పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : సూర్యాస్తమయ వర్ణన

  •  
  •  
  •  

10.1-1297-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మీకును వైరి; యెప్పుడును మిక్కిలి మాకును వైరి; రాజు దో
షారుఁ; డింక వచ్చు జలజాతములార! మదీయ బాలురం
జేకొనుఁ డంచు బాలకులఁ జీఁకటి దాఁచిన భంగిఁ జిక్కి రా
రా వసించెఁ దుమ్మెదలు రాత్రి సరోరుహకుట్మలంబులన్.

టీకా:

మీ = మీ; కును = కు; వైరి = శత్రువు; ఎప్పుడును = ఎల్లప్పుడు; మిక్కిలి = చాలా ఎక్కువగా; మా = మా; కును = కు; వైరి = శత్రువు; రాజు = చంద్రుడు; దోషాకరుడు = చంద్రుడు {దోషాకరుడు - దోషవర్తనకు అనుకూలమైన రాత్రిని కలిగించువాడు, చంద్రుడు}; ఇంక = ఇక; వచ్చున్ = ఉదయించును; జలజాతములార = ఓ కమలములు; మదీయ = నా యొక్క; బాలురన్ = పిల్లలను; చేకొనుడు = తీసుకోండి; అంచున్ = అని; బాలకులన్ = పిల్లలను; చీకటిన్ = చీకట్లలో; దాచిన్ = దాచిన; భంగిన్ = విధముగా; చిక్కిరి = చిక్కుకొనిరి; ఆ = ఆ యొక్క; రాక = నిండుపున్నమి; వసించెన్ = ఉన్నవి; తుమ్మెదలు = తుమ్మెదలు; రాత్రి = రాత్రి; సరోరుహ = తామరపూల; కుట్మంబులన్ = మొగ్గల యందు.

భావము:

“ఓ తామరమొగ్గలారా! చంద్రుడు మీకు మాకూ శత్రువే. అతడు దోషాకరుడు. అంటే రాత్రిని కలుగజేసేవాడు. అడుగో రాబోతున్నాడు. మా పిల్లలను స్వీకరించి భద్రంగా మీ కడుపులలో పెట్టుకుని కాపాడండి” అంటూ, చీకటి తన పిల్లలను దాచమని అప్పచెప్పాయా అన్నట్లు తుమ్మెదలు తామరమొగ్గలలో చిక్కుకుని వెలుపలికి రాలేక రాత్రి అంతా అక్కడే నివసించాయి.