పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దుష్యంతుని చరిత్రము

  •  
  •  
  •  

9-594-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పారావారపరీతో
దా ధరాభారదక్ష క్షిణహస్త
శ్రీ రాజిల్లఁగ నొకనాఁ
డా రాజేంద్రుండు వేఁటయం దభిరతుఁడై.

టీకా:

పారావార = సముద్రముచే; పరీత = చుట్టబడిన; ఉదార = పెద్ద; ధరా = భూమి, రాజ్యము; భార = భారమును; దక్ష = వహించడానికి సమర్థమైన; దక్షిణ = కుడి; హస్త = చేతి; శ్రీ = సుప్రశస్తము; రాజిల్లగన్ = విరాజిల్లుతుండగ; ఒక = ఒకానొక; నాడు = రోజు; ఆ = ఆ; రాజేంద్రుండు = మహారాజు; వేట = వేటాడుట; అందున్ = అందు; అభిరతుడు = ఆసక్తి కలవాడు; ఐ = అయ్యి.

భావము:

నాలుగు చెరగుల సముద్రమే సరిహద్దుగా కల పెద్ద రాజ్యాన్ని ఏలే సమర్థమైన తన కుడిచెయ్యి సుప్రశస్తమై విరాజిల్లుతుండగా. ఒకనాడు, ఆ దుష్యంత మహారాజు వేటపై కోరికతో అడవికి బయలుదేరాడు.

9-595-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గంక కంఠీరవ భే
రుం శశవ్యాళ కోల రోహిష రురు వే
దంవ్యాఘ్ర మృగాదన
చం శరభ శల్య భల్ల మరాటవులన్.

టీకా:

గండక = ఖడ్గమృగములు; కంఠీరవ = సింహములు {కంఠీరవము - కంఠమున శబ్దము కలది, సింహము}; భేరుండ = గండభేరుండములు {గండభేరుండము - రెండు తలలు మూడు కన్నుల కలిగి ఏనుగును తన్నుకుపోగల పక్షి}; శశ = కుందేలు; వ్యాళ = పాము; కోల = అడవిపందులు; రోహిష = కొండగొఱ్ఱె; రురు = లేళ్ళు; వేదండ = ఏనుగులు; వ్యాఘ్ర = పెద్దపులులు; మృగాదన = సివంగి {మృగాదనము - మృగములను తినునది, సివంగి}; చండ = పులులు; శరభ = మీగండ్ల మెకములు {శరభము - సింహమును చంపునది, 8 కాళ్ళు శిరోనేత్రములును కల జంతువు, మీగండ్ల మెకము}; శల్య = ఏదుపందులు; భల్ల = భల్లూకము; చమర = సవరపుమెకములు ఉన్న {చమరము - దీనినుండి చామరములు చేయబడును, సవరపు మెకము}; అటవులన్ = అడవులలో.

భావము:

ఆ అడవిలో ఖడ్గమృగాలు, సింహాలు, గండభేరుండాలు, కుందేళ్ళు, పాములు, అడవిపందులు, కొండగొఱ్ఱెలు, లేళ్ళు, ఏనుగులు, పెద్దపులులు, సివంగులు, పులులు, శరభాలు, ఏదుపందులు, భల్లూకాలు, చమరమృగాలు తిరుగుతుంటే....

9-596-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పుడు చేయుచు మృగముల
రొప్పుచు నీరముల యందు రోయుచు వలలం
ద్రిప్పుకొని పడఁగఁ బోవుచుఁ
ప్పక వ్రేయుచును వేఁటమకం బొప్పన్.

టీకా:

చప్పుడు = పెద్దశబ్దములు; చేయుచున్ = చేస్తూ; మృగములన్ = జంతువులను; రొప్పుచున్ = తఱుముతు; ఈరములన్ = పొదల; అందున్ = లో; రోయుచున్ = వెదకుచు; వలలన్ = వలలను; త్రిప్పుకొని = చిక్కుపడి; పడగన్ = పడునట్లు; పోవుచున్ = వెళ్ళుతు; తప్పక = గురి తప్పకుండగ; వ్రేయుచున్ = వేస్తూ; వేట = వేటాడెడి; తమకంబు = మోహము; ఒప్పన్ = అతిశయించగ.

భావము:

పెద్దశబ్దాలు చేస్తూ, ఆ జంతువులు అన్నింటినీ తఱుముతు పొదలలో వెదకుతు, వలలలో పడేస్తు, గురితప్పకుండ బాణాలు వేసి వేటాడాలనే మోహంతో....

9-597-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మృయూథంబుల వెంటను
మృలాంఛన సన్నిభుండు మృగయాతురుఁడై
మృయులు గొందఱు గొలువఁగ
మృరాజపరాక్రమంబు మెఱయఁగ వచ్చెన్.

