పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

యక్షగానములు : నౌకా చరిత్రము - మిగతా భాగము

త్యాగరాజవిరచిత
నౌకాచరిత్రము – యక్షగానము
(మిగతా భాగము)

కీర్తన. - 10.
కాపి – చాపు

పల్లవి: చూతామురారే! యీవేడ్కనుసుదతులారనేడు!
అనుపల్లవి: పురుహూతాదులకరుదైనయోడలో
. యువిదలెల్లహరినిగూడియాడెదరు!
చరణ (1): ఒకరికొకరుగంధమునలదెదరు!
. ఒకరికొకరుతిలకముదిద్దెదరు
. ఒకరికొకరువీడెములొసగెదరు!
. ఒకరికొకరుహారమువేసెదరు!
చరణ (2): ఒకరికొకరువలువలుగట్టెదరు!
. ఒకరికొకరురవికెలుదొడిగెదరు!
. ఒకరికొకరుకౌగిటగూర్చెదరు!
. ఒకరికొకరుతమలోసొక్కెదరు!
చరణ (3): ఒకరికొకరుపాటలుపాడెదరు!
. ఒకరికొకరుసరసములాడెదరు!
. ఒకరికొకరుకానకభ్రమసెదరు!

51-వ.
అనియిట్లు పలుకుచు, అప్సరస్త్రీలెల్ల నచ్చటికివచ్చియుత్సవంబుగనుంగొనుచుండ గోపికామణు లత్యంతసౌందర్యముచే తమకు సమానమెవరులేరని బలుకుచున్నారు.

52-క.
రిహరకమలభవాదులు
సురకింపురుషులెల్ల మ్రులుగాకె
వ్వరు మన కుచ కచ వదనా
ములగని తప్పువారు రలోననుచున్‌.

53-వ.
మఱియు నిట్టులనిరి.

కీర్తన. - 11.
దేవగాంధారి - ఆది

పల్లవి: ఎవరుమనకుసమానమిలలో - నింతులారనేడు!
అనుపల్లవి: అవనిహరిహరబ్రహ్మాదిసుర -
. లాసచేమోసపోయిరిగనుకను!
చరణ (1): నలువతనయపైమోహముజెంది
. నాడేతగిలిపోయె!
. ముద్దులొలుకుశ్రీహరివలచుచు
. బృందాలోలుడైపోయె!
. చిలువభూషణుడుదారుకావనపు
. చెలుల పాలాయె గో
. కులమునత్యాగరాజనుతుడుమన
. వలలదగిలిపోయెగనుకను!

54-వ.
అంతట గోపికామణులు అత్యంతలావణ్యగర్వముచే మైమఱచి యేమనుచున్నారు.

55-సీ.
బొంకులాడుచులెస్స భోగింపనేర్చునే
డనుజరిపింప నొనరులేదు
నితలజూచిన లపింపనేర్చునే
డనుజరిపింప నొనరులేదు
నరూపములజూచి నవెంటదిరుగునే
డనుజరిపింప నొనరులేదు
సొగసుఁజేసుకవచ్చి సొక్కింపనేర్చునే
డనుజరిపింప నొనరులేదు
నుచుభావింప మాధవు దియెఱిగి
గొప్పసుడిగాలి బలుమేఘ ఘోషణముల
గూడవర్షముగురియింప నోడలోన -
ద్వారమటుకల్గినీరురా దొడగెనపుడు.

56-వ.
అంతట గోపికామణుల మదగర్వంబు లణంచుటకై యెంచినశ్రీమత్‌ కృష్ణమూర్తిహృదయం బెరింగి ఇంద్రాదిసుర లేమిచేయుచున్నారు.

57-శా.
పాకారిప్రముఖుల్‌వినోదములుసల్పన్నాజ్ఞగావింపగా
నాకాశంబుననుండి వానవడగండ్లావేళ వ్రాలెన్‌మరిన్‌
నౌకారంధ్రములో జలంబుచొరగా త్యంత వ్యాసంగలై
శ్రీకారుణ్యనిధే హరే యని చెలుల్చింతించి రయ్యోడలోన్‌.

