత్ముడు; ఐన = అయిన; పుండరీకాక్షుండు = భగవంతుడు {పుండరీకాక్షుడు - పుండరీకములు (పద్మములు) వంటి కన్నులు ఉన్నవాడు}; సర్వజ్ఞుండు = సర్వమును తెలిసినవాడు; అంటేనిన్ = అన్నట్లయితే.

భావము:

ఆ మహాత్ముడైన పద్మనేత్రుడు సర్వజ్ఞుడు గదా. తన మహిమ అయన కెందుకు తెలియదు అని నీవు ప్రశ్నించవచ్చు. ఆ విషయం వివరిస్తాను, విను.