పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శశిబిందుని చరిత్ర

 •  
 •  
 •  

9-704-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కృమధ్యల్ పదివేవు రంగనలతోఁ గ్రీడం బ్రమోదింప స
త్కులుండై పదివేలలక్షలు సుపుత్రుల్ భక్తిజేయం జతు
ర్ద రత్నుండును యోగినాఁ బరఁగి సప్తద్వీపరాజేంద్రుఁడై
శిబిందుం డురునీతిమంతుఁ డమరన్ త్కాంతిపూర్ణేందుఁడై.

టీకా:

కృశమధ్యల్ = సన్నినడుములుకలవారు; పదివేవురు = పదివేలమంది (10.000); అంగనల్ = భార్యల; తోన్ = తోటి; క్రీడన్ = కులాసాగా; ప్రమోదింపన్ = ఆనందిస్తుండగా; సత్ = మంచి; కుశలుండు = నేర్పరితనములు కలవాడు; ఐ = అయ్యి; పదివేలలక్షలు = వందకోట్లమంది (100 కోట్లు); సు = చక్కటి; పుత్రుల్ = కొడుకులు; భక్తిన్ = సేవ; చేయన్ = చేయుచుండగ; చతుర్దశ = పద్నాలుగు {చతుర్దశరత్నములు (విద్యలు) - 1ఋగ్వేదము 2యజుర్వేదము 3సామవేదము 4అధర్వణవేదము 5శిక్ష 6వ్యాకరణము 7ఛందస్సు 8నిరుక్తము 9జ్యోతిషము 10కల్పము 11మీమాంస 12న్యాయము 13పురాణము 14ధర్మశాస్త్రము}; రత్నుండును = రత్నములు కలవాడు; యోగిన్ = యోగి; నాన్ = అని; పరిగి = ప్రసిద్ధుడై; సప్తద్వీప = సప్తద్వీపములకు; రాజేంద్రుడు = మహారాజు; ఐ = అయ్యి; శశిబిందుండు = శశిబిందుడు; ఉరు = గొప్ప; నీతిమంతుడున్ = నీతిమంతుడు; అమరన్ = చక్కగానుండెను; సత్ = మంచి; కాంతిన్ = ప్రకాశముతో; పూర్ణేందుడున్ = నిండుచంద్రునివలె; ఐ = ఉండి.

భావము:

శశిబిందుడు గొప్ప నీతిమంతుడు; అతను పదివేలమంది అందమైన భార్యలతో ఆనందిస్తూ, వందకోట్లమంది కొడుకులు సేవ చేస్తుండగా జీవించాడు. ఇంకా చతుర్దశరత్నాలు అనే సకల వేద విద్యలు కల యోగిగా ప్రసిద్ధుడు అయ్యాడు. అలా జీవిస్తూ శశిబిందుడు సప్తద్వీపాలకు రాజేంద్రుడై వెలుగొందాడు.

9-705-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అతని కొడుకుల మొత్తంబునకు ముఖరులయిన యార్వురలోఁ బృథుశ్రవుండను వానికి ధర్ముండు పుట్టె; ధర్మునకు నుశనుండు పుట్టి, నూఱశ్వమేథంబులుజేసె; నయ్యశనునకు రుచికుండు పుట్టె; నా రుచికునకుఁ బురుజిత్తు, రుక్ముండు, రుక్మేషువుఁ, బృథువు, జ్యాముఖుండు నను వారేవురు పుట్టి; రందు జ్యాముఖుండు.

టీకా:

అతని = అతని యొక్క; కొడుకల = కొడుకులు; మొత్తంబున్ = అందరిలో; కున్ = కి; ముఖరులు = ముఖ్యుల; అయిన = ఐన; ఆర్వుర = ఆరుగురు; లోన్ = లోను; పృథుశ్రవుండు = పృథుశ్రవుడు; అను = అనెడి; వాని = అతని; కిన్ = కి; ధర్ముండున్ = ధర్ముడు; పుట్టెన్ = జన్మించెను; ధర్మున్ = ధర్మున; కున్ = కు; ఉశనుండున్ = ఉశనుడు; పుట్టి = జన్మించి; నూఱు = వంద (100); అశ్వమేథంబులున్ = అశ్వమేథయాగములు; చేసెన్ = చేసెను; ఆ = ఆ; అశనున్ = అశనున; కున్ = కు; రుచికుండు = రుచికుడు; పుట్టెన్ = జన్మించెను; ఆ = ఆ; రుచికున్ = రుచికున; కున్ = కు; పురుజిత్తున్ = పురుజిత్తు; రుక్ముండున్ = రుక్ముడు; రుక్మేషువున్ = రుక్మేషువు; పృథువున్ = పృథువు; జ్యాముఖుండున్ = జ్యాముఖుడు; అను = అనెడి; వారున్ = వారు; ఏవురున్ = ఐదుగురు (5); పుట్టిరి = జన్మించిరి; జ్యాముఖుండు = జ్యాముఖుడు.

భావము:

అతని కొడుకులు అందరిలో ముఖ్యులు ఆరుగురు. వారిలోని పృథుశ్రవుడికి ధర్ముడు జన్మించాడు; ధర్మునకు ఉశనుడు జన్మించి వంద అశ్వమేథయాగాలు చేసాడు. ఆ ఉశనునకు రుచికుడు; ఆ రుచికునకు పురుజిత్తు, రుక్ముడు, రుక్మేషువు, పృథువు, జ్యాముఖుడు అని ఐదుగురు పుత్రులు జన్మించారు. ఆ జ్యాముఖుడు....