టీకా:

మృగ = జంతువుల; యూథంబుల = సమూహముల; వెంటన్ = వెనుక; మృగలాంఛన = చంద్రునితో {మృగలాంఛనుడు - లేడి చిహ్నముగా కలవాడు, చంద్రుడు}; సన్నిభుండు = సమానుడు; మృగయా = వేట యందు; ఆతురుడు = తొందరకలవాడు; ఐ = అయ్యి; మృగయులు = వేటగాళ్ళు; కొందఱున్ = కొంతమంది; కొలువన్ = సేవించుతుండగా; మృగరాజ = సింహ; పరాక్రమంబున్ = పరాక్రమము; మెఱయగన్ = ప్రకాశించుచుండగా; వచ్చెన్ = చరించెను.

భావము:

దుష్యంత రాజచంద్రుడు వేట తమకంతో, వేటగాళ్ళు సేవిస్తుండగా, సింహ పరాక్రమం ప్రకాశిస్తుండగా జంతువుల వెంట పడి వేటాడసాగాడు.

9-598-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వచ్చివచ్చి దైవయోగంబునఁ గణ్వమహాముని తపోవనంబు చేరం జని.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వచ్చివచ్చి = చాలా దూరము వెళ్ళి; దైవయోగంబునన్ = దైవఘటనవలన; కణ్వ = కణ్వుడు అనెడి; మహా = గొప్ప; ముని = ఋషి యొక్క; తపస్ = తపస్సు చేసుకొనెడి; వనంబున్ = తోపునకు; చేరన్ = దగ్గరకు; చని = వెళ్ళి .

భావము:

ఇలా వేట తమకంలో చాలా దూరం పోయి పోయి దైవయోగంవలన కణ్వ మహర్షి తపస్సు చేసుకునే ఆశ్రమానికి వెళ్ళాడు.

9-599-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుతర శ్రాంతాహి యుగళంబులకుఁ బింఛ-
ముల విసరెడి కేకిముఖ్యములను
రుణతో మదయుక్త లభంబులకు మేఁత-
లిడుచు ముద్దాడు మృగేంద్రములును
నమృగాదనములు గాపుగా లేళ్ళతో-
తులు సాగించు సారంగములను
నునుపుగా హోమధేనువుల కంఠంబులు-
దువ్వుచు నాడు శార్దూలములను

9-599.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దార కలహించు నుందురు దంపతులకు
మైత్రి నంకించు మార్జాలల్లములను
తిని జాతివైరంబులు మాని యిట్లు
లసి క్రీడించు మృగములఁ గాంచె నతఁడు.

టీకా:

ఉరుతర = అతిమిక్కిలి {ఉరువు - ఉరుతరము - ఉరుతమము}; శ్రాంత = అలసిన; అహి = పాముల; యుగళంబుల్ = జంటల; కున్ = కు; పింఛములన్ = పింఛములతో; విసరెడి = గాలివిసరెడి; కేకి = నెమళ్ళు; ముఖ్యములను = ఉత్తమములను; కరుణ = దయ; తోన్ = తోటి; మదయుక్త = మదించిన; కలభంబుల్ = ఏనుగుల; కున్ = కు; మేతలు = తినెడి ఆకులు అలములు; ఇడుచు = పెడుతు; ముద్దాడు = ముద్దులుపెట్టెడి; మృగేంద్రములును = సింహమును {మృగేంద్రము - జంతువులలో శ్రేష్ఠమైనది, సింహము}; ఘన = గొప్ప; మృగాదనములు = సివంగులు; కాపు = కాపలా; కాన్ = ఉండగా; లేళ్ళ = ఆడు జింకల; తోన్ = తోటి; రతులు = సురతములు; సాగించు = చేసెడి; సారంగములును = మగ జింకలను; నునుపుగా = మృదువుగా; హోమధేనువుల = యాగగోవుల; కంఠంబులున్ = మెడలను; దువ్వుచున్ = రాస్తూ; ఆడు = ఆడుకొనెడి; శార్దూలములను = పులులను; తార = తమలోతామే .
కలహించు = పోట్లాడుకొనెడి; ఉందురు = ఉడుత; దంపతుల = జంటల; కున్ = కు; మైత్రిన్ = పొత్తు; అంకించు = కుదుర్చెడి; మార్జాల = పిల్లుల; మల్లములను = శ్రేష్ఠములను; మతిని = మనసునందు; జాతివైరంబున్ = సహజశత్రుభావములు; మాని = విడిచి; ఇట్లు = ఈ విధముగ; కలసి = కలసిమెలసి; క్రీడించు = విహరించెడి; మృగములన్ = జంతువులను; కాంచెన్ = చూసెను; అతడు = అతను .

