పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శ్రీరుక్మిణీదేవి వివాహము

విమలమణిస్తంభ వివిధశిల్పముల      240
వెరవుగాఁ బెండ్లికి వేది దీర్పించి 
రవుగా ముత్యాలపందిలిఁ బెట్టి
ఘంటామృదంగమంళతూర్యరవము
లింటింట మ్రోయఁగ నెల్ల వీథులను
నకతోరణములుఁ లువడంబులును
నకకుంభంబులుఁ రమొప్ప నెత్తి
స్తూరిచందనగంధసారాది
స్తువిస్తరధూపవాసనలొలయ
నందలంబులును నందంద పంపించి
నందాదిగోపబాంవుల రప్పించి
దేవతాతిథిగృహదేవతార్చనలు
గావించి రేవతీకాంతయుఁ దాను
రమిడి యయ్యశోయును రోహిణియు
రిపరిణయము(న) కాత్మల నలర
తకోటికందర్పన్నిభమూర్తి
తులితశృంగార మంగీకరించె. 
కంతుబాణంబునఁ డిగినభంగి
కాంతమైనార్చి సింగారించి తెచ్చి
నరారు గృహదేవలయొద్ద నిలిపి
నుపమంబగులగ్న మాసన్నమైన      250
సాందీపనియమితద్విజోత్తములుఁ
జెంది పుణ్యాహంబు సేయించి రంత. 
నకదుందుభి లపాణియుగ్ర
సేన నందాదులుఁ జెలులుఁ జుట్టములు
లనొప్ప విప్రభూరవైశ్యశూద్రు
లెలమి మహోత్సవంబేపారుచుండఁ
గొమరారు నప్పసిఁ(డి)కుడుక నక్షతలు
మరఁ(గఁ) దలబ్రాలు ఖిలవస్తువులుఁ 
సిఁడిపళ్ళెరముల హుభంగిఁ బూనిఁ
సికత మీరి పేరంటాండ్రు పాడ
నాలోన రుక్మిణి నంబుజోదరునిఁ 
బ్రాలపొంగుల మీఁదఁ రగంగ నుంచి
తెరవట్టి సౌభాగ్య దివ్యవస్తువులుఁ
రముల నునిచి మంళరావమెలయ
నాయెడ ఘడియార రసిదైవజ్ఞు
లాయతమాయతని ప్రీతిఁ బలుక
శుభలగ్నమరుదేర సుముహుర్తమనుచు
భినుతిలొనరించె మరసంఘంబు; 
తెరయెత్త ముఖచంద్రదీప్తులు వొలయ
యిరువురు నొండొరులీక్షించి రంత;      260
రిచూడ్కి సతిచెక్కుద్దంబులందుఁ
రమొప్పు పత్రరేలభంగి నమరె; 
నితచూపులు హరిక్షంబు మీఁదఁ
బెనుపార నీలాలపేరులట్లుండె; 
సురభూరుహము మీఁద సురవల్లి నిగుడి, 
విరులురాల్చినభంగి వెలఁదొప్ప నెక్కి
రువడిచేఁ దలఁబ్రాలొప్ప బోసె; 
రమర్థి హరి కరగ్రహణంబు సేయఁ
లితమౌ వందిమాధరావములును
జెలువారు సద్విజాశీర్వాదములును
మంగళపాఠకహితవాక్యములుఁ
నింగి ముట్టగను ఘూర్ణిల్లె నంబుధులు. 
అంతహోమాదికృత్యములెల్లఁ దీర్చి
సంతోషచిత్తుఁడై శౌరి పెంపొందె. 
నుపమ భక్ష్యభోజ్యాన్నపానములఁ
నిపి యందఱికిని గకట్టనిచ్చి
నందయశోదల యవాక్యవస్తు
సందోహములఁ బ్రీతిలిపి వీడ్కొలిపె; 
శోభనదినములు సొంపారదీర్చి
యాభామినియుఁ దాను నంబుజోధరుఁడు.      270
కేళిహర్మ్యములందుఁ గృతకాద్రులందు
శైలసానువులందు రసులయందు
వైదర్భితో రతిల్లభ కేళి
నాదట సుఖలీలలందె మురారి.>