9-706-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తొట్రుకొల్పెడు శైబ్యతోడి ప్రేమంబున-
నపత్యుఁ డయ్యును న్యభార్యఁ
గైకొన కొక కొంతకాలంబునకుఁ బోయి-
గవారి యింటను లిమిఁ బట్టి
యొకకన్యఁ దేరిపై నునిచి తోడ్తేరంగ-
ననాథుఁగన్యను శైబ్య చూచి
కోపించి "మానవకుహక! యీ పడుచును-
దెచ్చియు నేనుండఁ దేరిమీఁద

9-706.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

బెట్టినాఁడ" వనుచు బిఱుసులు పలుకంగ
తడు పలికె నంత తివతోడ
"నాకుఁ గోడ లింత మ్ము మీ లలితాంగి
వతిగాదు నీకు త్య" మనుచు.

టీకా:

తొట్రుగొల్పెడు = సంభ్రమింపజేసెడి; శైబ్య = బెస్తస్త్రీ; తోడి = తోటి; ప్రేమంబునన్ = ప్రేమవలన; అనపత్యుడు = పిల్లలులేనివాడు; అయ్యున్ = అయినప్పటికిని; అన్య = మరియొక; భార్యన్ = భార్యను; కైకొనక = చేపట్టకుండ; ఒక = ఒకానొక; కొంత = కొంత; కాలంబున్ = కాలమున; కున్ = కు; పోయి = వెళ్ళి; పగవారి = శత్రువుల; ఇంటను = ఇంటినుండి; బలిమిన్ = బలవంతముగ; ఒక = ఒకానొక; కన్యన్ = అవివాహితను; తేరి = రథము; పైన్ = మీద; ఉంచి = పెట్టి; తోడ్తోన్ = కూడా; ఏరంగ = వస్తుండగా; జననాథున్ = రాజును; కన్యనున్ = యువతిని; శైబ్య = శైబ్యవనిత; చూచి = కనుగొని; కోపించి = కోపముచేసి; మానవకుహక = వంచక మానవా; ఈ = ఈ; పడుచును = యువతిని; తెచ్చియున్ = తీసుకొని వచ్చి; నేను = నేను; ఉండన్ = బతికుండగానే; తేరి = రథము; మీదన్ = పైన; పెట్టినాడవు = పెట్టాతివి; అనుచున్ = అంటూ.
బిఱుసులున్ = కఠినమైనమాటలు; పలుకంగన్ = మాట్లాడగా; అతడు = అతను; పలికెన్ = చెప్పెను; అంతన్ = అప్పుడు; అతివ = వనిత; తోడన్ = తోటి; నా = నా; కున్ = కు; కోడలింతనమున్ = కోడలవుతుంది; ఈ = ఈ; లలితాంగి = చిన్నది; సవతి = సవతి; కాదు = కాబోదు; నీ = నీ; కున్ = కు; సత్యము = ఇది నిజము; అనుచున్ = అంటూ.

భావము:

ఆ రుచిక పుత్రుడు జ్యాముఖుడు శైబ్య యందలి గాఢమైన ప్రేమ వలన, పిల్లలులేకపోయినా మరింకొక భార్యను చేపట్టలేదు. కొంతకాలం పిమ్మట ఒకనాడు శత్రువుల ఇంటినుండి బలవంతంగ ఒక కన్యను తీసుకుని రథం మీద వస్తున్నాడు. అలా వస్తున్న రాజును, యువతిని శైబ్యవనిత చూసింది. రాజు మీద కోపగించి “మోసగాడా! ఈ యువతిని తీసుకొని వచ్చి, నేను బతికుండగానే రథం మాద పెట్టుకుని ఊరేగుతున్నావా?” అంటూ, దూషిస్తూ కఠినంగా మాట్లాడింది. అప్పుడు రుచికుడు “ఈ అమ్మాయి నాకు కోడలు అవుతుంది. నీకేమీ సవతి కాబోదు. ఇది నిజం.” అంటూ శైబ్యకు నచ్చచెప్పాడు.

9-707-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అయ్యవసరంబున శైబ్య కొడుకుం గాంచు నని యెఱింగి విశ్వేదేవతలును బితృదేవతలును సంతసించిరి; వారల ప్రసాదంబున.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; శైబ్య = శైబ్యవనిత; కొడుకున్ = కొడుకును; కాంచును = కనును; అని = అని; ఎఱింగి = తెలుసుకొని; విశ్వేదేవతలునున్ = విశ్వేదేవతలు {విశ్వేదేవతలు - ధర్మునకుగల పదిమంది భార్యలలో విశ్వ యందు జన్మించినవారు}; పితృదేవతలునున్ = పితృదేవతలు; సంతసించిరి = సంతోషించిరి; వారల = వారియొక్క; ప్రసాదంబునన్ = అనుగ్రహమువలన.

భావము:

ఆ సమయంలో శైబ్య విశ్వేదేవతలు, పితృదేవతలు అనుగ్రహం వలన కొడుకును కనబోతోంది అని తెలిసి వారు సంతోషించారు.

9-708-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సవతి మొఱఁగి పెనిమిటి
నుఁ బొందిన శైబ్య మఱి విర్భునిఁ గనియెం
యుఁ గని జ్యాముఖుండును
తెచ్చిన కన్యఁ దెచ్చి నయున కిచ్చెన్.