భావము:

అలా దైవయోగం వలన వచ్చిన దుష్యంతుడు కణ్వశ్రమంలో తమ సహజమైన శత్రుబావాలు విడిచి అలసిన పాముల జంటలకు పురులు విప్పి పింఛాలతో గాలి విసరె నెమళ్ళు; మదించిన ఏనుగుగున్నలకు జాలితో ఆకులు అలములు ముద్దుగా పెడుతున్న సింహాలు; సివంగులు కాపలా ఉండగా ఆడు జింకలతో జతకట్టే మగ జింకలు; మృదువుగా హోమధేనువుల మెడలను మెల్లగా రాస్తూ ఆడుకొనె పులులు; పోట్లాడుకుంటున్న ఉడుత జంటలకు పొత్తు కుదుర్చెడి పిల్లులు; ఇలా సకల జంతువులు కలసిమెలసి మెలగుతుంటే దుష్యంతుడు చూసాడు.

9-600-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఇత్తెఱఁగున మృగజాతుల
పొత్తులు మే మెఱుఁగ" మనుచు భూవల్లభుఁడుం
జిత్తములోపల నా ముని
త్తము సద్వృత్తమునకు సంతసపడుచున్.

టీకా:

ఈ = ఈ; తెఱంగునన్ = విధముగ; మృగ = జంతువుల; జాతుల = జాతుల మధ్య; పొత్తులు = స్నేహము; మేమున్ = మేము; ఎఱుగము = తెలియము; అనుచున్ = అనుకొనుచు; భూవల్లభుడు = రాజు; చిత్తము = మనసు; లోపలన్ = లో; ఆ = ఆ; ముని = మునులలో; సత్తమున్ = సమర్థుని; సత్ = గొప్ప; వృత్తమున్ = వర్తనమున; కున్ = కు; సంతసపడుచున్ = అబ్బురపడుచు.

భావము:

“ఈ విధంగ సహజ శత్రు జంతు జాతుల మధ్య స్నేహం ఎక్కడా వినలేదు.” అనుకుంటూ దుష్యంతమహారాజు మనసులో ఆ కణ్యమహాముని సమర్థతకు అబ్బురపడ్డాడు.

9-601-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లక బిసురుహ సరసీ
ల్లోలోత్ఫుల్ల యూథికా గిరిమల్లీ
ల్లీ మరువక కురువక
ల్లలితానిలమువలన సంతుష్టుండై

టీకా:

హల్లక = చెంగలువల; బిసరుహ = తామరపూల; సరసీ = సరస్సు యొక్క; కల్లోల = అలల; ఉత్ఫల్ల = మీదుగాపుట్టిన; యూధికా = అడవిమొల్లల; గిరిమల్లీ = కొండమల్లెల; మల్లీ = మల్లెపూల; మరువక = మరువము యొక్క; కురువక = గురివిందల; సల్లలిత = చక్కటి; అనిలముల = మారుతముల; వలన = చేత; సంతుష్టుండు = సంతోషించినవాడు; ఐ = అయ్యి .

భావము:

చెంగలువల తామరపూల కొలను అలల మీదుగా, వీస్తున్న అడవిమొల్లల, కొండమల్లెల, మల్లెపూల, మరువం, గురివిందల సువాసనలతో కూడిన మందమారుతాలతో దుష్యంతుడు సేదదీరాడు.

9-602-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుష్యంతుండు వచ్చు నవసరంబున.

టీకా:

దుష్యంతుండు = దుష్యంతుడు; వచ్చున్ = వచ్చెడి; అవసరంబునన్ = సంయమునందు .

భావము:

అలా ఆశ్రమానికి దుష్యంతుడు వచ్చిన సమయంలో.

9-603-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇందిందిరాతిసుందరి
యిందిందిరచికుర యున్న దిందింద; శుభం
బిం దిందువంశ; యను క్రియ
నిందీవరవీథి మ్రోసె నిందిందిరముల్.

టీకా:

ఇందిందిర = లక్ష్మీదేవి; అతి = కంటెనెక్కువ; సుందరి = అందమైనామె; ఇందిందిర = తుమ్మెదలవంటి; చికుర = ముంగురులుకలామె; ఉన్నది = ఉంది; ఇందిందన్ = దగ్గరలోనే; శుభంబు = మంచిజరుగును; ఇందు = ఇక్కడ; ఇందువంశ = చంద్రవంశస్తుడా; అను = అనుచున్న; క్రియన్ = విధముగ; ఇందీవర = నల్ల కలువల; వీథిన్ = సమూహమునందు; మ్రోసెన్ = ఝంకారముచేసినవి; ఇందిందిరముల్ = మధుపములు .

భావము:

“ఓ చంద్రవంశోద్ధారకా! లక్ష్మీదేవికంటె అందగత్తె, తుమ్మెదల వంటి ముంగురులు గల సుందరి శకుంతల ఇక్కడే ఉంది. ఇక్కడ నీకు శుభం కలుగుతుంది.” అన్నట్లుగా కలువపూలల్లో తిరుగుచున్న తుమ్మెదలు ఝంకారాలు చేశాయి.

