పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం 10

901
రథరాజనంనుఁ డయి మీద
కంఠు రావణు డియించినాడు;
శ్రీకృష్ణమూర్తియై శిశుపాలముఖ్య
పాకారి వైరులం రి మార్చినాడు;
మీద బుద్ధఁడై టమీదఁ గలికి
యైమించగలఁడు శ్రీరి యో కుమార!
జాతలోచను శౌర్య సంపదల
వియె శేషునకైన వర్ణింప
యేనునీవునుఁ బార్వతీశుండు మనువు
మౌనులుఁ గొందఱు నుజేశవరులు
నెఱుఁగుటఁగాక యయ్యిందిరానాథు
నెఱుగంగ నేర్తురే యితరు లెచ్చోట
రివిభూతుల సంగ్రహంబిది యిదియ
రిఁనాకు దెలిపిన బ్భాగవతము
వినుపింపు మిది నీవు విపులంబుగాఁగ
నులకు హరిభక్తి మకూరు నటుల
వెయించు మిది ధాత్రి వినునట్టి వారి
యింప లేదంబుజాక్షుని మాయ”
నినారదునకుఁ బద్మాసనుం డట్లు
వినఁజేసినట్టి యవ్విధ మెల్లఁ దెలుప

పరీక్షిత్తు శుకయోగిని సృష్టి విషయమై ప్రశ్నించుట

911
రుదుగ వినుతించి, యాయోగి తోడ
ఱియు నిట్లుని పల్కె మానవేశ్వరుఁడు
“పమేష్ఠి యెబ్భంగిఁ ద్మాక్షుఁ జూచె?
రియెద్ది యతని కిట్లానతి యిచ్చె?
తఁడు నారదునకు నారహస్యంబు
హివృత్తి మఱియును నేమని తెలిపె?
రఁగుఁ గల్పము వికల్పంబు నే పగిదిఁ
రిమితం బగు? నెట్టి గిదిఁ గాలంబు
విసిల్లు? బ్రహ్మజీవిత కాలమెంత?
లిగిన బహు కర్మతు లెట్టు నడచుఁ?
గొలఁదిగా నివియు, భూగోళ లక్షణము,
లువైన వర్ణాశ్రమాచార తతులు,
నాదిపూరుషు రాజవతార గతులు,
నాదేవదేవుని యాశ్చర్య కథలు,
యులక్షణము, తత్ప్రయుక్త సంఖ్యయును,
దీశు సేవించు రణియు, మఱియు
వేపురాణాది విహితనిర్ణయము,
నాదిమంబైన యధ్యాత్మ తత్త్వంబు,
నాదిగాఁగల రహస్యంబుల నెల్ల
నారంబునఁ దెల్పుయ్య నాకిపుడు”

శుకయోగి పరీక్షిత్తుఁడడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చుట

921
నుటయు శుకయోగి యాయభిమన్యు
యునితో వేడ్కఁశుకొత్తఁ బలికె
“ధాకు నాత్మతత్త్వవిశుద్ధిఁ గలుగ
రీతిగాఁ నెద్ది వర్ణించె నచ్యుతుఁడు
నాథ! యదియ విచ్చలవిడిం[263] బలుకఁ
నుఁదానె నీకు నుత్తరమగు వినుము

శ్రీ మన్నారాయణుండు బ్రహ్మకు ప్రత్యక్షమగుట

లువ నిజాసన లినంబు నందు
నిలిచి సర్జన[264] కాంక్ష నెమ్మదిం బొడము
నంలోఁ “దప, తప” నుమాట చెవుల
వింగాఁ బడిన నవ్విధము చింతించి
దిఁదన్నుఁ దపము సేయఁగఁ దలకొలుపు[265]
దురని[266] నిలిచి తపంబతినిష్ఠ
వేయు[267]దివ్యాబ్జముల్ విసు వాత్మ లేక
సేయంగ మిగుల లక్ష్మీపతి మెచ్చి
నుపమానంబైన యాత్మలోకంబు
బడం జేసె నా మలాసనునకు
చ్చోటు వీతభక్లేశమోహ
చ్చరిత్రుల చేత సంసేవితంబు
ము, రజంబునుం త్సంకరంబు
ర వచ్చో శుద్ధగు సత్వ మలరు



[263] విచ్చలవిడిన్- యథేచ్ఛగ
[264] సర్జన- సృజన, సృష్టి
[265] తలకొలుపు- పురిగొలుపు
[266] పదురు అని- తమకించుట, వేగరించుట, ఉసిగొలుపుట అని
[267] వేయు- వెయ్యి, 1,000