టీకా:

తన = తన యొక్క; సవతిన్ = సవతిని; మొఱగి = తప్పించి; పెనిమిటిన్ = భర్తను; తనున్ = ఆమే; పొందినన్ = కవియగా; శైబ్య = శైబ్యవనిత; మఱి = మరి; విదర్భునిన్ = విదర్భుని; కనియెన్ = కనెను; తనయున్ = పుత్రుని; కని = కనుగొని; జ్యాముఖుండును = జ్యాముఖుడు; తన = అతను; తెచ్చిన = తీసుకొని వచ్చిన; కన్యన్ = యువతిని; తెచ్చి = తీసుకొని వచ్చి; తనయున్ = పుత్రుని; కిన్ = కి; ఇచ్చెన్ = ఇచ్చి వివాహముచేసెను.

భావము:

తన సవతిని తప్పించి భర్త ఆమెని కవియగా శైబ్యకు విదర్భుడు పుట్టాడు. పుత్రుని చూసి జ్యాముఖుడు తను తెచ్చిన యువతిని తీసుకొని వచ్చి పుత్రునికిచ్చి వివాహం చేసాడు.

9-709-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఆ కన్యక యందు విదర్భునకుఁ గుశుండును గ్రుథుండును రోమపాదుండునుం బుట్టి; రా రోమపాదునకు బభ్రువు బభ్రువునకు విభువు విభువునకుఁ గృతి గృతికి నుశికుండు నుశికునకుం జేది చేది కిఁ జైద్యాదులు పుట్టరి; కృథునకుఁ గుంతి, గుంతికి ధృష్టి, ధృష్టికి నిర్వృతి, నిర్వృతికి దశార్హుండు, దశార్హునకు వ్యోముండు, వ్యోమునకు జీమూతుండు, జీమూతునకు వికృతి, వికృతికి భీమరథుండు, భీమరథునకు నవరథుండు, నవరథునకు దశరథుండు, దశరథునకు శకుని, శకునికిఁ గుంతి, గుంతికి దేవరాతుండు, దేవరాతునకు దేవక్షత్రుండు దేవక్షత్రునకు మధువు మధువునకుఁ గురువశుండు, కురువశునకు ననువు, అనువునకుఁ బురుహోత్రుం, డతనికి నంశు, వతనికి సాత్వతుండు సాత్వతునకు భజమానుండును భజియును దివ్యుండును వృష్ణియు దేవాపృథుండును నంధకుండును మహాభోజుండును నన నేడ్వురు పుట్టి; రందు భజమానునకుఁ బ్రథమభార్య యందు నిమ్రోచి కంకణ వృష్ణులు మువ్వురును, రెండవ భార్య యందు శతజిత్తు సహస్రజిత్తు నయుతజిత్తునన మువ్వురు బుట్టి; రందు దేవాపృథునికి బభ్రువు పుట్టె; వీర లిరువుర ప్రభావంబులఁ బెద్దలు శ్లోకరూపంబునఁ బఠియింతు; రట్టి శ్లోకార్థం బెట్టిదనిన.

టీకా:

ఆ = ఆ; కన్యక = యువతి; అందున్ = తోటి; విదర్భున్ = విదర్భున; కున్ = కు; కుశుండునున్ = కుశుడు; క్రుథుండును = క్రుథుడు; రోమపాదుండునున్ = రోమపాదుడు; పుట్టిరి = జన్మించిరి; ఆ = ఆ; రోమపాదున్ = రోమపాదున; కున్ = కు; బభ్రువు = బభ్రువు; బభ్రువున్ = బభ్రువున; కున్ = కు; విభువున్ = విభువు; విభువున్ = విభువున; కున్ = కు; కృతి = కృతి; కృతి = కృతి; కిన్ = కి; ఉశికుండు = ఉశికుడ; ఉశికున్ = ఉశికున; కున్ = కు; చేది = చేది; చేది = చేది; కిన్ = కి; చైద్య = చైద్యుడు; ఆదులు = మున్నగువారు; పుట్టిరి = జన్మించిరి; కృథున్ = కృథున; కున్ = కు; కుంతి = కుంతి; కుంతి = కుంతి; కిన్ = కి; ధృష్టి = ధృష్టి; ధృష్టి = ధృష్టి; కిన్ = కి; నిర్వృతి = నిర్వృతి; నిర్వృతి = నిర్వృతి; కిన్ = కి; దశార్హుండు = దశార్హుడు; దశార్హున్ = దశార్హున; కున్ = కు; వ్యోముండు = వ్యోముడు; వ్యోమున్ = వ్యోమున; కున్ = కు; జీమూతుండు = జీమూతుడు; జీమూతున్ = జీమూతున; కున్ = కు; వికృతి = వికృతి; వికృతి = వికృతి; కిన్ = కి; భీమరథుండు = భీమరథుడు; భీమరథున్ = భీమరథున; కున్ = కు; నవరథుండున్ = నవరథుడు; నవరథున్ = నవరథున; కున్ = కు; దశరథుండు = దశరథుడు; దశరథున్ = దశరథున; కున్ = కు; శకుని = శకుని; శకుని = శకుని; కిన్ = కి; కుంతి = కుంతి; కుంతి = కుంతి; కిన్ = కి; దేవరాతుండు = దేవరాతుడు; దేవరాతున్ = దేవరాతున; కున్ = కు; దేవక్షత్రుండున్ = దేవక్షత్రుడు; దేవక్షత్రున్ = దేవక్షత్రున; కున్ = కు; మధువు = మధువు; మధువున్ = మధువున; కున్ = కు; కురువశుండున్ = కురువశుడు; కురువశున్ = కురువశున; కున్ = కు; అనువున్ = అనువు; అనువున్ = అనువున; కున్ = కు; పురుహోత్రుండు = పురుహోత్రుడు; అతని = అతని; కిన్ = కి; అంశువు = అంశువు; అతని = అతని; కిన్ = కి; సాత్వతుండు = సాత్వతుడు; సాత్వతున్ = సాత్వతున; కున్ = కు; భజమానుండునున్ = భజమానుడు; భజియునున్ = భజి; దివ్యుండునున్ = దివ్యుడు; వృష్ణియున్ = వృష్ణి; దేవాపృథుండునున్ = దేవాపృథుడు; అంధకుండునున్ = అంధకుడు; మహాభోజుండునున్ = మహాభోజుడు; అనన్ = అనగా; ఏడ్వురుని = ఏడుగురు (7); పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో; భజమానున్ = భజమానున; కున్ = కు; ప్రథమ = మొదటి (1); భార్య = భార్య; అందున్ = తోటి; నిమ్రోచి = నిమ్రోచి; కంకణ = కంకణుడు; వృష్ణులు = వృష్ణుడులు; మువ్వురునున్ = ముగ్గురు (3); రెండవ = రెండవ (2); భార్య = భార్య; అందున్ = తోటి; శతజిత్తు = శతజిత్తు; సహస్రజిత్తు = సహస్రజిత్తు; అయుతజిత్తు = అయుతజిత్తు; అనన్ = అనెడి; మువ్వురున్ = ముగ్గురు (3); పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో; దేవాపృథుని = దేవాపృథుని; కిన్ = కి; బభ్రువు = బభ్రువు; పుట్టెన్ = జన్మించెను; వీరల = వీరు; ఇరువుర = ఇద్దరి (2); ప్రభావంబులన్ = ప్రభావములను; శ్లోక = శ్లోకముల; రూపంబునన్ = రూపమునందు; పఠియింతురు = కీర్తించెదరు; అట్టి = అటువంటి; శ్లోకా = శ్లోకములకు; అర్థంబు = అర్థము; ఎట్టిది = ఎలాంటిది; అనినన్ = అనినచో.

భావము:

ఆ యువతి యందు విదర్భునకు కుశుడు, క్రుథుడు, రోమపాదుడు జన్మించారు; ఆ రోమపాదునకు బభ్రువు; బభ్రువునకు విభువు; విభువునకు కృతి; కృతికి ఉశికుడ; ఉశికునకు చేది; చేదికి చైద్యుడు మున్నగువారు జన్మించారు; కృథునకు కుంతి; కుంతికి ధృష్టి; ధృష్టికి నిర్వృతి; నిర్వృతికి దశార్హుడు; దశార్హునకు వ్యోముడు; వ్యోమునకు జీమూతుడు; జీమూతునకు వికృతి; వికృతికి భీమరథుడు; భీమరథునకు నవరథుడు; నవరథునకు దశరథుడు; దశరథునకు శకుని; శకునికి కుంతి; కుంతికి దేవరాతుడు; దేవరాతునకు దేవక్షత్రుడు; దేవక్షత్రునకు మధువు; మధువునకు కురువశుడు; కురువశునకు అనువు; అనువునకు పురుహోత్రుడు; అతనికి అంశువు; అతనికి సాత్వతుడు; సాత్వతునకు భజమానుడు, భజి, దివ్యుడు, వృష్ణి, దేవాపృథుడు, అంధకుడు, మహాభోజుడు అని ఏడుగురు కుమారులు జన్మించారు. వారిలో భజమానునకు మొదటి భార్య తోటి నిమ్రోచి, కంకణుడు, వృష్ణుడు అని ముగ్గురు; రెండవ భార్య తోటి శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు అని ముగ్గురు; జన్మించారు. వారిలో దేవాపృథునికి బభ్రువు జన్మించాడు. వీరు ఇద్దరి ప్రభావాలను శ్లోకాలతో కీర్తిస్తారు. అటువంటి శ్లోకాలకు అర్థం ఎలాంటిది అంటే...

9-710-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వినుము దూరంబునం దేమి వినుచు నుందు
దియ చూతుము డగ్గఱ రుగుదేర
రులలో బభ్రుకంటె నున్నతుఁడు లేడు
యోజ దేవాపృథున కెన యొరుఁడు గలఁడె?

టీకా:

వినుము = వినుము; దూరంబున = దూరము; అందున్ = నుండి; ఏమి = ఏదైతే; వినుచున్ = వింటూ; ఉందుము = ఉంటామో; అదియ = అదే; చూతుము = చూసెదము; డగ్గఱన్ = దగ్గరకు; అరుగుదేరన్ = వచ్చినచో; నరుల్ = మానవుల; లోన్ = అందు; బభ్రు = బభ్రువు; కంటెన్ = కంటె; ఉన్నతుడు = గొప్పవాడు; లేడు = లేడు; ఓజన్ = ఓజస్సునందు; దేవాపృథున్ = దేవాపృథున; కిన్ = కి; ఎన = సాటి; ఒరుడు = మరింకొకడు; కలడె = ఉన్నాడా, లేడు.