9-604-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మా కందర్పుని శరములు
మాకందము లగుటఁ జేసి మా కందంబుల్
మాకందము లను కైవడి
మాకందాగ్రములఁ బికసమాజము లులిసెన్.

టీకా:

మా = మా యొక్క; కందర్పుని = మన్మథుని; శరములు = బాణములు; మాకందములు = మామిడిపూలు; అగుటన్ = ఐ ఉండుటచేత; మాకందంబుల్ = మామిడిచెట్లు; మా = మా; కున్ = కు; అందములు = తగినవి; అను = అనుచున్న; కైవడిన్ = విధముగ; మాకంద = మామిడిచెట్ల; అగ్రములన్ = కొనకొమ్మలలో; పిక = కోయిలల; సమాజమున్ = సమూహములు; ఉలుసెన్ = కూజితములు చేసినవి .

భావము:

మా మన్మథునిబాణాలు మామిడిపూలు అగుటచేత మామిడిచెట్లు మాకు తగి ఉన్నాయి అంటున్నట్లుగా కోయిలలు కూస్తున్నాయి.

9-605-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత.

టీకా:

అంత = అంతట .

భావము:

అంతట అలా ప్రకృతి సహకరించి ఆహ్వానిస్తునట్లు ఉండగా దుష్యంతుడు.

9-606-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇందున్న కణ్వమునికిని
వంన మొనరించి తిరిగి చ్చెద ననుచుం
బొందుగ ననుచరులను దా
నంఱ నందంద నిలిపి టఁ జని మ్రోలన్.

టీకా:

ఇందు = దీనిలో; ఉన్న = ఉన్నట్టి; కణ్వ = కణ్వుడు అనెడి; ముని = ఋషి; కిని = కి; వందనము = నమస్కారము; ఒనరించి = చేసి; తిరిగి = మరలి; వచ్చెదన్ = వస్తాను; అనుచున్ = అనుకొనుచు; పొందుగన్ = చక్కగా; అనుచరులన్ = కూడవచ్చినవారిని; తాన్ = అతను; అందఱన్ = అందరిని; అందంద = అక్కడే; నిలిపి = ఆపివేసి; అటన్ = అక్కడకు; చని = వెళ్ళి; మ్రోలన్ = ఎదురుగ .

భావము:

దుష్యంతుడు ఈ ఆశ్రమంలో ఉన్న కణ్వ మహామునికి నమస్కారం చేసి వస్తాను అనుకుంటూ, కూడ వచ్చిన వారిని అందరిని అక్కడే ఉండమని తాను ముందుకు వెళ్ళి అక్కడ ఎదురుగా.....

9-607-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణ్వాశ్రమమందు నీరజనివాసాంతప్రదేశంబులన్
మాకందంబులనీడఁ గల్పలతికా ధ్యంబులన్ మంజు రం
భాకాండాంచితశాలలోఁ గుసుమ సంన్నస్థలిం జూచె నా
భూకాంతుండు శకుంతలన్ నవనటద్భ్రూపర్యటత్కుంతలన్.

టీకా:

ఆ = ఆ; కణ్వ = కణ్వుని; ఆశ్రమము = ఆశ్రమము; అందున్ = లో; నీరజనివాస = కొలను {నీరజనివాసము – పద్మముల చోటు, సరస్సు}; అంత = దగ్గర; ప్రదేశంబులన్ = ప్రదేశములలో; మాకందంబుల = మామిడిచెట్ల; నీడన్ = నీడలలో; కల్పలతికా = పుష్పలతల; మధ్యంబులన్ = నడుమ; మంజు = మనోజ్ఞమైన; రంభా = అరటి; కాండ = బోదెలు; అంచిత = అలకరించిన; శాల = శాల; లోన్ = అందు; కుసుమ = పూలతో; సంపన్న = సంపన్నమైన; స్థలిన్ = స్థలము నందు; చూచెన్ = చూసెను; ఆ = ఆ; భూకాంతుండు = రాజు; శకుంతలన్ = శకుంతలను; నవ = సరికొత్తగా; నటత్ = చలిస్తున్న; భ్రూ = భ్రుకుటి; పర్యటత్ = అలముకొన్న; కుంతలన్ = ముంగురులు కలామెను.

భావము:

ఆ కణ్వాశ్రమంలో కొలను సమీపంలో మామిడిచెట్ల నీడలో మనోజ్ఞమైన అరటి బోదెలు అలకరించిన శాల కనబడింది. ఆ శాలలో పూలగుత్తుల నడుమ చక్కదనాల చోటునందు దుష్యంత మహారాజు నవనవోన్మేషంగా చలిస్తూ నుదుట అలముకుంటున్న ముంగురులు కల శకుంతలను సందర్శించాడు.

