పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : అంతరిక్షు సంభాషణ

  •  
  •  
  •  

11-53-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"జ్ఞావిహీనులైన నరసంఘముఁ గానఁగరాని మాయఁ దా
లో నడంచి యెట్లు హరిలోకముఁ జెందుదు? రంతయుం దగన్‌
భూనుత! సత్యవాక్యగుణభూషణ! యిక్కథ వేడ్కతోడుతం
బూనికఁ జెప్పు" మన్నను బ్రబుద్ధుఁడు నిట్లను గారవంబునన్‌.

టీకా:

ఙ్ఞాన = ఆత్మఙ్ఞానము; విహీనులు = లేనివారు; ఐన = అయిన; నర = మానవులు; సంఘము = అందరు; కానగరాని = కనలేని; మాయన్ = మాయను; తాన్ = తాను; లోనన్ = లోపల; అడంచి = అణచివేసి; ఎట్లు = ఏ విధముగ; హరిలోకమున్ = వైకుంఠమును; చెందుదురు = పొందగలుగుతారు; అంతయు = అంతా; తగన్ = తగిన విధముగా; భూనుత = మహానుభావుడ {భూనుత -భూలోకమునంతా స్తుతింపబడువాడు, గొప్పవాడు}; సత్యవాక్య = సత్యమేపలికెడి; గుణ = సుగుణముచే; భూషణ = అలంకరింపబడినవాడా; ఈ = ఈ యొక్క; కథన్ = వృత్తాంతమును; వేడ్క = కుతూహలము; తోడుతన్ = కూడినదిగా; పూనికన్ = ఉద్యమస్ఫూర్తితో; చెప్పుము = తెలియజెప్పుము; అన్నన్ = అనగా; ప్రబుద్ధుడు = ప్రబుద్ధుడు; ఇట్లు = ఈ విధముగ; అనున్ = పలికెను; గారవంబునన్ = ఆదరముతో.

భావము:

“మీరు లోకోత్తములు. సత్యవాక్య పరిపాలకులు. కనరాని మాయను లోపల అణచివేసి అజ్ఞానులు ఏ విధంగా వైకుంఠాన్ని చేరగలుగుతారు? ఈ విషయాన్ని దయతో చెప్పండి.” ఇలా అన్న విదేహునితో ప్రబుద్ధుడు అనే మహముని ఆదర పూర్వకంగా ఇలా అన్నాడు.