58-వ.
అంతట గోపికామణు లత్యంత భయాక్రాంతలై యేమనుచున్నారు.

కీర్తన. - 12.
ఘంటా - చాపు

పల్లవి: ఉన్నతావున నుండనియ్యదువాన
. యురుములైతే వెనుకతియ్యదు!
అనుపల్లవి: సుడిగాలి యోడజుట్టివడి
. వడిగావానలైతె గొట్టి!
చరణ (1): ఓడలో రంధ్రముగలిగె యీ
. వనితలకెవ్వరుసలిగె!
చరణ (2): కనులకెందుగానరాదు
. గతికాళిందిమన కికమీదు!
చరణ (3): మతిపోవు దారిజనిరమ్మా అపుడె
. మదమింతవలదంటినమ్మా!
చరణ (4): మనమొక్కచో గూడరాదు ప్రళయ
. మననిదిగా వేఱుగాదు!
చరణ (5): రాజవదనలు! రారమ్మా త్యాగ
. రాజసఖునిజూడరమ్మా!

59-వ.
ఇవ్విధంబున జాలింజెందుచు కృష్ణదేవునిజుట్టుకొని గోపికామణు లేమనుచున్నారనిన

60-శా.
రాజానను నాడికొన్న ఫలమో యేమానినీశాపమో
రామామణులేగువేళగుణమో యేవేల్పుదుష్కృత్యమో
వేరేదారిక తోచదేయని మది>న్వేమారు చింతించుచున్‌
నారీరత్నములెల్ల జాలిపడుచున్నానావిలాపంబులన్‌.

61-వ.
ఇవ్విధంబున గోపికామణులు వ్యసనాక్రాంతలై కృష్ణదేవునికిక్షేమంబుగలుగుకొఱకు యమునాదేవిని ప్రార్థించిరి.

కీర్తన. - 13.
సౌరాష్ట్ర - ఆది

పల్లవి: అల్లకల్లోలమాయెనమ్మయమునాదేవి! మా
. యార్తులెల్లనుదీర్చుమాయమ్మ!
అనుపల్లవి: మొల్లలచేబూజించిమ్రొక్కెదము బ్రోవుమమ్మ!
చరణ (1): మారుబారికిదాళలేక యీరాజకు
. మారునిదెచ్చితిమిందాక
. తారుమారాయెబ్రతుకు తత్తళించునదెందాక
చరణ (2): గాలివానలునిండారాయె మాపనులెల్ల
. గేలిసేయుటకెడమాయె
. మాలిమితోమమ్మేలు మగనియెడబాయనాయె
చరణ (3): సొమ్ములెల్ల నీకొసగెదమమ్మ! యమునాదేవి! యీ
. సుముఖునిగట్టుజేర్పుమమ్మ!
. యెమ్మెకానిబలిమిని యేలదెచ్చితిమమ్మ!
చరణ (4): నళినభవుడువ్రాసినవ్రాలు ఎటులైనగాని
. నాథుడుబ్రతికియుండినజాలు
. ప్రళయములయ్యెను యేపనిచేసిన భామలు
చరణ (5): దేహములెల్లనొసగెదమమ్మా! ఓదేవి! కృష్ణ
. దేవుని గట్టుజేర్చుమమ్మ!
. మోహనాంగుని మేము మోసబుచ్చితిమమ్మ!
చరణ (6): మేమొక్కటెంచబోతిమమ్మా! పాపాలిదేవు
. డేమేమో యెంచుకొన్నాడమ్మా!
. రామరో! శ్రీత్యాగరాజాప్తుని బాయమమ్మా!

62-వ.
ఇటువంటిసమయంబున విష్ణుపదధ్యానముచేయుచు బ్రహ్మేంద్రాదిసురులెల్ల యేమిపలుకుచున్నారు.

63-క.
పాముగానని యీభవ
వారిధిని దరింపజేయురదునికొఱకై
మూరెడు యమునానదిలో
సారెకు వర్ధిల్లవేడు చందముగనరే.