9-608-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టపుఁ దుఱుమును మీఁదికి
మిట్టించిన చన్నుఁగవయు మిఱుమిఱు చూడ్కుల్
ట్టాడునడుముఁ దేనియ
లుట్టెడు మోవియును మనము నూరింపంగన్.

టీకా:

దట్టపు = వత్తుగా ఉన్న; తుఱుమును = జుట్టు; మీదికిన్ = పైకి; మిట్టించిన = నిక్కిన; చన్ను = స్తనముల; కవయున్ = జంట; మిఱుమిఱు = చలించే; చూడ్కుల్ = చూపులు; నట్టాడు = నాట్యమాడెడి; నడుమున్ = నడుము; తేనియల్ = తేనెలు; ఉట్టెడు = ఊరెడి; మోవియునున్ = పెదవి; మనమున్ = మనసున్; ఊరింపగన్ = ఆశలురేపుచుండగ.

భావము:

ఆమె వత్తుగా ఉన్న జుట్టు; పైకి ఉబికిన స్తనద్వయం; చలించే చూపులు; నాట్యలాడే నడుము; తేనెలూరే పెదవి; ఆ రాకుమారుని మనసున ఆశలు రేపసాగాయి.

9-609-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతనా రాజకుమారుం డలరుటమ్ములవిలుకాని వెడవింట ఘణఘణాయమానలయి మ్రోయు ఘంటలకుం బంటించి, తన మనంబున.

టీకా:

అంతన్ = అంతట; రాజకుమారుండు = రాకుమారుడు; అలరుటమ్ములవిలుకాని = మన్మథుని {అలరు టమ్ముల విలుకాడు - పుష్పములు బాణములుగా గల విల్లుగలవాడు, మన్మథుడు}; వెడవింటన్ = పూలవిల్లు యొక్క; ఘణఘణ = గణగణ మనెడి శబ్దములు; ఆయమానలు = వచ్చెడివి; అయి = ఐ; మ్రోయు = ధ్వనించెడి; ఘంటల్ = గంటల; కున్ = కు; పంటించి = తడబడి; తన = తన; మనంబునన్ = మనసునందు;

భావము:

అంతట. ఆ రాకుమారుడు మారుని వింటి గంటల గణగణ ధ్వనులకు తడబడిన తన మనసులో...

9-610-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"న్యాహారములన్ జితేంద్రియత నావాసించు నా కణ్వుఁ డీ
న్యారత్నము నే గతిం గనియెడిం; గా దీ కురంగాక్షి రా
న్యాపత్యముగాఁగనోపు; నభిలాషం బయ్యెఁ; గాదేని నే
న్యాయక్రియలందుఁ బౌరవుల కెం దాశించునే చిత్తముల్?

టీకా:

వన్య = అడవిలో దొరికెడి; ఆహారములన్ = కందమూలాదులను; జితేంద్రియతన్ = ఇంద్రియముల జయముతో; ఆవాసించున్ = తినెడి; ఆ = ఆ; కణ్వుడు = కణ్వుడు; ఈ = ఈ; కన్యా = యువతులలో; రత్నమున్ = శ్రేష్ఠరాలను; ఏ = ఎలాంటి; గతిన్ = విధముగను; కనియెడిన్ = పుట్టించ గలిగనివాడు; కాదు = కాదు; ఈ = ఈ; కురంగాక్షి = సుందరి {కురంగాక్షి - లేడివలె బెదురుచూపులు కలామె,వనిత}; రాజన్యా = క్షత్రియోత్తముని; ఆపత్యమున్ = సంతానము; కాగన్ = అయి; ఓపున్ = ఉండవచ్చును; అభిలాషంబు = కోరిక కలుగుట; అయ్యెన్ = జరిగెను; కాదేనిన్ = కాకపోయినచో; ఏ = ఎలాంటి; అన్యాయ = అధర్మపు; క్రియలు = పనుల; అందున్ = ఎడలను; పౌరవుల = పురువంశస్థుల; కున్ = కు; ఎందు = ఎలా చూసినను; ఆశించునే = ఆశపడునా, పడవు; చిత్తముల్ = మనసులు.

భావము:

“అడవిలో దొరికే కందమూలాలు తింటూ జితేంద్రియుడై మెసలే, ఆ కణ్వునికి ఇంతటి సుందర కన్యారత్నం ఎల పుట్టిందో? కాదు ఈ లేడి కన్నుల చిన్నది రాకుమారి అయి ఉండవచ్చు. అలా కాకపోతే నాకు ఈమె పట్ల కోరిక కలుగదు గదా. పురువంశం వారి మనసులు ఎలాంటి అధర్మకార్యాలలోనూ ప్రవర్తిల్లవు కదా.

9-611-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డిగిన నృపసుతుఁ గానని
నొడివెడినో యిది మనంబు నొవ్వ" నని విభుం
డుడురాజవదన నడుగక
డుమన యొక కొంత ప్రొద్దు డఁబడ జొచ్చెన్.

