పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : మరుత్తుని చరిత్ర

 •  
 •  
 •  

9-44-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దిష్టుని కొడుకు నాభాగుం డనువాఁడు కర్మవశంబున వైశ్వత్వంబు నొందె; నా నాభాగునికి హలంధనుండు కలిగె; నతనికి వత్సప్రీతియు, వత్సప్రీతికిఁ బ్రాంశువు, నతనికిఁ బ్రమతియుఁ, బ్రమతికి ఖమిత్రుండు, ఖమిత్రునికిఁ జాక్షుషుండు, నతనికి వివింశతియు, వివింశతికి రంభుండు, రంభునికి ధార్మికుండైన ఖనినేత్రుండు, నతనికిఁ గరంధనుండు, గరంధనున కవిక్షిత్తు, నా యవిక్షిత్తునకు మరుత్తుండు జనియించి; రా మరుత్తుండు చక్రవర్తి యయ్యె; నతని చరిత్రంబు వినుము.

టీకా:

దిష్టుని = దిష్టునియొక్క; కొడుకు = పుత్రుడు; నాభాగుండు = నాభాగుడు; అను = అనెడి; వాడు = వాడు; కర్మవశంబునన్ = తన కర్మవశాత్తు; వైశత్వంబున్ = వైశ్యుడుగానగుటను; ఒందెన్ = పొందెను; ఆ = ఆ; నాభాగున్ = నాభాగుని; కిన్ = కి; హలంధనుండు = హలంధనుడు; కలిగెన్ = పుట్టెను; అతని = అతని; కిన్ = కి; వత్సప్రీతియున్ = వత్సప్రీతి; వత్సప్రీతి = వత్సప్రీతి; కిన్ = కి; ప్రాంశువు = ప్రాంశువు; అతని = అతని; కిన్ = కి; ప్రమతియున్ = ప్రమతి; ప్రమతి = ప్రమతి; కిన్ = కి; ఖమిత్రుండున్ = ఖమిత్రుడు; ఖమిత్రుని = ఖమిత్రుని; కిన్ = కి; చాక్షుసుండున్ = చాక్షుసుడు; అతని = అతని; కిన్ = కి; వివింశతియున్ = వివింశతి; వివింశతి = వివింశతి; కిన్ = కి; రంభుండు = రంభుడు; రంభున్ = రంభుని; కిన్ = కి; ధార్మికుండును = ధార్మికుండు; ఐన = అయినట్టి; ఖనినేత్రుండున్ = ఖనినేత్రుడు; అతని = అతని; కిన్ = కి; కరంధనుండున్ = కరంధనుడు; కరంధనున్ = కరంధనుని; కున్ = కి; అవిక్షిత్తున్ = అవిక్షిత్తు; ఆ = ఆ; అవిక్షిత్తున్ = అవిక్షిత్తుని; కున్ = కి; మరుత్తుండున్ = మరుత్తుడు; జనియించిరి = పుట్టిరి; ఆ = ఆ; మరుత్తుండున్ = మరుత్తుడు; చక్రవర్తి = చక్రవర్తి; అయ్యెన్ = అయ్యెను; అతని = అతనియొక్క; చరిత్రంబు = చరిత్రను; వినుము = వినుము.

భావము:

దిష్టుని పుత్రుడు నాభాగుడు. వాడు తన కర్మవశాత్తు వైశ్యుడుగా అయ్యాడు. ఆ నాభాగుడికి హలంధనుడు పుట్టాడు; అతనికి వత్సప్రీతి; వత్సప్రీతికి ప్రాంశువు; అతనికి ప్రమతి; ప్రమతికి ఖమిత్రుడు; ఖమిత్రునికి చాక్షుసుడు; అతనికి వివింశతి; వివింశతికి రంభుడు; రంభునికి ధార్మికుడు అయిన ఖనినేత్రుడు; అతనికి కరంధనుడు; కరంధనునికి అవిక్షిత్తు; ఆ అవిక్షిత్తునికి మరుత్తుడు పుట్టారు. ఆ మరుత్తుడు చక్రవర్తి అయ్యాడు. అతని చరిత్ర చెప్తాను శ్రద్ధగా విను.

9-45-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంగిరస్సుతుఁడు మహాయోగి సంవర్తుఁ-
తని యాగమునకు యాజకుండు;
దిరిగి యుండెడివారు రుదాఖ్యగణము; లొ-
ప్పారు విశ్వేదేవు చటి సభ్యు;
ధిక దక్షిఁణల బ్రాహ్మణకోటిఁ దనిపెను-
సోమపానంబున సురవరుండు
ది నుబ్బి, బంగారు యము గావించెను-
యాగవస్తువులెల్ల; ధిక నియతి

9-45.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నా మరుత్తుఁడు జేసిన ట్టిభంగి
ధీరభావంబుఁ జాగంబుఁ దెంపు గలిగి
ఖము జేసినవారిని ఱియు నెఱుఁగ
మెల్ల లోకములందు నరేంద్రముఖ్య!