64-వ.
అంతట గోపికామణులు యమునాదేవివలన సౌఖ్యంబులేమియులేకమహావ్యసనముబొందినవారలై యిట్లనిరి.

65-సీ.
”బాలభావముతోడ ణతులపాలిండ్ల -
పైబవ్వళించేటి ద్మనాభు
నింటింట జొరబడి యిల్లాండ్లబట్టుచు -
వేడ్కగాదిరిగేటి విమలహృదయు
ముద్దుగారగ నూరి ముదితలనేలుచు
- నీడనుశోభిల్లు నిర్మలాత్ము
స్త్రీబుద్ధివల్లను చెరుచుకొంటిమిగాక -
యేలదెచ్చితిమమ్మ యేలువిభుని
ల్లడిల్లెడికాళింది దాటితల్లి!
చెంత-గృష్ణునియేవేళ జేర్తుమమ్మ!”
నుచు దారుణ్యవతులెల్ల లరుచుండ -
జూచిమదిలోననగుచుండె సుముఖుడపుడు.

66-వ.
అట్టిసమయమున శ్రీకృష్ణదేవుడు గోపికామణులనేచుటకైజాలిచెందినవానివలె నిట్లనియె.

67-ద్వి.
భామలమ్మెడు రేగుపండ్లకై నేను
కామించి ముత్యముల్‌ రములనిండ
నునుచుక నేరాగ నుప్పొంగిమీరు
నుల ద్రి ప్పుచునెత్తికొనివేడ్కతోడ
మంజుళముఖులార! దవతులార!
కొంజకననుదేగ గొబ్బుననిటకు
పుడునేరానని యాడుకోలేక
యిపుడుశోకించుట హాసముగాదె
యింతకువచ్చుట యెఱుగలేనైతి
యింతులనమ్మరా దెంతవారికిని.

68-వ.
వైద్యుడువెసనపడుచందంబున కృష్ణదేవుండనినవినిగోపికలు మిక్కిలివెసనపడుచు యేమనుచున్నారు.

69-ఉ.
మానునబెట్టుతేనియను మానకదెచ్చిమదించి మానినీ!
తానుభుజింపలేక వసుధాస్థలి నొలకబోసుకొన్న చం
దా పురంబునన్వెలయు దానవవైరినిగూడలేకనే
మాముపోవనాయె మనమందరిబాపము బోసుకొంటిమే.

70-వ.
అనుచునంతట గోపికామణులు జన్మాంతరకృతపూజాఫలములదలచి యేమనిపలుకుచున్నారు.

కీర్తన. - 14.
ఘంటా - ఆది

పల్లవి: పెరుగుపాలుభుజియించి తనువుల
. బెంచినదెల్ల నిందుకా
అనుపల్లవి: నిరవధిసుఖదాయకమా వయసు
. నీటనుగలయు టందుకా
చరణ (1): అత్తమామలతో నీకై మేమెదు – రాడినదెల్ల నిందుకా
. సత్తగలిగి ఇకనైన నుందు మని – సంతసిల్లిన దిందుకా
చరణ (2): ఆసదీర నీసేవవలయునని – అలసినదెల్ల నిందుకా
. పాసియుండనేరక పెద్దలచే – బాములుచెందిన దిందుకా
చరణ (3): స్నానపానములుజేయువేళ నిను – ధ్యానముచేసిన దిందుకా
. మేనుల నీసొమ్ములుసేయుటకై – మేమల్లాడిన దిందుకా
చరణ (4): తలిరుబోణులై యమునానదిలో – తల్లడిల్లు టందుకా
. వలచుచుదొలిజన్మము రామునిచే – వరములుబడసిన దిందుకా
చరణ (5): కోటిజన్మములుతపములుజేసి – కోరినదెల్ల నిందుకా
. సాటిలేని నీలీలలు మనసున – సైరించియున్న దిందుకా
చరణ (6): ఆగమనిగమపురాణాచారుడని – యనుసరించిన దిందుకా
. త్యాగరాజనుతతారకనామ! నీ – తత్త్వముదెలిసిన దిందుకా

71-వ.
ఈవిధంబున వ్యసనాక్రాంతలై కలవరించు గోపికాసుందరులజూచి శ్రీకృష్ణదేవుడు బ్రతుకనుపాయముబలికే దెటులనిన.