టీకా:

అడిగిన్ = ఒకవేళ అడిగినచో; నృపసుత = రాకుమారిని; కాను = కాను; అని = అని; నొడివెడినో = చెప్పుతుందేమో; ఇది = ఈమె; మనంబున్ = మనసు; నొవ్వన్ = నొచ్చుకొనునట్లు; అని = అని; విభుండు = రాజు; ఉడురాజవదన = చంద్రవదనను; అడుగక = అడుగకుండ; తడుమనన్ = సందేహముతో; ఒకకొంత = కొద్ది; ప్రొద్దున్ = సమయము; తడబడజొచ్చెన్ = తడబడసాగెను.

భావము:

నోరువిప్పి అడిగితే చంద్రవదనంతో అలరారే ఈ రాకుమారి, నా మనసు నొచ్చుకొనేలా కాదంటుందేమో” అనే సందేహంతో రాకుమారుడు కొద్దిసేపు తటపటాయించాడు.

9-612-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నెట్టకేలకుఁ దన చిత్తసంచారంబు సత్యంబుగాఁ దలంచి యిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; ఎట్టకేలకున్ = చిట్టచివరకు; తన = తన యొక్క; చిత్త = మనసులో; సంచారంబున్ = మెదలినది; సత్యంబు = సరియగునది; కాన్ = అయినట్లు; తలంచి = భావించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .

భావము:

ఇక చిట్టచివరకు, తన మనసులో మెదలిన ప్రేరణ సత్యమని భావించి ఇలా అన్నాడు.

9-613-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"భూపాలక కన్యక వని
నీ యిఁ జిత్తంబు నాఁటె; నీవా రేరీ?
నీ పేరెవ్వరు? నిర్జన
భూర్యటనంబు దగవె? పూర్ణేందుముఖీ!"

టీకా:

భూపాలకకన్యకవి = రాకుమారివి; అని = అని; నీ = నీ; పయిన్ = మీద; చిత్తంబున్ = మనసు; నాటెన్ = లగ్నమైనది; నీ = నీకు; వారు = చెందినవారు; ఏరీ = ఎక్కడ ఉన్నారు; నీ = నీ యొక్క; పేరు = నామధేయము; ఎవ్వరు = ఏమిటి; నిర్జన = జనసంచారములేని; భూపర్యటనంబు = ప్రదేశమున తిరుగుట; తగవె = సరియైన పనా, కాదు; పూర్ణేందుముఖీ = సుందరీ {పూర్ణేందుముఖి - నిండు చంద్రునివంటి మోము కలామె, స్త్రీ}.

భావము:

“ఓ నిండుచంద్రుని వంటి మోము గల సుందరీ! నీవు రాకుమారివి అని నీ మీద నా మనసు లగ్నమైంది. జనసంచారం లేని చోట ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? నీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నీ నామధేయం ఏమిటి?”

9-614-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలుకుచున్న రాజకుమారుని వదనచంద్రికారసంబు నేత్ర చకోరంబులవలనం ద్రావుచు, నయ్యువిద విభ్రాంతయై యున్న సమయంబున.

టీకా:

అని = అని; పలుకుచున్న = అడుగుతున్న; రాజకుమారుని = రాకుమారుని; వదన = మోము అనెడి; చంద్రికా = చంద్రుని యొక్క; రసంబున్ = వెన్నెలను; నేత్ర = కన్నులు అనెడి; చకోరంబుల = చకోరపక్షుల; వలనన్ = వలన; త్రావుచున్ = తాగుతూ; ఆ = ఆ; యువిద = వనిత; విభ్రాంత = వివశ; అయి = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; సమయంబునన్ = సమయము నందు.

భావము:

ఇలా అడుగుతున్న రాకుమారుని ముఖంలోని వెన్నెలను తన కన్నులు అనె చకోరపక్షుల వలన తాగుతూ, ఆమె తడబడే సమయంలో.

9-615-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కంఠేకాలునిచేతం
గుంఠితుఁడగు టెట్లు మరుఁడు? కుసుమాస్త్రంబుల్
లుంఠించి గుణనినాదము
ఠంమ్మన బాల నేసె వఠవ గదురన్.

టీకా:

కంఠేకాలుని = పరమశివుని {కంఠేకాలుడు - కంఠము నల్లగానున్నవాడు, శంకరుడు}; చేతన్ = వలన; కుంఠితుడు = దహింపబడినవాడు; అగుట = ఐ ఉండుట; ఎట్లు = ఎలా అగును, కాదు; మరుడున్ = మన్మథుడు; కుసుమ = పూల; అస్త్రంబుల్ = బాణములను; లుంఠించి = సంధించి; గుణ = అల్లెతాడు; నినాదము = ధ్వని; ఠంఠమ్ము = ఠంకారము; అనన్ = చేయగా; బాలన్ = బాలికపైన; ఏసెన్ = ప్రయోగించెను; ఠవఠవ = టకటకమని; కదురన్ = పడేలాగ.

