పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగ-4-1101-1200

1101

ట్టివిధేయత కాత్మలో మదము
పుట్టియా జమదగ్ని పుత్రునిం జూచి
మిత్తు ననుఁడు నవ్వరకీర్తిశాలి
ముగా బ్రదికించె వారల మరల
నొక్కనాఁ డటమీద నొంటిమై నుండ
క్కార్తవీర్యుని యాత్మజుల్ వచ్చి
మదిలోని క్రోము లెల్ల మాన
దగ్ని తలగొంచుఁ నిరి వేగమున
అంనా రాముండు న్నలం గూడి
కాంతారమున నుండి గ్రక్కున వచ్చి
క్రందుగాఁ[285] బొరలి శోము చూపు తల్లి
నందంద యూరార్చి న్నలం జూచి
యీపితృదేహంబు నిచ్చట మీరు
కాపాడుఁడీ” యని ట్టడ చేసి
దిగ్గున యా మహిష్మతిపురి కేఁగి
యెగ్గొనర్చిన యమ్మహీశు నందనుల
అంర సమయించి, యంతటఁ దనదు
డెందంబు లోని కడింది రోషంబు
పాక, యిల నిరుదియొక్క మార్లు
రోక త్రుంచె నుగ్రుండయి నృపుల
తండ్రి తల తొంటి నువుతోఁ గూర్చి
నుపమ సరణిచే యాగముల్ చేసె
కుని ననుభావహితునిం[286] గాఁగ
నొరించి ఋషులలో[287]  నునిచెఁ జిత్రముగ
తానుమహేంద్రాద్రిఁ పముఁ గావించు
పూనికైఁ గదలి, నిప్పుడునున్నవాఁడు
శురామకథా ప్రపంచ మీరీతి
ణీశ! తెలిపితిఁ రవాయి వినుము

విశ్వామిత్ర, యయాతి ప్రముఖుల చరిత్రములు

దగ్ని తల్లికి నకుఁడౌ గాధి
నిధి పుత్రు విశ్వామిత్రుఁ గనియె

[285] క్రందు- విలపించు

[286] అనుభావసహితుడు- ప్రభావవంతుడు

[287] ఋషులలో- సప్తర్షులలో

1111

భూలాధిప! తపస్ఫురణంబు చేత
నాతండు బ్రహ్మర్షి నఁగ బెంపొందె
పురూరవునకు నాత్మజుండైన
ఘుతేజున కాయు ను నృపాలునకు
నంనుండై యొప్పె హుషుఁడా రాజ
కంర్పహరునకుం[288]  లిగె యయాతి
తఁడు శుక్రుని బిడ్డ గు దేవయాని
తిగాఁగ నుండెఁ దచ్చరితంబు వినుము
విసిత కీర్తియై వృషపర్వుఁడనఁగఁ
లుగు దానవనాథు న్యకయైన
ర్మిష్ఠ యొకనాఁడు ఖులతోఁ గూడి
ర్మిలిఁతో[289] దేవయానయు నడువ
నువనంబున కేఁగి యుడుగక విరుల
చయం[290] బొనరించి లపు వహించి
వొక్కచో జలకేళి యొనరఁ గావించి
గ్రక్కునం దా మున్నుగానీరు వెడలి
యక యా దేవయాని వస్త్రంబు
రియించుటయు శుక్రనయ వీక్షించి
గురుబిడ్డ నే, శిష్యు కూఁతుర వీవు
తరత్వము[291] చూడ దాసివి నాకు

[288] కందర్పహరుడు- శంకరుడు

[289] అర్మిలి- స్నేహము

[290] ఉపచయము- పోగుచేయుట

[291] తరతరత్వము- తారతమ్యము, తరతమభేదము

1121

గుదువె నా వల్వ రియింప నిట్టి
తెగువ నీ కిపుడె నే తెఱఁగున వచ్చె?”
నిపల్కి మఱియును నరాని కొన్ని
కినుక మాటలు చాలఁ గెలయ[292] శర్మిష్ఠ
కాఁగి[293]వస్త్రము లేని విపుత్రిఁ బట్టి
లోఁ[294] యొక నూతి లోఁబడదొబ్బి
పట్టణమునకుం న చెలుల్ గొలువఁ
నుదెంచె నంత నా మయంబునందు
మృయార్థియై వచ్చి మెలఁగు యయాతి
తీశుఁ డచ్చోటు రణిగా[295] వచ్చి
యాకుక్కినూతిలో[296]  నారీతి నున్న
యావిసుతఁ గాంచి ద్భుతంబంది
యుత్తరీయ మా రుణిపై వైచి
చేయివట్టించి గ వెడలించి
యెవ్వతె వీవేల యిట్లయ్యె?” ననుఁడు
వ్వనితామణి తని కిట్లనియె
నీశ! యేను శుక్రాత్మజ, నీసుఁ
విలి యా వృషపర్వు నయ నన్నిటులఁ
గావించె, నిపుడు నీ రము గైకొంటిఁ
గావున నీవె నా కాంతుండ వింక;