72-ఉత్సాహ.
అంలార్చరాదు ఓ భుజంగవేణులార! యా
యంజారికైన కర్మమంతరానలంబు సా
రంనేత్రలార! పంచరంగుకంచుకంబులన్‌
బొంగివచ్చునీటికట్టె బొందుగాగనుంచరే?

73-వ.
ఆపత్కాలోపాయమైనవార్తలవిని గోపికామణు లేమిసేయుచున్నారనిన.

74-క.
నవిని విని సుదతులు
క్షేముకొఱకైముదాన శీఘ్రముగానే
యేరక కంచుకమ్ములు
నేముతోను నుపదాన నిల్వకపోయెన్‌.

75-వ.
నవరత్నఖచితకనకమయమైనకంచుకమ్ములు నౌకారంధ్రములోనునుపనందు నిలువక నిమిషముననీటబోజూచి గోపికామణు లిట్టులనిరి.

కీర్తన. - 15.
పున్నాగవరాళి - త్రిపుట

పల్లవి: కృష్ణా! మాకేమిదోవబల్కు
. కీర్తిగల్గును యాదవబాల!
అనుపల్లవి: సరిగె రవికెలెల్లబోయె
. వెఱ్ఱిచలికి మేనోర్వనాయె శ్రీ
చరణ (1): సరివారిలో సిగ్గుబోయె
. నీరు జానులపైదాకనాయె శ్రీ
చరణ (2): సర్వము నేననుకొన్న నీదు
. సామర్థ్యముజూపు చిన్న! శ్రీ
చరణ (3): పాయలేనిమమ్ము నీవు యేయు
. పాయమైనదెల్పిబ్రోవు శ్రీ
చరణ (4): మాతోచేరగ యింతబాధకల్గె
. మఱతుమా ఇక ప్రాణనాథ! శ్రీ
చరణ (5): ఇందుకనుచు తల్లి సాకెనోలేక
. యేపాపులకండ్లు తాకెనో శ్రీ
చరణ (6): రాకేందుముఖ! దయరాదా! త్యాగ
. రాజార్చిత! బ్రోవరాదా! శ్రీ

76-వ.
ఇవ్విధంబున నత్యంతవ్యసనంబుతోకన్నీరొల్కగా కలవరించేగోపికాసుందరులజూచి కృష్ణదేవుడేమనుచున్నాడు.

77-క.
“శోకింపవేళగాదిది
రాకాశశివదనలార! జతమయంబౌ
నౌకారంధ్రములోపల
కోలువదలించి మీరుగొబ్బుననిడరే.”

78-వ.
అనినంతట గోపికామణులు లజ్జాక్రాంతలై యేమనుచున్నారు.

79-క.
రాముఖుండాడగవిని
రాజీవదళాక్షు లంతరంగములో సం
కోముతో వ్యధజెందుచు
”స్త్రీన్మంబేలకలిగె? ఛీ! ఛీ!” యనుచున్‌.

కీర్తన. - 16.
వరాళి - త్రిపుట

పల్లవి:ఇందుకేమిసేతుమమ్మ! కృష్ణుడెంతోమాటలాడెనమ్మ!
అనుపల్లవి:మగువలంటే ఇంతవాదా మాకు మానమేప్రాణముగాదా!
చరణ (1):కృ:గుసగుసలందేమివచ్చు చెలువారు
. .ఉసురుంటే ఊరుబోవచ్చు
చరణ (2):గో:వనితలగని యెవరైనా కృష్ణా!
వంచనగాబల్కదగునా?
చరణ (3):కృ:హటముసేయవేళగాదు ఆత్మ
. హత్యగాని వేరేలేదు
చరణ (4):గో:నగ్నముగా నిల్వవశమా? కృష్ణా!
. నలుగురిలో మాకుయశమా!
చరణ (5):కృ:నామాటలువినిమీరు వేగ
. ననుగట్టుజేర్చబోనీరు
చ రణ (6):గో:లలనలపాపములేమో? యీ
, లాగువ్రాతలుండెనేమొ?
చరణ (7):కృ:వెలకుదీసిన వలపురాదు
. వెలదుల ఇకనమ్మరాదు
చరణ (8):గో:రాజన్య! యిటుయెంచవలదు త్యాగ
. రాజవినుత! ప్రేమగలదు.

