పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-362-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిక్కుల రాజుల నెల్లను
క్కించి ధనంబు గొనుట, యకృతసభ ము
న్నెక్కుట, జన్నము సేయుట,
నిక్కము హరి మనకు దండ నిలిచినఁ గాదే?

టీకా:

దిక్కుల = దిక్కుల కల; రాజులను = రాజులను; ఎల్లను = అందరిని; మక్కించి = గెలిచి; ధనంబున్ = ధనమును; కొనుట = తీసుకొనుట; మయ = మయునిచేత; కృత = కట్టబడిన; సభ = సభా భవనమును; మున్ను = ముందు; ఎక్కుట = అధిరోహించుట; జన్నము = యజ్ఞము; సేయుట = చేయుట; నిక్కమున్ = నిజమునకు; హరి = కృష్ణుడు; మన = మన; కున్ = కు; దండన్ = ప్రాపుగ; నిలిచినన్ = నిలబడుటవలననే; కాదే = కాదా.

భావము:

నానా దిశలలోని నరనాథులను సమరంలో జయించి అశేష ధనరాసులను కైవసం చేసుకొన్నదీ, మయసభను అందుకొన్నదీ, రాజసూయ మహాయాగం నిర్వర్తించిందీ నిజానికి ఆ వాసుదేవుడు మనకు బాసటగా నిల్చినందువల్లనే కదా!