పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : అశ్వత్థామ గర్వ పరిహారంబు

  •  
  •  
  •  

1-180-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుర్భరబాణానలమున
ర్భములో నున్న శిశువు నసంతాపా
విర్భావంబునుఁ బొందెడి
నిర్భరకృపఁ గావుమయ్య, నిఖిలస్తుత్యా!

టీకా:

దుర్భర = భరింప శక్యంకాని; బాణానలమునన్ = బాణాలనే అగ్నివలన; గర్భము = (నా) గర్భం; లోన్ = లోపల; ఉన్న = ఉన్నట్టి; శిశువు = శిశువు; ఘన = అత్యధికమైన; సంతాప = బాధ; ఆవిర్భావంబునున్ = పుట్టుటను; పొందెడిన్ = పొందుతోంది; నిర్భర = నిండు; కృపన్ = దయతో; కావుము = కాపాడుము; అయ్య = తండ్రీ; నిఖిలస్తుత్యా = శ్రీకృష్ణా {నిఖిలస్తుత్యుడు - సర్వులచే స్తుతింపబడువాడు, కృష్ణుడు}.

భావము:

భరింపరాని ఈ శరాగ్నికి నా కడుపులో ఉన్న పసిగందు కసుగంది పోతున్నాడు. దయతో రక్షించవయ్యా, సకల శరీరులచేత స్తుతింపబడువాడా! శ్రీకృష్ణా!