80-వ.
అంతట గోపికామణులు కృష్ణదేవుని నమ్మవచ్చుననియొకరితోనొకరు ఆలోచనచేసి యిటులనిరి.

81-క.
ణితలోకాధారుడు
నిమాగమసంచరుండు నిర్మలహృదయుం
ధరుడనయము బ్రోచును
జూపడు వనితలార! రదుండనుచున్‌.

కీర్తన. - 17.
మోహన - చాపు

పల్లవి: వేదవాక్యమనియెంచిరి యీ – వెలదులెల్ల సమ్మతించిరి
చరణ (1): చీరలన్నియు వదలించిరి యెంతో
. సిగ్గుచేత నందుంచిరి
చరణ (2): అందుననిలువకపోయెను మే
ను. లందఱికిదడవ నాయెను
చరణ (3): కనుగొందురోయని సరగున బాలిం
డ్ల. కరములమూయ మరుగునా?
చరణ (4): మానములనుమూసుకొందురో? తమ
. ప్రాణములనుగాచుకొందురో?
చరణ (5): చెలుల నోరెండగనాయెను నీరు
. చిలుచిలుమని యెక్కువాయెను
చరణ (6): వల్వలుగానకపోయెను సతుల
. వదనములటు స్రుక్కనాయెను
చరణ (7): కరగికరగి యంగలార్చిరి చెలులు
. కమలాక్షు నురమునజేర్చిరి
చరణ (8): కనులగాటుకనీరుకారగా జూచి
. కాంతుడెంతో ముద్దుకారగా
చరణ (9): రమణులమదమెల్లజరిగెను త్యాగ
. రాజనుతుని మదికరగెను.

82-వ.
అంతట గోపికామణులు వ్యసనాక్రాంతలై యేమనుచున్నారనిన.

83-ఉ.
గ్నమదెట్టిదోవనితలందఱువచ్చినవేళదేవతల్‌
గ్నులజేసిరో? కమలమందుజనించినవాని వ్రాతయో?
విఘ్నమువచ్చునా? యనుచు వింటిమివార్తలు విశ్వసింపుచున్‌
గ్నలమైతి మేమిగతి నాథదుకూలములెందుగానమే!

84-వ.
అని గోపికామణులు జన్మాంతరసుకృతంబుచే జ్ఞానోదయమంది ప్రపంచభోగభాగ్యము లన్నియు నశ్వరమని యెంచి శ్రీకృష్ణమూర్తిపాదారవిందంబుచేరుటకై యోచించుమార్గంబెటులనిన.

85-చ.
బ్రతుకనుదారిగానమిక భారముతాళదు యోడలోపలన్‌
కుతికనుబట్టె నీరిపుడు గొబ్బున శ్రీహరిపాదపద్మముల్‌
దినిదలంచుకొంచు వరమాధవనామము నోటబల్కరే!
తితు లబ్రోచువాడు మనపాలిట కల్గిసుఖంబు లిచ్చునే!

86-వ.
అనితలంప నాసమయంబున సర్వాధారుండును, నిర్వికారుండును,నిరంజనుండును, ఆదిమధ్యాంతరహితుండును, జగన్మోహనాకారుండునుగా,దర్శనంబిచ్చినశ్రీకృష్ణదేవుని జూచి గోపికలిట్లనిరి.

కీర్తన. - 18.
పున్నాగవరాళి - ఆది

పల్లవి: హరి! హరి! నీదివ్యపా
. దారవిందమియ్యవే!
అనుపల్లవి: ధరనుగలభోగభాగ్యమెల్లను
. తథ్యముగాదుసుమీ! శ్రీకృష్ణా!
చరణ (1): సనకసనందన శ్రీనారద శుకా
. ర్జునఘనులెల్ల నుతించు
. వనజనయన! బ్రహ్మాది
. సంక్రందను లనయము సేవించ
చరణ (2): నిను వేదపురాణాగమశాస్త్ర
. విద్యలనెల్ల చరించు
. ఘనసమనీల నిరంజననిర్గుణ
. కనికరముగ త్యాగరాజు భావించు.