భావము:

అదిగో మన్మథుడు ఆ పిల్ల మీద అల్లెతాడు ఠంఠమ్మనేలా పూలబాణాలు సంధించి ఠవఠవ మని నాటేలా వేసాడు. కంఠంనల్లగా ఉన్న శంకరుడు మరులురేపే మన్మథుని దహించాడు అంటే ఎలా నమ్మేది.

9-616-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వలరాచవాని క్రొవ్విరికోలలవేఁడిమిఁ దాలిమిపోఁడిమి చెడి, యా వాలుఁగంటి యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఇలా; వలరాచవాని = మన్మథుని; క్రొవ్వు = బలమైన; విరి = పూల; కోలలన్ = బాణముల; వేడిమిన్ = తాపమువలన; తాలిమిన్ = ఓర్పు; పోడిమిన్ = నేర్పు; చెడి = పోయి; ఆ = ఆ; వాలుగంటి = సుందరి {వాలుగంటి - వాలుచూపులామె, స్త్రీ}; ఇట్లు = ఇలా; అనియె = పలికెను .

భావము:

ఇలా మన్మథుని బలమైన పూల బాణాల తాపం తట్టుకునే ఓర్పు నేర్పు లేక, ఆ వాలుచూపుల సుందరి శకుంతల దుష్యంతునితో ఇలా పలికింది.

9-617-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నివార్యప్రభ మున్ను మేనకయు విశ్వామిత్రభూభర్తయుం
ని; రా మేనక డించిపోయెనడవిం; ణ్వుండు నన్నింతగా
నిచెన్; సర్వము నామునీంద్రుఁ డెఱుఁగున్; ద్భాగధేయంబునన్
నినుఁగంటిం బిదపం గృతార్థ నగుచున్ నేఁడీ వనాంతంబునన్.

టీకా:

అనివార్య = అమోఘమైన; ప్రభన్ = తేజస్సుతో; మున్ను = పూర్వము; మేనకయున్ = మేనక; విశ్వామిత్ర = విశ్వామిత్రుడనెడి; భూభర్తయున్ = రాజు; కనిరి = కన్నారు; మేనక = మేనక; డించి = వదలి; పోయెన్ = వెల్లపోయినది; అడవిన్ = అడవియందు; కణ్వుండు = కణ్వుడు; నన్నున్ = నన్ను; ఇంత = ఇంతదానిని; కాన్ = అగునట్లు; మనిచెన్ = పెంచెను; సర్వమున్ = సమస్తము; ఆ = ఆ; ముని = ఋషులలో; ఇంద్రుండు = ఉత్తముడు; ఎఱుగున్ = తెలియును; మత్ = నా యొక్క; భాగదేయంబునన్ = సౌభాగ్యము వలన; నినున్ = నిన్ను; కంటిన్ = చూసితిని; పిదపన్ = తరువాత; కృతార్థన్ = ధన్యురాలను; అగుచున్ = అగుచు; నేడు = ఇవాళ; ఈ = ఈ; వన = అడవి; అంతంబునన్ = లోపల.

భావము:

“పూర్వం విశ్వామిత్ర మహారాజు అమోఘమైన తేజస్సుతో మేనక నన్ను కన్నది. ఆ మేనక అడవిలో వదలి తన లోకానికి వెళ్ళిపోయింది. కణ్వమహర్షి చూసి అన్నీ తానై నన్ను పెంచాడు. ఇవాళ ఈ అడవిలో నా అదృష్ట వశాత్తు నిన్ను చూసాను, ధన్యురాలను అయ్యాను.

9-618-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ వారము ప్రజలేమును
నీవారము పూజగొనుము నిలువుము నీవున్
నీవారును మా యింటను
నీవారాన్నంబుగొనుఁడు నేఁడు నరేంద్రా! "

టీకా:

నీ = నీకు చెందిన; వారము = వాళ్ళము; ప్రజలున్ = ప్రజలు; ఏమునున్ = మేము; ఈ = ఈ; వారమున్ = రోజు; పూజన్ = మా పూజలన; కొనుము = అందుకొనుము; నిలువుము = ఆగుము; నీవున్ = నీవు; నీ = నీయొక్క; వారునున్ = పరివారము; మా = మా యొక్క; ఇంటన్ = ఇంటిలో; నీవారి = నివ్వరియైన {నీవారము - విత్తక పండెడు దూసర్లు లోనగు తృణధాన్యము, నివ్వరి}; అన్నంబున్ = అన్నమును; కొనుడు = తీసుకొనండి; నేడు = ఇవాళ; నరేంద్రా = రాజా .

