పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : వైకుంఠం మరలఁ గోరుట

  •  
  •  
  •  

11-84-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని పరమేశుని యాదవ
శోభిత పారిజాతు నరుహనేత్రున్‌
కామిత ఫలదాయకు
వినుతించిరి దివిజు లపుడు వేదోక్తములన్‌.

టీకా:

కని = చూసి; పరమేశ్వరుని = కృష్ణుని; యాదవ = యదు వంశము అను; వన = ఉద్యానవములో; పారిజాతున్ = పారిజాతంలాంటివాని; వనరుహనేత్రున్ = పద్మాక్షుని, కృష్ణుని; జన = జనులు; కామిత = కోరిన; ఫల = ఫలాలను; దాయకున్ = ఇచ్చువానిని; వినుతించిరి = స్తుతించారు; దివిజులు = దేవతలు; అపుడు = ఆ సమయమునందు; వేద = వేదములలోని; ఉక్తములన్ = సూక్తులతో.

భావము:

అలా వచ్చి దర్శించుకుని, యాదవవంశం అనే ఉద్యానవనంలో ప్రకాశించే పారిజాతం వంటివాడు, జనులు కోరిన ఫలాలను ఇచ్చేవాడు అయిన పద్మాక్షుని దేవతలు వేదసూక్తాలతో వినుతించారు.