87-వ.
ఇవ్విధంబునకీర్తించుచున్న గోపికామణులజూచి అత్యంతపరమదయాళువైన శ్రీకృష్ణపరమాత్మ యేమనుచున్నారు.

88-చ.
మదయాకరుండు, నిజక్తజనావను డప్రమేయు, డా
సుగణనీరదానిలుడు, శంకరమిత్రుడు, శాంతరూపు, డీ
రుణులుపొందునట్టి పరితాపముజూచి కరంగి వేగమే
రుణయొనర్పదల్చుచును గాంతలకిట్లనియెన్‌ బ్రియంబునన్‌.

89-క.
న్నేధ్యానముసేయుచు
న్నీరులనిలిపిమీరు రయుగళముచే
న్నులుమూసిభజింపుడు
న్నుగ మీపాలివేల్పు లమిచ్చుదయన్‌.

90-వ.
అనిపలికిన శ్రీకృష్ణదేవునిపలుకులువిని గోపికామణులు

91-సీ.
వ్యాధులుగలవారు వైద్యునిమాటలు
విశ్వాసముంతోడ వినినయటుల
పూర్ణగర్భిణులైన పొలతులెల్లను మంత్ర
సానిచెప్పినమాట ల్పినట్లు
రిచారకాదులు భాగ్యవంతునిమాట
ప్పకవిన్నట్లు రుణులెల్ల
రమేశ్వరునిమాట క్తితోవినికను
ల్మూసిభజించిరి వాసిమెరసి
తే. అంధకారంబు వర్షంబు ణగిపోయి
నోడదరిచేరవచ్చెను పోడిమిగను
నకమయవస్త్రముల రమ్యకంచుకముల
జూచి యుప్పొంగిరావేళ సుదతులెల్ల.

92-వ.
అపుడు కోటిమన్మథాకారుడు, కువలయనేత్రుడైన శ్రీకృష్ణపరమాత్మనుజూచి గోపికామణు లేమిసేయుచున్నారనిన.

93-చ.
లువలరాజుచందమున గాంతిచెలంగెడి కృష్ణుమోమునన్‌
దికపుచాకచక్యమును దివ్యసువర్ణపుగుండలంబులన్‌
జెగు కపోలయుగ్మమును జేడియలందరుచూచినంతనే
తొలుతటి దుఃఖముల్మరచి తోడుతపాడిరి సంతసిల్లుచున్‌

94-వ.
మఱియు గోపికామణు లేమిసేయుచున్నారనిన.

95-ఉ.
మంజుళభాషు, రూపజితన్మథు, జంద్రకులప్రదీపు, స
త్కుంరపోషు, శోభననికుంజగృహాంతనివాసు, మౌనిహృ
త్కంవిహారు, ధీరువర, కాంచనచేలుని జూచినంతనే
కందళాక్షులెల్ల హరి కౌగిటజేర్చిరి సంతసిల్లుచున్‌.

96-వ.
గోపికామణులు కృష్ణమూర్తికి శృంగారించునదెట్టులనిన.

కీర్తన. - 19.
పున్నాగవరాళి - ఆది

పల్లవి: గంధముపుయ్యరుగా! పన్నీరు
. గంధముపుయ్యరుగా!
అనుపల్లవి: అందమైనయదునందనుపై
. కుందరదన లిరవొందగ పరిమళ
చరణ (1): తిలకముదిద్దరుగా! కస్తూరితిలకముదిద్దరుగా!
. కలకలమను ముఖకళగని సొక్కుచు
. బలుకుల నమృతములొలికెడు స్వామికి
చరణ (2): చేలముగట్టరుగా! బంగరుచేలముగట్టరుగా!
. మాలిమితో గోపాలబాలులతో
. నాలమేపిన విశాలనయనునికి
చరణ (3): హారతులెత్తరుగా! ముత్యాలహారతులెత్తరుగా!
. నారీమణులకు వారము యౌవన
. వారక యొసగెడు వారిజాక్షునికి
చరణ (4): పూజలుసేయరుగా! మనసారపూజలుసేయరుగా!
. జాజులు మరివిరజాజులు దవనము
. రాజితత్యాగరాజనుతునికి.

