పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికలతో సంభాషించుట

  •  
  •  
  •  

10.1-1079-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను సేవించుచునున్నవారలకు నే నా రూపముం జూపఁ జూ
చినఁ జాలించి మదించి వారు మది నన్ సేవింపరో యంచు ని
ర్ధనికుం డాత్మధనంబు చెడ్డ నెపుడుం త్పారవశ్యంబుఁ దా
ల్చి భంగిన్ ననుఁ బాసి మత్ప్రియుఁడు దాఁ జింతించు నా రూపమున్

టీకా:

ననున్ = నన్ను; సేవించుచున్న = కొలుస్తున్న; వారల = వారి; కున్ = కి; నేన్ = నేను; ఆ = ఆ కొలచుచున్న; రూపమున్ = స్వరూపమును; చూపన్ = చూపించను; చూచినన్ = దర్శించినచో; చాలించి = మానివేసి; మదించి = గర్వించి; వారు = వారు; మదిన్ = మనసు నందు; నన్ = నన్ను; సేవింపరో = కొలువరేమో; అంచున్ = అని; నిర్ధనికుండు = బీదవాడు; ఆత్మ = తన; ధనంబు = ధనము; చెడ్డన్ = పోయిన ఎడల; ఎప్పుడున్ = ఎంతసేపు; తత్ = దాని యందే; పారవశ్యంబునన్ = దృష్టి కలిగి ఉండుటను; తాల్చిన = పూనిన; భంగిన్ = విధముగ; ననున్ = నన్ను; పాసి = ఎడబాసి; మత్ = నా యొక్క; ప్రియుడు = భక్తుడు; తాన్ = అతను; చింతించున్ = తలపోయును; నా = నా యొక్క; రూపమున్ = రూపమును.

భావము:

ప్రత్యక్షంగా నన్ను దర్శిస్తే, అంతటితో గర్వించి, నన్ను సేవించ రని కొలిచే వారికి నా రూపం చూపించను. దరిద్రుడు తనకున్న డబ్బు పోయినప్పుడు తదేక చింతలో మునిగినట్లు, నేను కనపడకుండా ఉంటేనే నన్ను కోరేవారు నా రూపాన్ని ధ్యానిస్తారు.