పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి బస్తోపాఖ్యానము

 •  
 •  
 •  

9-565-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఒక్క దినంబున నాత్మజ్ఞానంబునంజేసి కాంతానిమిత్తంబున మోసపోవుట యెఱింగి యయాతి యతివిషాదంబునొంది దేవయాని కిట్లనియె.

టీకా:

ఒక్క = ఒకానొక; దినంబునన్ = నాడు; ఆత్మ = తనలోని; జ్ఞానంబునన్ = జ్ఞానము; చేసి = వలన; కాంతా = స్త్రీలోలత్వము; నిమిత్తంబునన్ = వలన; మోసపోవుట = మోహములో పడుట; ఎఱింగి = తెలిసికొని; యయాతి = యయాతి; అతి = మిక్కిలి; విషాదంబున్ = దుఃఖమును; ఒంది = పొంది; దేవయానిన్ = దేవయాని; కిన్ = కి; ఇట్లు = ఇలా; అనియెన్ = చెప్పెను;

భావము:

ఒకనాడు ఆత్మజ్ఞానంతో తెలివి తెచ్చుకుని, యయాతి స్త్రీలోలత్వంతో మోహంలో పడడం గ్రహించాడు. మిక్కిలి దుఃఖం పొంది దేవయానితో ఇలా అన్నాడు.

9-566-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"మ చారిత్రమువంటిది
విను మితిహాసంబు గలదు; వృద్ధజనములున్
మునులును మెత్తురు; నీవును
మున నంగీకరింపు మంజులవాణీ!

టీకా:

మన = మన యొక్క; చారిత్రంబున్ = చరిత్ర; వంటిది = లాంటిది; వినుము = వినుము; ఇతిహాసంబున్ = జరిగిన కథ; కలదు = ఉంది; వృద్దజనములున్ = జ్ఞానులు; మునులున్ = ఋషులు; మెత్తురున్ = మెచ్చుకొనెదరు; నీవునున్ = నీవుకూడ; మనమునన్ = మనసునందు; అంగీకరింప = గ్రహించుము; మంజులవాణీ = మథురభాషిణీ .

భావము:

"ఓ మథురభాషిణీ! ఒక ఇతిహాసం చెప్తాను, విను. ఇది మన చరిత్ర లాంటిదే. విజ్ఞులు, ఋషులు మెచ్చుకుంటారు. నీవు కూడ శ్రద్దగా గ్రహించుము.

9-567-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అది యెట్టిదనిన.

టీకా:

అది = అది; ఎట్టిది = ఎలాంటిది; అనినన్ = అనగా .

భావము:

ఆ ఇతిహాసం ఎలాంటిది అంటే.

9-568-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

జ మొకం డడవిలో రుగుచుం దాఁ గర్మ-
లమున నూతిలోలికి జాఱి
లోఁగెడి ఛాగి నాలోకించి కామి యై-
కొమ్మున దరిఁ గొంత గూలఁ ద్రోచి
వెడలింపనచ్ఛాగి విభునిఁగాఁ గోరిన-
గుఁగాక యని తాను దియుఁ దిరుగ
నెన్నియేనిని దన్ను నెంత కామించిన-
న్నిటికిని భర్త యై తనర్చి

9-568.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వాని నే ప్రొద్దు రతులకు శలఁ జేసి
సొరిదిఁ గ్రీడించి క్రీడించి చొక్కిచొక్కి
కాముఁ డనియెడి దుస్సహగ్రహముకతన
జిత్త మేమఱి మత్తిల్లి చెల్లఁ జిక్కి.