931
లుఁగవు మాయయుం గాలక్రమంబుఁ
లుఁగఁదా నెలవున కంటెఁ బరంబు
శ్యామావదాతులు[268] లజలోచనలు
కోమలాంగులు మౌళికుండలోజ్జ్వలులుఁ
భావిత ఘన చతుర్బాహులు నైన
శ్రీవైష్ణవులు విరాజిల్లుదు రచట
లోకమునకు మధ్యప్రదేశమునఁ
జాభక్తి విభూతి హితయై లచ్చి
రిచర్య యొనరింప హురత్నమయతఁ
రఁగెడు డోలికెపైఁ[269]బవ్వళించి
యున్నచతుర్బాహు నురుశుభదేహు
వెన్నుని వైకుంఠవిభుఁ బీతవసను
మ సునంద నందాది సేవితుని
ిమిలేకప్పుచే భాసిల్లు నతని
చక్ర జలజ గదాయుక్త పార్శ్వుఁ
రుణ రసాప్లుత మనీయ నేత్రు
రిఁ బరేశ్వరుఁ[270] గాంచి యానందపూర
రితాత్మరంగుఁడై పంకజాసనుఁడు
పద్మముల యందు ప్రణతి యొనర్చి
విదిత మార్గంబున వినుతులు సేయ


[268] శ్యామ- నల్లని, అవదాతలు- అందమైన, స్వచ్ఛమైన, శ్రేష్ఠమైన వారు
[269] డోలిక- ఉయ్యాల
[270] పరేశ్వరుఁడు- శ్రేష్ఠుడైన ఈశ్వరుఁడుశ్రీహరి

941
సంసిల్లుచు దేవసార్వభౌముండు
దంద్యుతులు మించ ధాత కిట్లనియె

బ్రహ్మ, నారాయణ సంవాదము

శీసంయుత! నీవు సేసిన యట్టి
మేలైన తపమున మెచ్చితి నేను
నాలోక మాలోకము సేసి తిటుల
నీ లావుఁ గా దిది నరయ నా కరుణ
లయక ననుఁ గొల్చుట్టి వారలకు
లయక[271] ననుఁ గాంచు నందాక సుమ్ము
డుగుము వరమెద్ది యైన నీ కోర్కి
డముట్టె” ననుటయుం మలాసనుండు
జలోచన! యెన్నిరణుల నైన
తెలియ నరూపివై దీపించు నీకుఁ
పరాపరరూప ల్యాణ మహిమ
మునెఱుంగఁగ నాకు మోదంబుఁ గలదు
ణితగుణ! యూర్ణనాభి చందమున
ములం గని ప్రోచి మయింతు వెటుల
నావిని యా రమానాథుండు వేడ్క
నోనజాసన! యుక్తి నీ విప్పుఁ
రంగ నడుగు రస్యంబుఁ దెలుప
వంతమైన శ్రీభాగవతంబు


[271] నలయక- అతలాకతలముకాక

951
గురుపురాణంబు సంకుచిత మార్గమునఁ
రుణింతు ననుచు లక్షణ పూర్వకముగ
నాతి యిచ్చి విశ్వాదిని నేన
కానంగ బడుదు నిక్కంబుగా నడుమ
వాడఁ గడపటం లవాడ నేన
పొలుపుఁ గాంతును జగంబున లోన వెలిని
నుఁగొల్చువారలు నామాయఁ గడతు
నుచు నంతర్హితుంయ్యె నవ్విధియు

బ్రహ్మ నారద సంవాదము దశలక్షణ వివరణము

ప్రజాసృష్టి వర్తన సంభ్రమమున
నొరంగ నారదుం డొకనాఁడు వచ్చి
నీశ! నీవు న న్నడిగిన యటులఁ
విలి ప్రశ్నముసేయ ధాత యమ్మునికి
తులిత దశలక్షణాంకమై భాగ
మన మెఱయు నివ్వరపురాణంబు
నొడివె నా నారదుండును వ్యాసమునికి
నొడఁబాటుగాఁ దెల్పె నూహింప నవియుఁ
గానంగఁ బడిన సర్గము, విసర్గంబు,
స్థానంబు, మఱియు పోణము, నూతులును,
ప్రమించు, మన్వంతములు, నీశాను
లు, నిరోధ, ముక్తత లాశ్రయంబు,


961
నఁబ్రసిద్ధంబు లింఱిని యా దశమ
ముశుద్ధిఁ గూర్చి నిమ్ములకుఁ దొమ్మిదియు
సుకృతులు వివరింపఁ జూతురం దాదిఁ
బ్రకృతి వికార సంవము సర్గంబు,
లువ సేసిన సర్జము విసర్గంబు,
లినాక్షు జయము తాకమనం[272] బఱఁగు,
ని భక్తానుగ్రహంబు పోషణము,
యుకర్మ వాసన లూతు లనంగ,
తులంబులైన స్వాయంభువముఖ్య
మును, ధర్మముల్ న్వంతరములు,
వెన్నుని యవతార విహరణక్రమము
లెన్నంగఁ బలుకుట శాను కథలు,
రితన లోననే ఖిలంబు నణఁచి
యుచు నిద్రించుది నిరోధంబు,
జీవుని నిజరూపసిద్ధియ ముక్తి,
భావింపఁగాఁ బరబ్రహ్మమాశ్రయము
నినారదునకు నయ్యంబుజాసనుఁడు
వినిపించినట్టి యవ్విధమున యోగి
భిమన్యుసుతున కౌనఁ దెల్పె” ననుచు
శుమతి యైనట్టి సూతుండు వలుక