భావము:

వినుము. దూరము నుండి ఏదైతే వింటామో అదే దగ్గర నుండి చూస్తాము. మానవులలో బభ్రువు కంటె గొప్పవాడు లేడు. తేజస్సులో దేవాపృథునకు సాటి మరింకొకడు లేడు.

9-711-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దునాలుగు వేవురు నఱు
దియేవురు నరులు ముక్తి డసిరి బభ్రుం
డుదితుఁడు దేవాపృథుఁడును
పడి యోగంబుఁ దెలియఁలికినకతనన్.

టీకా:

పదునాలుగువేవురు = పద్నాలుగువేల; అఱువదియేవురున్ = అరవైఐదుమంది; నరులు = మానవులు; ముక్తిన్ = మోక్షమును; పడసిరి = పొందిరి; బభ్రుండు = బభ్రువు; ఉదితుడు = చెప్పబడినవాడు; దేవాపృథుడున్ = దేవాపృథుడు; పదపడి = పూని; యోగంబున్ = యోగమును; తెలియపలికిన = ఉపదేశించిన; కతనన్ = కారణముచేత .

భావము:

బభ్రువు, దేవాపృథుడు పూని యోగం ఉపదేశించిన కారణం చేత పద్నాలుగువేల అరవైఐదుమంది మానవులు మోక్షాన్ని పొందారు.

9-712-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మహాభోజుం డతిధార్మికుండు; వాని వంశంబువారు భోజులని పలుకంబడిరి; వృష్ణికి సుమిత్రుండు, యుధాజిత్తును జన్మించి; రందు యుథాజిత్తునకు శినియు, ననమిత్రుండును జనించిరి; అనమిత్రునికి నిమ్నుండు, నిమ్నునికి సత్రాజితుండు, బ్రసేనుండు నన నిరువురు పుట్టిరి; మఱియు ననమిత్రునికి శిని యనువాఁడు వేఱొకండు గలం; డతనికి పుత్రుండు సత్యకుండును; నతనికి యుయుధానుం డనంబరఁగిన సాత్యకియు, నా సాత్యకికి జయుండును, జయునకుఁ గుణియు, నా కుణికి యుగంధరుండునుం బుట్టరి; మఱియు ననమిత్రునకుఁ బృశ్ని యను వేఱొక కొడుకు గలఁడు; వానికి శ్వఫల్క చిత్రకులు గలిగి; రందు శ్వఫల్కునకు గాందినియం దక్రూరుండును, నసంగుండును, సారమేయుండును, మృదుకుండును, మృదుపచ్ఛివుండును, వర్మదృక్కును, ధృష్టవర్ముండును, క్షత్రోపేక్షుండును, నరిమర్దనుండును, శత్రుఘ్నుండును, గంధమాదనుండును, బ్రతిబాహువును నను వారు పన్నిద్ధఱు గొడుకులును సుచారు వను కన్యకయు జనించిరి; వారియం దక్రూరునికి దేవలుండును, ననుపదేవుండునుం బుట్టరి; మఱియుఁ జిత్రునకుఁ బృథుండును విడూరథుండును మొదలుగాఁ గలవారు పెక్కండ్రు వృష్ణివంశజాతు లైరి; భజమానుండు, కుకురుఁడు, శుచి, కంబళబర్హిషుండు నన నలువు రంధకునకుఁ బుట్టిరి; కుకురునికి వృష్ణి వృష్ణికి విలోమతనయుండు, విలోమతనయునుకిఁ గపోతరోముండు గపోతరోమునికి దుంబురు సఖుండైన యనువును, ననువునకు దుందుభి దుందుభికి దవిద్యోతుండు, దవిద్యోతునకుఁ బునర్వసువు, నతనికి నాహుకుండను కుమారుండు, నాహుకి యనుకన్యయుం గలిగి; రా యాహుకునికి దేవకుం, డుగ్రసేనుండు నన నిరువురు జనించి; రందు దేవకునికి దేవలుండు, నుపదేవుండును, సుదేవుండు, దేవవర్ధనుం డన నలుగురు గలిగరి; వారలకు ధృతదేవయు, శాంతిదేవయు, నుపదేవయు, శ్రీదేవయు, దేవరక్షితయు, సహదేవయు, దేవకియు ననఁ దోబుట్టవు లేడ్వురు గలిగిరి; వినుము.

టీకా:

