పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : కలియుగ ధర్మ ప్రకారంబు

  •  
  •  
  •  

12-21-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మూవ యుగమున నెంతయు
వేడుక హరికీర్తనంబు వెలయఁగ ధృతిచేఁ
బాడుచుఁ గృష్ణా! యనుచుం
గ్రీడింతురు కలిని దలఁచి కృతమతు లగుచున్. "

టీకా:

మూడవయుగమున = ద్వాపరయుగమునందు; ఎంతయున్ = మిక్కిలి; వేడుకన్ = ఉత్సాహముతో; హరి = కృష్ణుని; కీర్తనంబు = కీర్తనలను; వెలయంగ = ప్రకాశవంతముగ; ధృతి = పూనిక; చేన్ = తోటి; పాడుచున్ = ఆలపించుచు; కృష్ణా = శ్రీకృష్ణా; అనుచున్ = అంటు; క్రీడింతురు = విహరించెదరు; కలిని = కలికాలమును; తలచి = తలచుకొని; కృతమతులు = మనసునధరించినవారు; అగుచున్ = ఔతూ.

భావము:

“మూడవ యుగం అయిన ద్వాపరంలో "కృష్ణా" అని హరినామ స్మరణ చేస్తూ ఉంటారు. హరిని స్తోత్రాలు ఆలపిస్తూ ఉంటారు. కలిని తలచి జాగ్రత్త పడువారు అయి భగవంతుని యందు క్రీడిస్తూ ఉంటారు.”