పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పర్వత భంజనంబు

  •  
  •  
  •  

10.1-893-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వినుఁ డీ శైలము కామరూపి; ఖలులన్ వేధించు; నాజ్యాన్నముల్
మొప్పింపఁగ నాహరించె; మనలన్ న్నించెఁ; జిత్తంబులో
నుకంపాతిశయంబు చేసె మనపై" నంచున్ సగోపాలుఁడై
జాక్షుండు నమస్కరించె గిరికిన్ వందారు మందారుఁడై.

టీకా:

వినుడీ = వినండి; శైలము = కొండ; కామరూపి = కోరిన రూపము పొంద గలది; ఖలులన్ = దుర్జనులను; వేధించున్ = బాధించును; ఆజ్య = నేతి; అన్నముల్ = వంటలు; మనమున్ = మనము, మనసులకు; ఒప్పింపగన్ = సమ్మతించగా, బాగుండగా; ఆహరించెన్ = ఆరగించెను; మనలన్ = మనలను; మన్నించె = ఆదరించెను; చిత్తంబు = మనసుల; లోన్ = లో; అనుకంపాతిశయము = మిక్కిల కరుణచూపుట; చేసెన్ = చేసినది; మన = మన; పైన్ = మీద; అంచున్ = అనుచు; సగోపాలుడు = గొల్లవారితో కూడినవాడు; ఐ = అయ్యి; వనజాక్షుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; నమస్కరించెన్ = మొక్కెను; గిరి = కొండ; కిన్ = కు; వందారు = సేవించువారికి; మందారుడు = కల్పవృక్షమువంటివాడు; ఐ = అయ్యి.

భావము:

మ్రోక్కే వారికి కల్పవృక్షమైన కమలాయతాక్షుడు కృష్ణుడు “ఓ గోపకులారా! ఆలకించండి. ఈ కొండ ఇష్టం వచ్చిన రూపం ధరించ గలదు. మనము ఆరగింపు చేసిన నేతిబువ్వలు చక్కగా భుజించింది. మనలను ఆదరించింది. మన యెడల కారుణ్యం చూపింది. దుర్మార్గులను ఈ కొండ పీడిస్తుంది.” అంటూ వారితోపాటు తాను కూడ ఆ కొండకు చేతులు జోడించాడు.