[292] కెలయు- వికటముగా పలుకు

[293] కాగు- కోపముతో తపించు

[294] లోగక- వెనుదీయక

[295] సరణి- త్రోవ, దారి

[296] కుక్కి- ఇఱుకు

1131

తొల్లియా గురుని పుత్రుండైన కచుఁడు
నెల్లభంగుల బ్రాహ్మణేతరుండైన
తియగు నట్టి శాపంబు నా కొనఁగె
జికాశి![297] కావునం జేకొమ్ము నన్ను”
నుఁడు నా నృపతియు నంగీకరించి
నియె నింతియుఁ దన దనంబు చేరి
యింయు వరుసతో నెఱిఁగింప శుక్రుఁ
డంకంతకు రోసి ప్పురి వెడలి
రుగ నా వృషపర్వుఁ తి భీతి వచ్చి
ణముల్ వట్టుక చాలఁ బ్రార్థించి
వడం దన బిడ్డ తని పుత్రికకు
చెలులతోఁ గూడ దాసిగ నప్పగించి
లఁపులో దలముగాఁ[298]  లకొని యున్న
క మానిచి తొంటి తి నిల్వఁ జేసె
ద్దేవయానియు మ్మహీనాథు
నొద్దకు నేఁగు నుద్యోగంబుఁ దెలుప
న్నియ నా దైత్యన్యతో శుక్రు
డెన్నికగాఁ దోడ్క యేఁగి భూపతికి
వొప్పించె దీవెన లొసఁగి “శర్మిష్ఠ
నెప్పుడు జేరకు మీయని యనుచు

[297] జితకాశి- జయశీలుడు

[298] తలము- అడ్డుగా

1141

రిగె, నచ్చట నంత యాదేవయాని
ణీశు కడఁ బ్రమోదంబున నుండి
దువు, తుర్వసుఁడును నఁగల్గునట్టి
యాత్మజులఁ దనూజాతులం గాంచె
యింతి యెక్కింతను పరాకైన
దైయుండ శర్మిష్ఠ యారాజుఁ జేరి
పుత్రుల హృద్యాను పూరు నామకులఁ
బాత్రులం గ్రమమున భాసిల్లఁ గనియె!
దివిని యా శుక్రుఁ లిగి యానృపుని
ముదుకఁగా శపియించె మోహంబు దఱుగ
అంనమ్ముదిమిచే లసి యయాతి
కాంతిమించిన పుత్రణము నీక్షించి
శాపజనితవార్థకముఁ గైకొనుచు
నెసిన జవ్వనం బిండని పలుక
నంఱు మేకొన రుగంగఁ జూచి
అంపూరుండు మేన సమ్మతించె
తీశుఁ డప్పుడా శాపవార్థకము
గిలించి తా నందెఁ ద్యౌవనంబు
హుష పుత్రుఁడు జవ్వమునఁ గొన్నేండ్లు
హిత భోగములచే నములోఁ దనిసె

1151

యోవినిమయం బంతఁ జాలించి
భాజ్ఞుడగు పూరుఁ ట్టంబుఁ గట్టి
మ పుత్రులకు నల్గడల రాజ్యంబు
యెపక విభజించి యిడి శాంతుఁడయ్యె

పురువంశ వృత్తాంతము

అందుమీ[299] కూటస్థుఁ గు పూరు వంశ
మిందువంశవతంస![300]  యెఱిఁగింతు వినుము
పూరునామకుఁడైన భూవరుసుతుఁడు
మేరుధీరుఁడు జనమేజయుం డలరె
తఁడు ప్రవిద్వాంసుఁ ను పుత్రుఁ గనియె
నికి సుతుఁడయ్యె నఁట ప్రథి[301] తందు
చారుపదుం డాత్మజాతుం డతనికి
సూగణ్యుండైన సుద్యుఁ డాతనికి
హుగవుం డతనికిఁ బ్రభవించె నతని
హిమాంశుతేజ! సంయాతి జనించె
తఁడు హంయాతి ను పుత్రుఁ గనియె
నాతండు రౌద్రాశ్వుఁ ను సూనుఁ గాంచె
ని కెన్న ఋతేయుఁ ను పుత్రుఁడయ్యె
నికిం దగఁ గల్గె నంతిసారుండు
సుతి యా నృపతికి సుతుఁడయ్యె నతని
లనాభుఁడు రైభి నువాఁడు వొడమె

[299] అందుమీ- ఆ తరువాత

[300] ఇందువంశవతంస- పరీక్షిత్తు, చంద్రవంశానికి సిగబంతి కనుక

[301] ప్రథిత- ప్రసిద్దుడు

1161

నికి నందనుం డైన దుష్యంతుఁ
తులితగతి ధాత్రి ధిపుఁడై యుండి
మునుగాధినందనమునికి మేనకకు
నియించి కానన స్థలి శకుంతములు
చిగురొత్తు కరుణఁ బోషించిన యట్టి
గుట శకుంతల ను పేరఁ గలిగి