మహాభోజుండు = మహాభోజుడు; అతి = గొప్పగ; ధార్మికుండు = ధర్మముతెలిసినవాడు; వాని = అతని; వంశంబున్ = వంశమునకుచెందిన; వారు = వారు; భోజులు = భోజులు; అని = అని; పలుకంబడిరి = పిలువుబడిరి; వృష్ణి = వృష్ణి; కిన్ = కి; సుమిత్రుండున్ = సుమిత్రుడు; యుధాజిత్తున్ = యుధాజిత్తు; జన్మించిరి = పుట్టిరి; అందున్ = వారిలో; యుథాజిత్తున్ = యుథాజిత్తున; కున్ = కు; శినియున్ = శిని; అనమిత్రుండునున్ = అనమిత్రుడు; జనించిరి = పుట్టిరి; అనమిత్రుని = అనమిత్రుని; కిన్ = కి; నిమ్నుండు = నిమ్నుడు; నిమ్నుని = నిమ్నుని; కిన్ = కి; సత్రాజితుండు = సత్రాజిత్తు; ప్రసేనుండున్ = ప్రసేనుడు; అనన్ = అనెడి; ఇరువురు = ఇద్దరు (2); పుట్టిరి = జన్మించిరి; మఱియున్ = ఇంకను; అనమిత్రుని = అనమిత్రుని; కిన్ = కి; శిని = శిని; అను = అనెడి; వాడు = వాడు; వేఱొకండున్ = ఇంకొకడు; కలండు = ఉన్నాడు; అతని = అతని; కిన్ = కి; పుత్రుండు = కొడుకు; సత్యకుండునున్ = సత్యకుడు; అతని = అతని; కిన్ = కి; యుయుధానుండు = యుయుధానుడు; అనన్ = అనగా; పరగిన = ప్రసిద్ధుడైన; సాత్యకియున్ = సాత్యకి; ఆ = ఆ; సాత్యకి = సాత్యకి; కిన్ = కి; జయుండును = జయుడు; జయున్ = జయున; కుణియున్ = కుణి; ఆ = ఆ; కుణి = కుణి; కిన్ = కి; యుగంధరుండునున్ = యుగంధరుడు; పుట్టిరి = జన్మించిరి; మఱియున్ = ఇంకను; అనమిత్రున్ = అనమిత్రున; కున్ = కు; పృశ్ని = పృశ్ని; అను = అనెడి; వేఱొక = ఇంకొక; కొడుకున్ = పుత్రుడు; కలడు = ఉన్నాడు; వాని = అతని; కిన్ = కి; శ్వఫల్క = శ్వఫల్క; చిత్రకులున్ = చిత్రకుడులు; కలిగిరి = పుట్టిరి; అందున్ = వారిలో; శ్వఫల్కున్ = శ్వఫల్కున; కున్ = కు; గాందిని = గాందిని; అందున్ = అందు; అక్రూరుండున్ = అక్రూరుడు; అనసంగుండునున్ = అనసంగుడు; సారమేయుండునున్ = సారమేయుడు; మృదుకుండును = మృదుకుడు; మృదుపచ్చివుడును = మృదుపచ్చివుడు; వర్మదృక్కును = వర్మదృక్కు; ధృష్టవర్ముండును = ధృష్టవర్ముడు; క్షత్రపేక్షుండును = క్షత్రపేక్షుడు; అరిమర్దనుండును = అరిమర్దనుడు; శత్రుఘ్నుండును = శత్రుఘ్నుడు; గంధమాదనుండును = గంధమాదనుడు; ప్రతిబాహువున్ = ప్రతిబాహువు; అను = అనెడి; వారు = వారు; పన్నిద్ధఱున్ = పన్నెండుమంది (12); కొడుకులునున్ = కొడుకులు; సుచారువు = సుచారువు; అను = అనెడి; కన్యకయున్ = ఆడపిల్ల; జనించిరి = పుట్టిరి; వారి = వారి; అందున్ = లో; అక్రూరున్ = అక్రూరుని; కిన్ = కి; దేవలుండునున్ = దేవలుడు; ఉపదేవుండునున్ = ఉపదేవుడు; పుట్టిరి = జన్మించిరి; మఱియున్ = ఇంకను; చిత్రున్ = చిత్రున; కున్ = కు; పృథుండును = పృథుడు; విడూరథుండును = విడూరథుడు; మొదలుగాగల = మొదలైన; వారు = వారు; పెక్కండ్రు = అనేకమంది; వృష్ణివంశ = వృష్ణివంశమున; జాతులు = పుట్టినవారు; ఐరి = అయినారు; భజమానుండున్ = భజమానుడు; కుకురుడు = కుకురుడు; శుచి = శుచి; కంబళబర్హిషుండును = కంబళబర్హిషుడు; అనన్ = అనెడి; నలువురు = నలుగురు (4); అంధకున్ = అంధకున; కున్ = కు; పుట్టిరి = జన్మించిరి; కుకురుని = కకురుని; కిన్ = కి; వృష్ణి = వృష్ణి; వృష్ణి = వృష్ణి; కిన్ = కి; విలోమతనయుండు = విలోమతనయుడు; విలోమతనయున్ = విలోమతనయున; కిన్ = కి; కపోతరోముండున్ = కపోతరోముడు; కపోతరోముని = కపోతరోముని; కిన్ = కి; తుంబురు = తుంబురుని యొక్క; సఖుండు = స్నేహితుడు; ఐన = అయిన; అనువునున్ = అనువు; అనువున్ = అనువున; కున్ = కు; దుందుభు = దుందుభి; దుందుభి = దుందుభి; కిన్ = కి; దవిద్యోతుండు = దవిద్యోతుడు; దవిద్యోతున్ = దవిద్యోతున; కున్ = కు; పునర్వసువున్ = పునర్వసువు; అతని = అతని; కిన్ = కి; ఆహుకుండు = ఆహుకుడు; అను = అనెడి; కుమారుండున్ = పుత్రుడు; ఆహుకి = ఆహుకి; అను = అనెడి; కన్యయున్ = కుమార్తె; కలిగిరి = పుట్టిరి; ఆ = ఆ; ఆహుకుని = ఆహుకుని; కిన్ = కి; దేవకుండు = దేవకుడు; ఉగ్రసేనుండున్ = ఉగ్రసేనుడు; అనన్ = అనెడి; ఇరువురు = ఇద్దరు (2); జనించిరి = పుట్టిరి; అందున్ = వారిలో; దేవకుని = దేవకుని; కిన్ = కి; దేవలుండునున్ = దేవలుడు; ఉపదేవుండునున్ = ఉపదేవుడు; సుదేవుండు = సుదేవుడు; దేవవర్దనుండు = దేవవర్దనుడు; అనన్ = అనెడి; నలుగురు = నలుగురు (4); కలిగిరి = పుట్టిరి; వారల = వారి; కున్ = కు; ధృతదేవయున్ = ధృతదేవయు; శాంతిదేవయునున్ = శాంతిదేవ; ఉపదేవయు = ఉపదేవ; శ్రీదేవ = శ్రీదేవ; దేవరక్షితయు = దేవరక్షిత; సహదేవయున్ = సహదేవ; దేవకియునున్ = దేవకి; అనన్ = అనెడి; తోబుట్టువులు = సోదరీమణులు; ఏడ్వురున్ = ఏడుగురు (7); కలిగిరి = పుట్టిరి; వినుము = వినుము.