టీకా:

అజము = మేకపోతు {అజ - మేకపోతు, అజము - కొన్ని పనసలు గల వేదభాగము, అనువాకము}; ఒకండు = ఒకటి; అడవి = అడవి; లోనన్ = లోపల; అరుగుచున్ = తిరుగుతు; తాన్ = అది; కర్మ = చేసుకొన్న కర్మల; ఫలంబునన్ = ఫలితముగా; నూతి = నుయ్యి; లోపలి = లోపలి; కిన్ = కి; జాఱి = పడిపోయి; లోగెడి = అణగిపోతున్న; ఛాగిన్ = ఆడుమేకను; ఆలోకించి = చూసి; కామి = కామించినది; ఐ = అయ్యి; కొమ్మునన్ = కొమ్ముతో; దరిన్ = గట్టును; కొంతన్ = కొంతవరకు; కూలద్రోచి = కూలగొట్టి; వెడలింపన్ = బయటకుతేగా; ఆ = ఆ; ఛాగి = ఆడుమేక; విభునిన్ = భర్త; కాన్ = కమ్మని; కోరినన్ = అడుగగా; అగుగాక = అలాగే; అని = అని; తానున్ = తను; అదియున్ = అది; తిరుగన్ = జతకట్టితిరుగుతుడగ; ఎన్నియేనినిన్ = ఎన్నివిధములైన; తన్నున్ = తనను; ఎంత = ఎంత; కామించినన్ = ప్రేమించిన; అన్నిటి = అన్నిటి; కినిన్ = కి; భర్త = భర్త; ఐ = అయ్యి; తనర్చి = తృప్తిపరచి.
వానిన్ = దానిని; ఏ = ఎల్ల; ప్రొద్దు = వేళలందు; రతుల్ = సురత; వశలన్ = పరవశలును; చేసి = చేసి; సొరిదిని = క్రమముగ; క్రీడించిక్రీడించి = బాగా విహరించి; చొక్కిచొక్కి = మిక్కిలి అలసిపోయి; కాముడు = మన్మథుడు; అనియెడు = అనెడి; దుస్సహ = సహింపలేని; గ్రహము = పెనుభూతము; కతనన్ = వలన; చిత్తమున్ = మనసు; ఏమఱి = ఏమరుపాటుచెంది; మత్తిల్లి = మదించి; చెల్లన్ = పూర్తిగా; చిక్కి = చిక్కుకుపోయి.

భావము:

అడవిలో ఒక మేకపోతు తిరుగుతుండేది. కర్మవశాత్తూ ఒక బావిలో పడి దుఖించే ఒక పెంటిమేకను చూసింది. దానిని కామించి, తన కొమ్ముతో గట్టును కొంత కూల్చి బయటకు తెచ్చింది. ఆ ఆడుమేక భర్త కమ్మని అడిగింది. మగమేక అలాగే అంది. అవి రెండూ అలా జతకట్టి తిరుగుసాగాయి. తనను కామించి వచ్చిన పెంటిమేకలు అన్నింటితోనూ జత కడుతూ వాటిని కూడ తృప్తిపరచసాగింది. ఎప్పుడూ వాటిని అన్నింటిని సురత పరవశలును చేస్తూ, విహరిస్తూ, మిక్కిలి అలసిపోయింది. మన్మథుడు అనెడి పెనుభూతము వలన చిత్తం ఏమరుపాటు చెంది, మత్తిల్లింది.

9-569-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వె విలుతుకేళిఁ జిగురా
డిదపు వ్రేటునకు లోఁగి తి మోహితుఁడై
విడువక సతులం దగిలెడు
డునకు నెక్కడివి బుద్ధిచాతుర్యంబుల్?

టీకా:

వెడవిలుతు = మన్మథుని వెడవిలుతుడు - {వెడ (పూల) విలతుడు (ధనుస్సు కలవాడు), మన్మథుడు, వ్యు. (వెడ + విల్లు కలవాడు) బ.వ్రీ}; కేళీ = విలాసపు; చిగురాకు = చిగురాకు; అడిదపు = కత్తి యొక్క; వ్రేటున్ = దెబ్బ; కున్ = కు; లోగి = లొంగిపోయి; అతి = మిక్కిలి; మోహితుడు = మోహములో పడినవాడు; ఐ = అయ్యి; విడువక = వదలిపెట్టకుండ; సతులన్ = భార్యలను; తగిలెడి = కవసెడి; జడున్ = తెలివితక్కువవాని; కున్ = కి; ఎక్కడివి = ఎక్కడనుండి వచ్చును; బుద్ధి = మంచిబుద్ధిమంతుల; చాతుర్యంబుల్ = నేర్పరితనములు.

