పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని గాలసూచనంబు

  •  
  •  
  •  

1-341-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దూలు గుడువవు చన్నులు;
దూలకున్ గోవు లీవు దుగ్ధము; లొడలం
బీలు మానవు; పశువులఁ
గూవు వృషభములు తఱపి కుఱ్ఱల నెక్కున్.

టీకా:

దూడలున్ = దూడలు {దూడ - ఆవు/గేదె పిల్ల, పెయ్య, లేగ, లేగదూడ }; కుడువవు = పాలు తాగుట లేదు; చన్నులున్ = చన్నుల నుండి; దూడల = దూడల; కున్ = కి; గోవులు = ఆవులు; ఈవు = ఇయ్యవు; దుగ్ధములు = పాలు; ఒడలన్ = దేహములకు; పీడలు = బాధలు, వ్యాధులు; మానవు = మానుటలేదు; పశువులన్ = పశువులను; కూడవు = కలియవు; వృషభములు = ఎద్దులు; తఱపి = లేగ; కుఱ్ఱలన్ = దూడలను; ఎక్కున్ = ఎక్కును.

భావము:

దూడలు పాలు తాగటం లేదు. ఆవులు దూడలకు పాలీయటం లేదు. దేశమంతటా వ్యాధులు వ్యాపించాయి. ఎద్దులు ఆవులను వదలి దూడల మీద ఎక్కుతున్నాయి.