భావము:

ఓ రాజా! పౌరులు, మా ఆశ్రమవాసులం అందరం నీ వాళ్ళమే నయ్యా! ఇవాళ్టికి ఇక్కడ ఆగి మా పూజలు అందుకో. మా యింట్లో నివ్వరి అన్నంతో ఆతిథ్యాన్ని స్వీకరించు.
. – అని శకుంతల తమ కణ్వాశ్రమానికి వచ్చిన దుష్యంతునితో పలికింది. నీవార అంటు ప్రతి పాదం మొదట చమత్కారంగా వాడిన విధం పద్యానికి వన్నెతెచ్చింది. ఒకటి కంటె ఎక్కువ అక్షరాలు అర్థ భేదంతో ఒకటి కంటె ఎక్కువ మారులు ప్రయోగిస్తే అది యమకాలంకారం అంటారు. నాలుగు పాదాలలో నీవాళ్ళం, ఈరోజు, నీపరిజనులు, చక్కటిభోజనం అనే నాలుగు అర్థ భేద ప్రయోగాలతో ఇక్కడ యమకం చక్కగా పండింది."

9-619-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన, దుష్యంతుండు మెచ్చి, మచ్చెకంటి యిచ్చ యెఱింగి యిట్లనియె.

టీకా:

అని = అని; పలికినన్ = చెప్పగా; దుష్యంతుడు = దుష్యంతుడు; మెచ్చి = సంతోషించి; మచ్చెకంటి = చేపకళ్ళచిన్నదాని {మచ్చెకంటి - చేపవంటి కన్నులు కలామె, స్త్రీ}; ఇచ్చన్ = మనసు; ఎఱింగి = అర్థముచేసికొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .

భావము:

అని శకుంతల చెప్పగా దుష్యంతుడు సంతోషించి ఆ చేపకళ్ళ చిన్నదాని మనసు అర్థం చేసికొని ఇలా అన్నాడు.

9-620-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రాజతనయ వగుదు రాజీవదళనేత్ర!
మాట నిజము లోనిమాటలేదు
నకు సదృశుఁడయిన రుణునిఁ గైకొంట
రాజసుతకుఁ దగవు రాజవదన! "

టీకా:

రాజతనయ = క్షత్రియకన్యవే; అగుదు = అయ్యి ఉంటావు; రాజీవదళనేత్ర = పద్మపత్రనయన; మాట = ఆ మాట; నిజము = సత్యము; లోనిమాట = దాపరికమేమి; లేదు = లేదు; తన = తన; కున్ = కు; సదృశుడు = తగినవాడు; అయిన = ఐన; తరుణుని = యువకుని; కైకొంట = స్వీకరించుట; రాజసుత = రాకుమారి; కున్ = కి; తగవు = తగినపనే; రాజవదన = చంద్రవదన .

భావము:

“కమల దళాల వంటి కన్నులు కల ఓ చంద్రవదన! నీవు క్షత్రియకన్యవే అయి ఉంటావు. ఆ మాట సత్యమే కదా. దీనికి దాపరికం ఎందుకు. రాచకన్నె తనకు తగిన వరుణ్ణి స్వీకరించడం తప్పేం కాదు. తగినపనే.”

9-621-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియుఁ దియ్యని నెయ్యంపుఁ బలుకులవలన నయ్యువిద నియ్యకొలిపి.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకా; తియ్యని = మధురమైన; నెయ్యంపు = స్నేహపూరిత; పలుకుల = మాటల; వలనన్ = వలన; ఆ = ఆ; యువిదన్ = యువతిని; ఇయ్యకొలిపి = అంగీకరింపజేసి;

భావము:

అని ఇంకా అనేక మృదు మధుర సంభాషణలతో ఆమెను అంగీకరింపజేసి.....

9-622-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బంధురయశుఁడు జగన్నుత
సంధుఁడు దుష్యంతుఁ డుచిత మయజ్ఞుండై
గంగజగమన నప్పుడు
గాంర్వవిధిన్ వరించె హనాంతమునన్.

టీకా:

బంధుర = చక్కటి; యశుడు = కీర్తి కలవాడు; జగత్ = లోకముచే; నుత = స్తుతింపబడుట; సంధుడు = సంధిల్లజేసికొనువాడు; దుష్యంతుడు = దుష్యంతుడు; ఉచిత = తగిన; సమయజ్ఞడు = కాలజ్ఞత తెలిసినవాడు; ఐ = అయ్యి; గంధగమనన్ = శకుంతలను {గంధగమన - ఏనుగు వంటి నడక కలామె, స్త్రీ}; అప్పుడు = అప్పుడు; గాంధర్వ = గాంధర్వ; విధిన్ = విధానములో; వరించెన్ = పెండ్లాడెను; గహన = అడవి; అంతమునన్ = లో .

భావము:

జగన్నుత కీర్తిమంతుడు, తగిన కాలజ్ఞత కలవాడు అయిన దుష్యంతుడు, అప్పుడు ఆ అడవిలో గజగమనను శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నాడు.