పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రంతిదేవుని చరిత్రము

  •  
  •  
  •  

9-647-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"న్నము లేదు కొన్ని మధురాంబువు లున్నవి; త్రావు మన్న! రా
న్న! శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపదల్
గ్రన్నన మాన్చి వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మే
లున్నదె? నాకు దిక్కు పురుషోత్తముఁ డొక్కఁడ చుమ్ము పుల్కసా!"

టీకా:

అన్నము = అన్నము; లేదు = లేదు; కొన్ని = కొద్దిగా; మధురాంబువులున్ = మంచినీళ్ళు; ఉన్నవి = ఉన్నాయి; త్రావుము = తాగుము; అన్న = నాయనా; రావు = రా; అన్న = నాయనా; శరీరధారుల్ = జీవుల; కున్ = కు; ఆపద = కష్టము; వచ్చినన్ = కలిగినచో; వారి = వారి యొక్క; ఆపదల్ = కష్టములను; క్రన్ననన్ = వెంటనే; మాన్చి = పోగొట్టి; వారి = వారల; కిన్ = కు; సుఖంబులు = సౌఖ్యములు; చేయుట = చేయుట; కన్నన్ = కంటెను; ఒండు = మరియొక; మేలు = ఉత్తమమైనది; ఉన్నదె = ఉన్నదా, లేదు; నా = నా; కున్ = కు; దిక్కు = అండ; పురుషోత్తముడు = విష్ణువు; ఒక్కడ = మాత్రమే; చుమ్ము = సుమా; పుల్కసా = చండాలుడా.

భావము:

“ఓ యన్నా! అన్నం అయితే లేదు కాని కొద్దిగా మంచినీళ్ళు ఉన్నాయి. తాగు నాయనా! రా నాయనా! తోటి మానవుడికి కష్టం వచ్చినప్పుడు, వాని కష్టాలను వెంటనే పోగొట్టి ఆదుకోవడం కంటె ఉత్తమమైన పని లేదు కద. నాకు అండ దండ శ్రీమహావిష్ణువు మాత్రమే సుమా”