పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : అవధూత సంభాషణ

  •  
  •  
  •  

11-116-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చెప్పిన విని రాజేంద్రుఁడు
సొప్పడ శ్రీకృష్ణుకథలు చోద్యము గాఁగం
జెప్పినఁ దనియదు చిత్తం
బొప్పఁగ మునిచంద్ర! నాకు యోగులు మెచ్చన్‌.

టీకా:

చెప్పినన్ = చెప్పగా; విని = విని; రాజేంద్రుడు = మహారాజు; చొప్పడన్ = తగినట్లు; శ్రీకృష్ణు = శ్రీకృష్ణుని; కథలు = వృత్తాంతములు; చోద్యము = అద్భుతము; కాగన్ = కలుగునట్లు; చెప్పినన్ = చెప్పినచో; తనియదు = తృప్తిచెందదు; చిత్తంబు = మనస్సు; ఒప్పుగన్ = పూర్తిగా; ముని = మునులలో; చంద్ర = ఉత్తముడా; నా = నా; కున్ = కు; యోగులు = యోగులు; మెచ్చన్ = మెచ్చేవిధముగ.

భావము:

ఆ శుకబ్రహ్మ పలుకులు వినిన రాజేంద్రుడు, “మునీశ్వరా! శ్రీకృష్ణుడి కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. యోగులు మెచ్చేలా మీరెంత చెప్పినా నేను ఎంత విన్నా తనివితీరడం లేదు.