పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వృషభాసుర వధ

  •  
  •  
  •  

10.1-1139-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రేపులు పాఱె గోవులకుఁ; గ్రేపులు గోవులు గోవృషంబులం
బైడె; వత్స ధేను వృషభంబులు గోపకులందుఁ జొచ్చె; నా
గోకు లా వృషేంద్రములు గోవులు లేఁగలు విచ్చిపాఱఁగా
గోచమూవిభుండు గనె గోవృషదైత్యుఁడు వెంటనంటఁగన్.

టీకా:

క్రేపులు = దూడలు; పాఱెన్ = పరుగెత్తను; గోవుల = ఆవుల; కున్ = కోసము; క్రేపులు = దూడలు; గోవులు = ఆవులు; గోవృషంబులన్ = ఆబోతులను; పైపడెన్ = చేరెను; వత్స = దూడలు; ధేను = ఆవులు; వృషభంబులు = ఎద్దులు; గోపకుల = గోపాలకుల; అందున్ = అండలోకి; చొచ్చెన్ = వెళ్ళినవి; ఆ = ఆ యొక్క; గోపకులు = గోపాలకుల; ఆ = ఆ యొక్క; వృషేంద్రములు = ఎద్దులులు; గోవులు = ఆవులు; లేగలు = దూడలు; విచ్చి = చెదిరిపోయి; పాఱగాన్ = పారిపోతుండగా; గోపచమూవిభుండు = కృష్ణుడు {గోపచమూవిభుడు - గోపకుల సేనకు అధిపతి, కృష్ణుడు}; కనెన్ = చూసెను; గోవృషదైత్యుడు = వృషభాసురుడు; వెంటనంటగన్ = తరుముతుండగా.

భావము:

ఎద్దు రూపం ధరించిన ఆ దనుజుడు వెంటపడగా దూడలు ఆవుల దగ్గరకు పరిగెత్తిపోయాయి. ఆవులు, దూడలు కలిసి ఎద్దుల వద్దకు వెళ్ళాయి. ఎద్దులు, ఆవులు, దూడలు ఏకమై గోపకుల దాపునకు చేరాయి. గొల్లలు, ఎద్దులు, ఆవులూ, దూడలూ బెదిరి చెల్లాచెదురు కాసాగాయి. అదంతా గోపనాయకు డైన గోవిందుడు కనుగొన్నాడు.