భావము:

మన్మథుని చిగురాకు కత్తి దెబ్బకు మిక్కిలి మోహంలో పడి, ఎడతెగకుండా స్త్రీలను కవసె మూర్ఖుడికి బుద్ధిచాతుర్యాలు ఎక్కడ ఉంటాయి.

9-570-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత నచ్ఛాగంబు దన పిదపం దగిలిన ఛాగినీనివహంబు లోపలం జూడనొప్పెడి ఛాగి యందుఁ దగిలి క్రీడింపం గని, నూతిలోపలంబడి వెలువడిన ఛాగి, తన పతివలని నెయ్యంబు లేకుండుటకు విన్ననై తన మనంబున.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; ఛాగంబున్ = పెంటి మేక; తన = తన; పిదపన్ = వెనుక; తగిలిన = వచ్చిన; ఛాగినీ = ఆడుమేకల; నివహంబున్ = సమూహము; లోపలన్ = అందు; చూడన్ = చూచుటకు; ఒప్పడి = చక్కటి; ఛాగిన్ = ఆడుమేక; అందున్ = తో; తగిలి = కూడి; క్రీడింపన్ = విహరించగా; కని = కనుగొని; నూతి = నుయ్యి; లోపలన్ = అందు; పడి = జారిపడి; వెలువడిన = బయటపడ్డ; ఛాగి = ఆడుమేక; తన = తన యొక్క; పతి = భర్త; వలని = నుండి; నెయ్యంబున్ = ప్రేమ; లేకుండుట = లేకపోవుట; కున్ = కు; విన్నన్ = చిన్నబోయినది; ఐ = అయ్యి; తన = తన యొక్క; మనంబునన్ = మనసునందు .

భావము:

ఇంతలో నూతిలోంచి బయటపడ్డ పెంటి మేక తనతో వచ్చిన పెంటిమేకలలో ఒక చక్కదానితో పోతుమేక విహరించడం చూసి పెంటిమేక చిన్నబోయి, తన మనసులో ఇలా అనుకుంది.

9-571-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"పలికినఁ బలుకులు పలుకఁడు
లఁచున్ నవకాంతఁ జూచి డు సంచలుఁడై
నిలిచిన చోటన్ నిలువఁడు
నిలువెల్లను గల్ల కామి నిజమరి గలఁడే."

టీకా:

పలికినన్ = అడిగితే; పలుకులు = సమాధానము; పలుకడు = చెప్పడు; కలచున్ = ఎగబడును; నవ = కొత్త; కాంతన్ = యువతిని; చూచి = చూసి; కడున్ = మిక్కిలి; సంచలుడు = చంచలచిత్తుడు; ఐ = అయ్యి; నిలిచినన్ = నిలిచిన; చోటన్ = చోట; నిలువడు = నిలబడడు; నిలువు = మనిషి పొడుగు; ఎల్లన్ = అంతా; కల్ల = మోసమే; కామి = కాముకులలో; నిజమరి = సత్యవంతుడు; కలడే = ఉన్నాడా.

భావము:

“అడిగితే సమాధానము ఉలకడు పలకడు. కొత్తదాన్ని చూస్తే ఎగబడతాడు. చంచలచిత్తుడు, నిలకడ లేదు, నిలువునా మోసం కాముకత్వం. ఇలాంటి సత్యవంతుడు ఎక్కడైనా ఉంటాడా?”

9-572-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని పలికి విడిచి చనిన నయ్యజవల్లభుండు సురతపరతంత్రుండై, మిసిమిసి యను శబ్దంబుచేయుచుఁ, దచ్ఛాగి వెంటంజని, యొడంబఱుపంజాలకుండె; నంత దానికిఁ గర్త యైన బ్రాహ్మణుండు రోషంబున రతిసమర్థంబు గాకుండ నల్లాడుచుండ ఛాగవృషణంబులు ద్రెంచివేసిన, నచ్ఛాగంబు గ్రిందఁబడి వేడుకొనినఁ, బ్రయోజనంబు పొడగని యోగవిదుండు గావున బ్రాహ్మణోత్తముండు గ్రమ్మఱ నయ్యజవృషణంబులు సంధించిన.

