పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శుకముని యాగమనంబు

  •  
  •  
  •  

1-523-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధూతోత్తమ! మంటి, నేఁడు నిను డాయం గంటి, నీవంటి వి
ప్రరుం బేర్కొను నంతటన్ భసిత మౌఁ బాపంబు నా బోటికిన్,
దాలోకన, భాషణార్చన, పదప్రక్షాళన, స్పర్శనా
ది విధానంబుల ముక్తి చేపడుట చింతింపంగ నాశ్చర్యమే?

టీకా:

అవధూత = అవధూతలలో {అవధూత - పైపొరలు తొలగినవాడు, బ్రహ్మనిష్ఠతో వర్ణాశ్రమాచారములను విడిచిన సన్యాసి, దిగంబర రూప సన్యాసి, భగవంతుని తన అవధానమున నిలుపుకొన్నవాడు, విడువబడిన ఇహలోకార్థములు గలవాడు}; స్థూలార్థము దిగంబరుడు; సూక్ష్మార్థము జీవులలో వసించు పరబ్రహ్మము చుట్టును కల మాయ అను పొరలు తొలగినవాడు}; ఉత్తమ = శ్రేష్ఠుడా; మంటి = బ్రతికితిమి; నేఁడు = ఇవేళ; నినున్ = నిన్ను; డాయన్ = దగ్గరలో; కంటి = చూడకలిగితిమి; నీ = నీ; వంటి = వంటి; విప్ర = బ్రాహ్మణ; వరున్ = శ్రేష్ఠుని; పేర్కొనున్ = తలచిన; అనుకొనిన; అంతటన్ = అంతటనే; భసితము = భస్మము; ఔన్ = అగును; పాపంబున్ = పాపములు; నా = నా; బోటి = వంటి వాని; కిన్ = కి; భవత్ = తమను; ఆలోకన = చూచుట; భాషణ = మాట్లాడుట; అర్చన = పూజించుట; పద = పదముల; ప్రక్షాళన = కడుగుట; స్పర్శన = స్పర్శించుట; ఆది = మొదలగు; విధానంబుల = పద్ధతుల వలన; ముక్తి = ముక్తి; చేన్ = చేతిలో; పడుట = పడుట; దొరకుట; చింతింపంగన్ = ఆలోచించిన; ఆశ్చర్యమే = ఆశ్చర్యమా ఏమి.

భావము:

అవధూతశిరోమణీ! నేను ధన్యుణ్ణయితిని. నేడు నీవు నా వద్దకు రావడం చూచితిని. నీవంటి బ్రాహ్మణ శ్రేష్ఠుని నామం ఉచ్చరించినంత మాత్రమున పాపాలన్నీ భస్మీపటల మౌతాయి. ఇక నిన్ను దర్శించుట, నీ మాటలు వినుట, నిన్ను అర్చించుట, నీ కాళ్లు కడిగుట, నిన్ను స్పృశించుట మున్నగు విధానాలు లభించడం వలన నా వంటి వానికి మోక్షం సంప్రాప్తించుటలో ఆశ్చర్య మేముంది.