పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాలయవనుడు వెంటజనుట

  •  
  •  
  •  

10.1-1621-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టులవాలాభీల సైంహికేయుని భంగి-
లాలితేతర జటాతిక దూలఁ
బ్రళయావసర బృహద్భాను హేతిద్యుతిఁ-
రుషారుణ శ్మశ్రుటలి వ్రేలఁ
గాదంబినీఛన్న కాంచనగిరిభాతిఁ-
వచ సంవృత దీర్ఘకాయ మమర
ల్మీక సుప్త దుర్వారాహి కైవడిఁ-
గోశంబులో వాలు కొమరు మిగుల

10.1-1621.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నార్చి పేర్చి మించి శ్వంబుఁ గదలించి
మలసంభవాది నులకైనఁ
ట్టరాని ప్రోడఁ ట్టెద నని జగ
వనుఁ బట్టఁ గదిసె వనుఁ డధిప!

టీకా:

చటుల = భయంకరమైన; వాల = తోకవలె; ఆభీల = భీకరమైనట్టి; సైంహికేయుని = రాహువు {సైంహిక - సింహిక, కొడుకు, రాహువు}{సింహిక - హిరణ్యకశిపుని కూతురు, కుమారుడు స్వర్భాను, ఇతను దొంగతనంగా అమృతం తాగుతుంటే విష్ణువు చక్రంతో తల నరికాడు ఆ రాహువు కేతువులుగా గ్రహాలు అయ్యారు, నీడను బట్టే ఆ సింహికను హనుమంతుడు సంహరించాడు}; భంగిన్ = వలె; లాలిత = మనోజ్ఞమైనది; ఇతర = కానట్టి; జటాలతిక = పిలక; తూలన్ = తూగుతుండగా; ప్రళయ = ప్రళయపు; అవసర = కాలమునందలి; బృహత్ = పెద్ద; భాను = సూర్యకిరణముల; హేతి = మంటలవంటి; ద్యూతిన్ = ప్రకాశముతో; పరుష = బిరుసైన; అరుణ = ఎర్రని; శ్మశ్రు = మీసముల; పటలి = సమూహము; వ్రేలన్ = వేళ్ళాడుతుండగా; కాదంబనీ = మేఘములపంక్తిచే; ఛన్న = కప్పబడిన; కాంచనగిరి = మేరుపర్వతము; భాతిన్ = వలె; కవచ = కవచముచే; సంవృత = కప్పబడిన; దీర్ఘ = ఉన్నతమైన; కాయము = శరీరము; అమరన్ = ఉండగా; వల్మీక = పుట్టలో; సుప్త = నిద్రిస్తున్న; దుర్వార = అడ్డగింపరాని; అహి = పాము; కైవడిన్ = వలె; కోశంబు = ఒర; లోన్ = లోపల; వాలు = కత్తి; కొమరుమిగులన్ = అందము అతిశయించగా; అర్చి = బిగ్గరగా అరచి.
పేర్చి = అతిశయించి; మించి = మీరి; అశ్వంబున్ = గుర్రమును; కదలించి = బయలుదేరదీసి; కమలసంభవ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగు; ఘనుల్ = గొప్పవారి; కైనన్ = కి అయినను; పట్టరాని = పట్టశక్యముకాని; ప్రోడన్ = శక్తిమంతుని; పట్టెదను = పట్టుకొనెదను; అని = అని; జగదవనున్ = లోకరక్షకుని, కృష్ణుని; పట్టన్ = పట్టుకొనుటకు; కదియెన్ = సమీపించెను; యవనుడు = యవనుడు; అధిప = రాజా.

భావము:

ఓ పరీక్షన్నరేంద్రా! బ్రహ్మదేవుడు మొదలైన దేవతా ప్రముఖులకు కూడా పట్టనలవికాని మహా నెఱజాణ, లోకరక్షకుడు అయిన శ్రీకృష్ణుడిని పట్టుకోడానికి కాలయవనుడు తన అశ్వాన్ని ఉఱికించి గర్జిస్తూ దరికి చేరబోయేడు. అలా గుఱ్ఱం ఎక్కి అతను వస్తుంటే మిక్కిలి భయంకొల్పుతున్న రాహువు తోక వలె కాలయవనుని తీగవంటి జడ కదులుతూ ఉంది; ప్రళయకాలంలో పెద్ద సుర్యగోళపు అగ్నిశిఖల వంటి కాంతితో అతని కఱుకైన ఎఱ్ఱని మీసాలు వ్రేలాడుతున్నాయి; మబ్బుల గుంపుచే కప్పబడిన మేరుపర్వతం లాగా అతని సమున్నతదేహం కవచంతో కప్పబడి ఉంది; పుట్టలో నిద్రిస్తున్న పాము లాగా అతని ఒరలో ఖడ్గం ప్రకాశిస్తోంది.