టీకా:

అని = అని; పలికి = చెప్పి; విడిచి = వదలిపెట్టి; చనినన్ = వెళ్ళిపోగా; ఆ = ఆ; అజవల్లభుండు = మేకపోతు; సురత = రతిసుఖమునకై; పరతంత్రుడు = వివశుడు; ఐ = అయ్యి; మిసిమిసి = మే మే; అను = అనెడి; శబ్దంబున్ = అరుపులు; చేయుచున్ = చేస్తూ; తత్ = ఆ; ఛాగి = పెంటిమేక; వెంటన్ = కూడ; చని = వెళ్ళి; ఒడంబఱపన్ = ఒప్పించుటకు; చాలకుండెన్ = సమర్థుడుకాకుండెను; అంతన్ = అంతట; దాని = ఆపెంటి; కిన్ = కి; కర్త = ఉనికికారణమైనవాడు; ఐన = అయిన; బ్రాహ్మణుండు = బ్రాహ్మణుడు; రోషంబునన్ = కోపముతో; రతి = సురతక్రియకు; సమర్థంబుకాకుండన్ = పనికిరాకుండ; అల్లాడుచుండన్ = అల్లాడిపోవునట్లు; ఛాగ = పోతుమేక; వృషణంబులున్ = అండకోశమును; త్రెంచివేసినన్ = కోసేయగా; ఆ = ఆ; ఛాగంబున్ = మేకపోతు; క్రిందపడి = నేలపైపడి; వేడుకొనినన్ = ప్రార్థించగా; ప్రయోజనంబు = పర్యవసానములు; పొడగని = ఊహించి; యోగ = యోగము; విదుండు = తెలిసినవాడు; కావునన్ = కనుక; బ్రాహ్మణ = విప్రులలో; ఉత్తముడు = శ్రేష్ఠుడు; క్రమ్మఱన్ = తిరిగి; ఆ = ఆ; అజ = మేకపోతు; వృషణంబులున్ = అండకోశమును; సంధించిన = తగిలించెను.

భావము:

అలా అనుకుని వదలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ మేకపోతు రతివివశత్వంతో, మే మే అని అరుస్తూ, ఆ పెంటిమేక వెంట పరుగెత్తింది. ఎంత ప్రయత్నించినా పెంటిని ఒప్పించ లేకపోయింది. అంతట ఆపెంటి యజమాని అయిన బ్రాహ్మణుడు కోపంతో రతిక్రియకు పనికిరాకుండ అల్లాడేలా పోతుమేక వృషణాలు కోసేసాడు. ఆ మేకపోతు క్రిందపడి ప్రార్థించగా పర్యవసానం గ్రహించి యోగము తెలిసిన ఆ విప్రశ్రేష్ఠుడు ఆ మేకపోతుకు వృషణాలు తిరిగి తగిలించాడు.

9-573-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వృణములు మరలఁ గలిగిన
సుముండై ఛాగవిభుఁడు సుందరితోడన్
వియసుఖంబులఁ బొందుచుఁ
దృ తుదిఁ గనఁ డయ్యెఁ బెక్కు దివసము లయ్యున్."

టీకా:

వృషణములు = అండకోశము; మరల = తిరిగి; కలిగినన్ = పొందగా; సుషముండు = మనోఙ్ఞమైన వాడు; ఐ = అయ్యి; ఛాగవిభుడు = పోతుమేక; సుందరి = పెంటి; తోడన్ = తోటి; విషయసుఖంబులన్ = లౌకిక సౌఖ్యములను; పొందుచున్ = అనుభవించుచు; తృష = ఇచ్చ యొక్క; తుదిన్ = అంతుదరి; కనడు = కానలేనివాడు; అయ్యెన్ = అయ్యెను; పెక్కు = చాలా; దివసములు = రోజులు; అయ్యున్ = అయినప్పటికి.