[272] తానకము- స్థానకము

సూతునకు శౌనకాది మహర్షుల ప్రశ్న

971
వినిశౌనకాదులు విస్మయంబంది
ఘాత్మ! యటు తీర్థయాత్రఁ గైకొనిన
ఘుండు విదురుఁ డేయ్యె, నేమేమి
యొరించె? నెచ్చోట నుండె? నటంచు
డుగుండు నృపుఁడు నీ ర్థంబె తన్ను
డిగిన శుక యోగి కంతయు నొడివె”
నుటయు నా శౌనకాదు “లవ్విధము
వినఁజేయవే” యని వేడ్కఁ బల్కుటయు

ఆశ్వాసాంత గద్య - కృతి భర్త ప్రశంస

నియిట్లు నవమన్మథాకారు పేర
జాక్ష చరణసేనధన్యు పేర
పంతిర్వడి[273] గర్వభంజను పేర
నంచిత క్షత్రవిద్యాధుర్యు పేర
కేళ కర్ణాట కీకట పాండ్య
చేచోళాదిక క్షితినాథ కోటి
మంజుల కోటీర మాణిక్య దీప్తి
పింరీకృత పాదపీఠుని పేర
దభ్ర గోక్షీర చందన చంద్ర
శైల హరహీరహార కర్పూర
శోభంకకార భాసురకీర్తి పూర
సౌభాగ్య నిలయితాశాచక్రు పేర


[273] పంచ తిర్వడి- పంచ తిరువడి

981
హిత నిజదయాతన కవీంద్ర
న మహాంతర హుల దౌర్గత్య
నిహ దుర్దమ తమోనిరసన కేళి
దిస యౌవన భవ్య తిగ్మాంశు[274] పేర
ఖండితాహితు పేర గండర గూళి
గంర గండాంక లితుని పేర
సంర గాండీవచాపుని పేర
సంగీత సాహిత్య తురుని పేర
బిరుదు మన్నెవిభాళ బిరుదాఢ్యు పేర
మన్నె కందర్ప ఫాలాక్షు పేర
రిరాజనిటుల పట్టాక్షర శ్రేణి
రిమార్జ కోదార దపద్ము పేర
త్యభాషా హరిశ్చంద్రుని పేర
నిత్యధర్మా చార నిపుణుని పేర
జైవాతృ కాన్వయ మధిక బుక్క
భూరోత్తమ పౌత్రపుత్రుని పేర
త్రేయ గోత్ర విఖ్యాతుని పేర
పాత్రదాన విశేషపారీణు పేర
సప్తసంతానవంతుని పేర
సురుచిరాపస్తంబసూత్రుని పేర


[274] తిగ్మాంశుడు- సూర్యుడు

991
రెవీటీ పురాధ్యక్షుని పేర
శ్రీమ్య రామపార్థివ పౌత్రు పేర
తుగరేవంతనాథుని[275] పేరఁ జంద్ర
గిరిముఖ్యదుర్గలక్ష్మీభర్త పేర
రిపూర్ణ గోపమాంబాగర్భ కలశ
నిధి పూర్ణిమాచంద్రుని పేర
కీర్తిఁ దిమ్మ భూకాంత కుమార
చితిమ్మ భూపాలశేఖరు పేర

కృతికర్త ప్రశంస

శ్రీనిత్య విలసితశ్రీవత్స గోత్ర
మానిత నాగయామాత్య పుత్రుండు
వివిధాష్టభాషా[276]విత్వ ధుర్యుండు
విసార్వభౌమ విఖ్యాత పదుండు
గురుమతి దోనూరి కోనేరునాథుఁ
రుదుగాఁ జెప్పిన తిచిత్రమగుచు
లాలితంబై రమ్యక్షణంబైన
బాభాగవత ప్రబంధం<బునందు

ప్రథమాశ్వాస విషయానుక్రమణిక

శౌకాదిప్రశ్న సంవిధానంబు,
సూనృతోన్నతుఁ[277]డైన సూతు సమ్మతియు,
లినాక్షు భక్తియు, నారదు కథయు,
చెలఁగు పురాణంబు చెప్పిన తెఱఁగు,


[275] తురగ రేవంత నాథుడు- అశ్వశిక్షక దళములకు అధిపతి
[276] అష్టభాషలు- 1. సంస్కృతము, 2. ప్రాకృతము, 3. అచ్చతెనుగు, 4. దేశ్యము, 5. గ్రామ్యము, 6. కన్నడి, 7. హళేకన్నడి, 8. అరవము. [బ్రౌణ్యనిఘంటువు]
[277] సూనృతోన్నతుఁడు- ప్రియము సత్యములతో ఉన్నతుడు