97-వ.
ఆసమయంబున గోపికారత్నములమధ్యంబున కృష్ణపరమాత్మ ప్రకాశించేదెటులనిన.

98-సీ.
క్షబృందములోని రేరాజుచందాన
క్షివాహనుడందు రగుచుండె
సురలబృందములోని సురరాజుచందాన
రమాత్ముడావేళ రగుచుండె
వరత్నరాజిలో నాయకమణిరీతి
పావనుడావేళ రగుచుండె
రిణీనిచయమున రిరాజుచందాన
బాగుగాగృష్ణుండు రగుచుండె
బ్రహ్మరుద్రాదివేల్పులు ద్మనాభు
చాకచక్యంబుగనుగొని సంతసిల్లి
నకసుమపూజలొనరించి గాంచిహరిని
స్వస్వభవనమ్ములకునేగ తులుజనిరి.

కీర్తన. - 20.
సౌరాష్ట్ర - చాపు

పల్లవి: ఘుమఘుమఘుమయని వాసనతోముద్దు
. గుమ్మలు వెడలిరిచూడరే!
అనుపల్లవి: మమతతోను సురవరులెల్ల సురతరు
. సుమవాసనలు గురియింపవేడ్కగ!
చరణ (1): నలువంకపగలువత్తులు తేజరిల్లగ!
. చెలగసాంబ్రాణిపొగలుగ్రమ్మ! గంధపొ
. డులుచల్లుచు బయ్యెదలదీయుచుబన్నె
. రులుచిలుకుచు యదుకులవీరునితో
చరణ (2): బంగారుచీరలు రంగైనరవికలు
. నుంగరములు వెలయంగ! సొగసుగ భు
. జంగశయనుడగురంగపతిని జూచి!
. పొంగుచుదనివారగౌగిలించుచును
చరణ (3): వరమైన కనకనూపురములు ఘల్లన!
. యురమున ముత్యాలసరులెల్ల గదలగ!
. కరమున సొగసైనవిరిసురటులచే వి
. సరుచు! త్యాగరాజవరదుని బొగడుచు!

99-వ.
అంతటగోపికామణులు అత్యంతకుతూహలముచే కృష్ణదేవునిదోడ్కొనివిడిదిలోనుంచి మంగళముపాడేదెటులనిన.

కీర్తన. - 21.
సురటి - చాపు

పల్లవి: మాకులమున కిహపరమొసగిన నీకు
. మంగళం! శుభమంగళం!
అనుపల్లవి: మౌనులబ్రోచిన మదనజనక! నీకు
. మంగళం! శుభమంగళం!
చరణ (1): మదగజగమనమానితసద్గుణ! నీకు
. మంగళం! శుభమంగళం!
. మదమోహరహిత! మంజుళరూపధర! నీకు
. మంగళం! శుభమంగళం!
చరణ (2): మనసిజవైరి! మానససదన! నీకు
. మంగళం! శుభమంగళం!
. మనవిని విని మమ్మేలుకొన్న నీకు
. మంగళం! శుభమంగళం!
చరణ (3): మామనసుననెలకొన్నకృష్ణా! నీకు
. మంగళం! శుభమంగళం!
. మామనోరథపాలితత్యాగరాజ!
. మంగళం! శుభమంగళం1

ఫలశ్రుతి:

శ్లో.
త్యాగరాజకృతాం పుణ్యకథాం సాధుమనోహరాం
యేశృణ్వంతి నరాలోకే తేషాం కృష్ణఃప్రసీదతి.

కృత్యంతము

ఇతి త్యాగరాజవిరచిత నౌకాచరిత్రము సమాప్తము.