పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : కల్క్యవతారంబు

  •  
  •  
  •  

12-10-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వంతుఁ డైన వాడే
కుహీనుం డైన దొడ్డగుణవంతుఁ డగుం
లిమియుఁ బలిమియుఁ గలిగిన
నిలోపల రాజ తండె; యే మన వచ్చున్.

టీకా:

బలవంతుడు = బలములుగలవాడు; ఐనన్ = అయితే; వాడే = అతడే; కులహీనుండు = కులంలేనివాడు; ఐనన్ = అయినప్పటికి; దొడ్డ = గొప్ప; గుణవంతుడున్ = గుణాలున్నవానిగ; అగున్ = పరిగణిస్తారు; కలిమియున్ = సంపద; బలిమియున్ = శక్తి; కలిగినన్ = ఉన్నట్లయితే; ఇల = ప్రపంచము; లోపలన్ = లో; రాజు = రాజ్యాధికారముకలవాడు; అతండె = అతడే; ఏమనవచ్చున్ = ఏమనగలము.

భావము:

బలవంతుడిని కులం లేకపోయినా గొప్ప గుణవంతుడుగా పరిగణిస్తారు. కలిమి బలిమీ రెండూ కనుక ఉంటే ఇంక చెప్పటానికేముంది లోకంలో అతడే రాజు.