టీకా:

అంగిరస్ = అంగిరసుని; సుతుడు = పుత్రుడు; మహాయోగి = గొప్పయోగి; సంవర్తుడు = సంవర్తుడు; అతని = అతని; యాగమున్ = యజ్ఞమున; కున్ = కు; యాజకుడు = నిర్వాహకుడు, ఋత్విక్కు; తిరిగి = పరివేష్టించి; ఉండెడివారు = ఉండువారు; మరుత్ = మరుత్తులు; ఆఖ్య = అనబడెడి; గణములున్ = సమూహములుకలిగి; ఒప్పారు = అతిశయించును; విశ్వేదేవతలు = విశ్వేదేవతలు; అచటి = అక్కడి; సభ్యులు = సదస్యులు; అధిక = ఎక్కువ; దక్షిణలన్ = దక్షిణలతో; బ్రాహ్మణ = బ్రహ్మణుల; కోటిన్ = సమూహమును; తనిపెను = తృప్తిపరచెను; సోమపానంబునన్ = సోమపానముచేత; సురవరుండు = దేవేంద్రుడు; మదిని = మనసునందు; ఉబ్బి = పొంగిపోయి; బంగారు = బంగారముతో; మయంబున్ = చేసినవిగా; కావించెను = చేసెను; యాగ = యజ్ఞ; వస్తువులు = సామగ్రి; ఎల్లన్ = సమస్తమును; అధిక = మిక్కిలి; నియతిన్ = పద్దతిప్రకారము; ఆ = ఆ.
మరుత్తుడు = మరుత్తుడు; చేసిన = ఆచరించిన; అట్టి = అటువంటి; భంగిన్ = విధముగా; ధీరభావంబున్ = ధీరత్వము; చాగంబున్ = త్యాగము; తెంపు = తెగింపు; కలిగి = తోటి; మఖమున్ = యజ్ఞము; చేసిన = చేసినట్టి; వారిని = ఇంకొకరిని; మఱియున్ = ఇంక; ఎఱుగము = చూడబోము; ఎల్ల = సమస్తమైన; లోకములు = లోకములు; అందున్ = అందుకూడ; నరేంద్రముఖ్య = మహారాజా {నరేంద్రముఖ్యుడు - నరేంద్రుడు (రాజు)లలో ముఖ్యుడు, మహారాజు}.

భావము:

ఓ మహారాజ! ఆ మరుత్తు యగానికి అంగిరసుని కొడుకు ఋత్విక్కు సంవర్తుడు నిర్వాహకుడు; మరుత్తులు పరివేష్టించి ఉండేవారు. విశ్వేదేవతలు అక్కడి సదస్యులు. అధిక దక్షిణలతో బ్రహ్మణులను తృప్తిపరచాడు. సోమపానముతో దేవేంద్రుడు పొంగిపోయి, యజ్ఞ సామగ్రి సమస్తాన్ని బంగారపు వాటిగా మార్చేసాడు. ఆ మరుత్తుడు ఆచరించినట్లు ధీరత్వము, త్యాగము, తెగింపు తోటి యజ్ఞము చేసిన వారిని మరొకరిని ఏ లోకంలోను ఇంక చూడలేము.

9-46-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఆమరుత్తునకు దముండును, దమునకు రాజవర్ధనుండును, రాజ వర్ధనునకు సుధృతియు, సుధృతికి సౌధృతేయుండును, సౌధృతే యునకు గేవలుండును, కేవలునకు బంధుమంతుడును, నతనికి వేదవంతుండును, వేదవంతునికి బంధుండును, బంధునకుఁ దృణబిందుండును సంభవించి; రంత.

టీకా:

ఆ = ఆ; మరుత్తున్ = మురుత్తుని; కున్ = కి; దముండు = దముడు; దమున్ = దముని; కున్ = కి; రాజవర్ధనుండును = రాజవర్ధనుడు; రాజవర్ధనున్ = రాజవర్ధనుని; కున్ = కి; సుధృతియు = సుధృతి; సుధృతి = సుధృతి; కిన్ = కి; సౌధృతేయుండును = సౌధృతేయుడు; సౌధృతేయున్ = సౌధృతేయుని; కున్ = కి; కేవలుండును = కేవలుడు; కేవలున్ = కేవలుని; కున్ = కి; బంధుమంతుడునున్ = బంధుమంతుడు; అతని = అతని; కిన్ = కి; వేదవంతుండును = వేదవంతుడు; వేదవంతున్ = వేదవంతుని; కిన్ = కి; బంధుండును = బంధుడు; బంధున్ = బంధుని; కున్ = కి; తృణబిందుండును = తృణబిందుడు; సంభవించిరి = పుట్టిరి; అంత = అంతట.

భావము:

ఆ మరుత్తుడికి దముడు; దమునికి రాజవర్ధనుడు; రాజవర్ధనునికి సుధృతి; సుధృతికి సౌధృతేయుడు; సౌధృతేయునికి కేవలుడు; కేవలునికి బంధుమంతుడు; అతనికి వేదవంతుడు; వేదవంతునికి బంధుడు; బంధునికి తృణబిందువు పుట్టారు. అంతట....

9-47-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చ్చరకన్య యలంబుస
గ్రచ్చఱఁ దృణబిందుఁ జూచి కామించి, తుదిం
చ్చవిలుకాని యమ్ముల
ముచ్చిచ్చున వచ్చి, పొందె మోహాతురయై

టీకా:

అచ్చర = అప్సరస; కన్య = స్త్రీ; అలంబుస = అలంబుస; క్రచ్చఱన్ = శ్రీఘ్రముగ; తృణబిందున్ = తృణబిందుని; చూచి = చూసి; కామించి = కాంక్షించి; తుదిన్ = చివరకు; పచ్చవిలుకాని = మన్మథుని {పచ్చవిలుకాడు - పచ్చని విల్లు కలవాడు, మన్మథుడు}; అమ్ములన్ = బాణములు యనెడి; ముచ్చిచ్చునన్ = త్రేతాగ్నిలో; వెచ్చి = కాగిపోయి; పొందెన్ = కలిసెను; మోహా = మోహముచేత; ఆతుర = ఆతృతచెందినామె; ఐ = అయ్యి.

భావము:

అప్సరస స్త్రీ అలంబుస తృణబిందుని చూడగానే కాంక్షించింది. చివరకు మోహ పరవశ అయ్యి, మన్మథుని బాణములు అను త్రేతాగ్నిలో కాగిపోయి తృణబిందుని కలిసింది.