పొసఁగఁ గణ్వునకుఁ బెంపుడుఁ గూతురైన
మానరూపరేఖామృత సరసిఁ
డిమి వేఁటకు నేఁగి గాంధర్వ సరణిఁ
తిగాఁ జేపట్టి ప్రమదంబు గాంచె
ణీశ! యతనికా రలాక్షి యందు
తుండు నాఁగ సంవమందె సుతుఁడు
తఁడు మరుత్సోమ ను నిష్టి సేయ
విథుఁ డాత్మజుఁ డయ్యె వేల్పు లొసంగ
యులై యా వితక్షితీశునకు
నియించిరఁట బృహక్షత్ర సంకృతులు
రంతిదేవుండను రాజు సత్కీర్తి
మంతుండు సంకృతి హిపతి సుతుఁడు
రికి నర్పితముగా తిభక్తి నతిథి
రుల కన్నంబిడి సుధపై వెలసె

1171

తీశ! యా బృహత్క్షత్రుని పుత్రు
గుసుహోతృని పట్టి స్తి పెంపొందె
నికి నజమీఢు నఁ బేరు కలుగు
సుతుఁడు వంశమునకు శోభ యొనర్చె
నికి నళిని యంమరు వంశమునఁ
బ్రతిలేక వెలసిరి పాంచాలనృవులు
నికే యాత్మజుం య్యె వేరొక్క
తియందు ఘనుఁడైన సంవరణుండు
నికి సూర్యకన్యకయైన తపతి
తియయి కురుఁడను ననాథుఁగాంచె
రంగ కురుపుత్రు డైన సుహోతృ
కుమునఁ గలిగె బేర్కొన బృహద్రధుఁడు
తఁడు జరాసంధుఁను సూనుఁ గనియె
తఁడు చాలఁ బ్రసిద్ధుఁ య్యె నిద్ధాత్రి
ఱియు జహ్నుండు కుమారుఁడై వెలసె
లెడు కురుమహీల్లభ మణికి
సుథుఁడా నృపతికి సూనుఁడై వెలసె
నిరుపమ సుతుఁడతనికి విదూరథుఁడు
నియించె నతనికి సార్వభౌముండు
నితుఁ డవ్విభునకు యసేన నృపతి

1181

రాధికుం డతని కా రాజున కయుతు
డార్మనిధి పుత్రుఁ య్యె క్రోధనుఁడు
నందనుండు దేవాతిథి యతని
యఁ గక్షర నాముఁ డాత్మజుండయ్యె
నియె దిలీపు నా నుఁడు ప్రతీపుఁ
నువానిఁ గాంచె నయ్యవనీశ్వరుండు
సుధేశ! యతఁడు దేవాపి శంతనుల
మాన బాహ్లికుం ను వారిఁ గనియె
శంతనుండు కామాతురుం డగుచు
దాకన్యకను సత్యవతిఁ జేపట్టె
త్యవతికె సుమ్మట మున్నె పుట్టె
వ్యామునీంద్రుండు నజాక్షమూర్తి
యోనగంధి నా నొండొక్క పేరు
రాజిల్లు నట్టి యా రాజీవముఖికి
ధుర్యులు చిత్రాంగదుండు విచిత్ర
వీర్యుండు ననఁ బ్రభవించిరి సుతులు
శంతనునిఁ జేరి యఁట మున్నెగంగ
భీశూన్యుఁ[302] డైనట్టి భీష్మునిం గనియె
క్షితినాథ! యందు విచిత్రవీర్యునకు
తివల నంబిక యంబాలికయును

[302] భీశూన్యుడు- భీతి లేనివాడు, భీష్ముడు

1191

ని యానతిఁ జేసి మ్మతిం దమ్ము
నువుగా దయసేయు నావ్యాసువలన
శూరుల ధృతరాష్ట్ర శుభమతిఁ బాండు
ధాణీశుఁ డను సునయులఁ గనిరి
ద్రాత్మ! పాండు భూతికిఁ గుంతియును
మాద్రియు ననియెడు గువలై రందు
పాండుభూవరుఁడు శాప్రాప్తిఁ కలిగి
యుండిసంతతి కని యోచించు కతన
ర్మానిలేంద్రుల యఁ గుంతిఁ గాంచెఁ
బేర్మియుధిష్ఠిర భీమ ఫల్గుణుల
మాద్రినాసత్య సంబంధంబు కతన
ద్రీతి[303] నకులుని హదేవుఁ గనియె
అంర్జునుని పుత్రుఁ భిమన్యుఁ డనగ
నెందును నెన్నికకెక్కె[304] మీ తండ్రి
వినుము! పరీక్షిదుర్వీశుని సుతుఁడు
మేజయుం డింక గతి పాలించు
యాతికి బెద్ద యాత్మజుండైన
యాదూత్తము వంశ మాలింపు మింక

యదువంశ క్రమము

దువుకుం దొలుసూనుఁ గు శతజ్జితున
కొవె హైహయుఁడను నుర్వివిభుండు

[303] అద్రీతి- అదే విధముగ

[304] ఎన్నికకెక్కు- ప్రసిద్ధుడగు