భావము:

మహాభోజుడు గొప్పవాడు, ధర్మం తెలిసినవాడు. అతని వంశానికి చెందిన వారిని భోజులు అని పిలుస్తారు. వృష్ణికి సుమిత్రుడు, యుధాజిత్తు పుట్టారు. వారిలో యుథాజిత్తునకు శిని, అనమిత్రుడు పుట్టారు. అనమిత్రునికి నిమ్నుడు; నిమ్నునికి సత్రాజిత్తు, ప్రసేనుడు అని ఇద్దరు జన్మించారు. ఇంకను అనమిత్రునికి శిని అను పేరుతో ఇంకొకడు ఉన్నాడు. అతనికి కొడుకు సత్యకుడు; అతనికి యుయుధానుడు అని ప్రసిద్ధుడైన సాత్యకి; ఆ సాత్యకికి జయుడు; జయునకు కుణి; ఆ కుణి కి యుగంధరుడు జన్మించారు. ఇంకను అనమిత్రునకు పృశ్ని అని ఇంకొక పుత్రుడు ఉన్నాడు. అతనికి శ్వఫల్క, చిత్రకుడు పుట్టారు; వారిలో శ్వఫల్కునకు గాందిని అందు అక్రూరుడు, అనసంగుడు, సారమేయుడు, మృదుకుడు, మృదుపచ్చివుడు, వర్మదృక్కు, ధృష్టవర్ముడు, క్షత్రపేక్షుడు, అరిమర్దనుడు, శత్రుఘ్నుడు, గంధమాదనుడు, ప్రతిబాహువు అని పన్నెండుమంది కొడుకులు, సుచారువు అనె ఆడపిల్ల పుట్టారు; వారిలో అక్రూరునికి దేవలుడు, ఉపదేవుడు జన్మించారు. ఇంకా చిత్రునకు పృథుడు, విడూరథుడు మొదలైన అనేకమంది వృష్ణివంశంలో పుట్టారు. అంధకునకు భజమానుడు, కుకురుడు, శుచి, కంబళబర్హిషుడు అని నలుగురు పుత్రులు జన్మించారు; కకురునికి వృష్ణి; వృష్ణికి విలోమతనయుడు; విలోమతనయునికి కపోతరోముడు; కపోతరోమునికి తుంబురుని స్నేహితుడైన అనువు; అనువునకు దుందుభి; దుందుభికి దవిద్యోతుడు; దవిద్యోతునకు పునర్వసువు; అతనికి ఆహుకుడు అని కుమారుడు, ఆహుకి అని కుమార్తె పుట్టారు. ఆ ఆహుకునికి దేవకుడు, ఉగ్రసేనుడు అనెడి ఇద్దరు పుట్టారు. వారిలో దేవకునికి దేవలుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవవర్దనుడు అనెడి నలుగురు పుత్రులు, ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనెడి ఏడుగురు పుత్రికలు పుట్టారు. శ్రద్దగ విను.

9-713-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దృశ లలితాకారలఁ
గిలయ కరతలల దేవకీముఖ్యల నా
బిరుహనయనల నందఱ
సుదేవుఁడు పెండ్లియాడె సుధాధీశా!

టీకా:

అసదృశ = సాటిలేని; లలిత = అందమైన; ఆకారలన్ = రూపములుగలవారు; కిసలయ = చిగురాకులవంటి; కరతలలన్ = అరచేతులుకలవారిని; దేవకీ = దేవకీ; ముఖ్యులన్ = మున్నగువారిని; ఆ = ఆ; బిసరుహ = తామరలవంటి; నయనలన్ = కళ్ళుకలవారిని; అందఱన్ = అందరిని; వసుదేవుడు = వసుదేవుడు; పెండ్లియాడె = వివాహముచేసుకొనెను; వసుధాధీశా = రాజా {వసుధాధీశుడు - వసుధ (భూమి)కి అధీశుడు, రాజు}.

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! సాటిలేని అందగత్తెలైన ఆ దేవకీ మున్నగు ఏడుగురు సోదరీమణులను వసుదేవుడు వివాహం చేసుకున్నాడు.

9-714-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఉగ్రసేనునకుఁ గంసుండును, న్యగ్రోధుండును, సునామకుండును, కహ్వుండును, శంకుండును, సుభువును, రాష్ట్రపాలుండును, విసృష్టుండును, దుష్టిమంతుండును ననువారు దొమ్మండ్రు కొడుకులును, కంసయుఁ, గంసవతియు, సురాభువును, రాష్ట్రపాలికయు నను కూఁతులుం బుట్టరి; వారు వసుదేవానుజభార్యలైరి; భజమానునికి విడూరథుండును, విడూరథునికి శినియు, నతనికి భోజుండు భోజునికి హృదికుండును గలిగి; రందు హృదికునికి దేవమీఢుండు, శతధనువు కృతవర్మయు నను కొడుకులు గలిగి; రా దేవమీఢుండు శూరుండు ననంబడు శూరునికి మారిష యను భార్య యందు వసుదేవుండును దేవభాగుండును దేవశ్రవుండును నానకుండును సృంజయుండును శ్యామకుండును గంకుండును ననీకుండును వత్సకుండును వృకుండును ననువారు పదుగురు గొడుకులును బృథయు శ్రుతదేవయు శ్రుతకీర్తియు శ్రుతశ్రవసయు రాజాధిదేవియు నను కూఁతు లేవురును బుట్టిరి; అందు.

టీకా:

ఉగ్రసేనున్ = ఉగ్రసేనున; కున్ = కు; కంసుండునున్ = కంసుడు; న్యగ్రోధుండునున్ = న్యగ్రోధుడు; సునామకుండునున్ = సునామకుడు; కహ్వుండునున్ = కహ్వుడు; శంకుండునున్ = శంకుడు; సుభువునున్ = సుభువు; రాష్ట్రపాలుండునున్ = రాష్ట్రపాలుడు; విసృష్టుండునున్ = విసృష్టుడు; తుష్టిమంతుడునున్ = తుష్టిమంతుడు; అను = అనెడి; వారు = వారు; తొమ్మండ్రు = తొమ్మిదిమంది; కొడుకులునున్ = పుత్రులు; కంసయున్ = కంస; కంసవతియున్ = కంసవతి; సురాభువున్ = సురాభువు; రాష్ట్రపాలియున్ = రాష్ట్రపాలి; అను = అనెడి; కూతులున్ = కుమార్తెలు; పుట్టిరి = జన్మించిరి; వారు = వారు; వసుదేవా = వసుదేవుని; అనుజ = అన్న; భార్యలు = భార్యలు; ఐరి = అయ్యిరి; భజమానుని = భజమానుని; కిన్ = కి; విడూరథుండును = విడూరథుడు; విడూరథుని = విడూరథుని; కిన్ = కి; శినియున్ = శిని; అతని = అతని; కిన్ = కి; భోజుండు = భోజుడు; భోజున్ = భోజుని; కిన్ = కి; హృదికుండును = హృదికుడు; కలిగిరి = పుట్టిరి; అందున్ = వారిలో; హృదికుని = హృదికుని; కిన్ = కి; దేవమీఢుండు = దేవమీఢుడు; శతధనువు = శతధనువు; కృతవర్మయున్ = కృతవర్మ; అను = అనెడి; కొడుకులు = పుత్రులు; కలిగిరి = పుట్టిరి; ఆ = ఆ; దేవమీఢుండు = దేవమీఢుడు; శూరుండు = శూరుడు; అనంబడు = అనబడెడి; శూరుని = శూరుని; కిన్ = కి; మారిష = మారిష; అను = అనెడి; భార్య = భార్యలు; అందున్ = అందు; వసుదేవుండును = వసుదేవుడును; దేవభాగుండును = దేవభాగుడు; దేవశ్రవుండును = దేవశ్రవుడు; ఆనకుండునున్ = ఆనకుడు; సృంజయుండును = సృంజయుడు; శ్యామకుండునున్ = శ్యామకుడు; కంకుండునున్ = కంకుడు; అనీకుండును = అనీకుడు; వత్సకుండును = వత్సకుడు; వృకుండునున్ = వృకుడు; అను = అనెడి; వారు = వారు; పదుగురు = పదిమంది (10); కొడుకులునున్ = పుత్రులు; పృథయు = పృథ; శ్రుతదేవయున్ = శ్రుతదేవ; శ్రుతకీర్తియున్ = శ్రుతకీర్తి; శ్రుతశ్రవసయున్ = శ్రుతశ్రవస; రాజాధిదేవియున్ = రాజాధిదేవి; అను = అనెడి; కూతులున్ = కుమార్తెలు; ఏవురున్ = ఐదుగురు; పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో.

భావము:

ఉగ్రసేనునకు కంసుడు, న్యగ్రోధుడు, సునామకుడు, కహ్వుడు, శంకుడు, సుభువు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టిమంతుడు అనెడి తొమ్మిదిమంది పుత్రులు; కంస, కంసవతి, సురాభువు, రాష్ట్రపాలి అనెడి నలుగురు కుమార్తెలు జన్మించారు. వారు వసుదేవుని అన్నకు భార్యలు అయ్యారు. భజమానునికి విడూరథుడు; విడూరథునికి శిని; అతనికి భోజుడు; భోజునికి హృదికుడు పుట్టారు. వారిలో హృదికునికి దేవమీఢుడు, శతధనువు, కృతవర్మ అనెడి పుత్రులు పుట్టారు; ఆ దేవమీఢునికి శూరుడు అని ఇంకో పేరు ఉంది. శూరునికి భార్యలు మారిష అందు వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవుడు, ఆనకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, అనీకుడు, వత్సకుడు, వృకుడు అనెడి పదిమంది పుత్రులు; పృథ, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవస, రాజాధిదేవి అనెడి కుమార్తెలు ఐదుగురు జన్మించారు. వారిలో...