భావము:

వృషణాలు తిరిగి పొందిన పోతుమేక చేవ పొంది, పెంటితో విషయసుఖాలలో మునిగి తేలుతున్నా అంతుదరి కానని కామంతో సతమతం కాసాగింది.”

9-574-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని యివ్విధంబున యయాతి దేవయానికి నిజవృత్తాంతంబు గథారూపంబున నెఱింగించి యిట్లనియె.

టీకా:

అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; యయాతి = యయాతి; దేవయాని = దేవయాని; కిన్ = కి; నిజ = తమ; వృత్తాంతంబున్ = సంగతిని; కథా = కథ; రూపంబునన్ = రూపమునందు; ఎఱింగించి = తెలిపి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .

భావము:

అని అలా తమ సంగతినే కథలా యయాతి దేవయానికి చెప్పాడు.

9-575-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"లా! నీ నిబిడాతిదుర్జయ సలజ్జాపాంగభల్లంబులం
బ్రలంబైన మనంబు భగ్నముగ నా ప్రావీణ్యముం గోలుపో
యి లిష్ఠుండగు కాముబారిఁ బడి నే నెట్లోర్తునే బందిక
త్తె డిం బాపపుఁ దృష్ణ యిప్పు డకటా! దీర్ఘాకృతిన్ రొప్పెడిన్.

టీకా:

అబలా = యువతి {అబల - బలము లేనిది, స్త్రీ}; నీ = నీ యొక్క; నిబిడ = దట్టమైన; అతి = మిక్కిలి; దుర్జయ = గెలువరాని; సలజ్జా = సిగ్గుతోకూడిన; అపాంగ = కడకంటిచూపు లనెడి; భల్లంబులన్ = శూలములవలన; ప్రబలంబు = మిక్కిలి బలమైనది; ఐన = అగు; మనంబున్ = మనస్సు; భగ్నము = భగ్నము; కన్ = కాగా; నా = న యొక్క; ప్రావీణ్యమున్ = తెలివిని; కోలుపోయి = నష్టపోయి; బలిష్ఠుండు = శక్తిశాలి; అగు = ఐన; కామున్ = మన్మథుని; బారిబడి = వశుడనై; నేన్ = నేను; ఎట్లు = ఎలా; ఓర్తున్ = ఓర్చుకొనగలను; బందికత్తెన్ = బంధించే దానిలో; పడిన్ = పడిపోయి; పాపపు = పాపముచేయాలనే; తృష్ణ = దాహము, వ్యసనము; ఇప్పుడు = ఇప్పుడు; అకటా = అయ్యో; దీర్ఘాకృతిన్ = అధికముగా; రొప్పెడిన్ = వగర్చు చున్నది.

భావము:

“యువతి! నీ కడకంటి చూపులనె శూలాలు, లజ్జాకర్షణలు మిక్కిలి గెలువరానివి. వాటి బలాధిక్యానికి నా మనస్సు భగ్నం అయిపోయింది. నేను తెలివి కోల్పాయాను. శక్తిశాలి మన్మథుడికి వశుడనై పోయాను. పాపిష్టి తృష్ణ బంధాలలో పడిపోయాను. ఈ వ్యసనం వెంట తఱుముతుంటే అక్కటా! ఇప్పుడు ఓర్చుకోలేక రొప్పుతున్నాను.

9-576-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లదు ప్రాణము లదలినఁ
లదు సర్వాంగకములుఁ దలుచు నుండన్
లదు బిగువులు వదలినఁ
దుదిలే దీ తృష్ణ దీనిఁ ద్రుంపఁగవలయున్.

టీకా:

అదలదు = బెదరదు; ప్రాణముల్ = ప్రాణములు; అదలినన్ = తొలగుచున్నను; కదలదు = చలించదు; సర్వ = అన్ని; అంగకములున్ = అవయవములు; కదలుచున్ = వణుకుతు; ఉండన్ = ఉన్నను; వదలదు = వీడిపోదు; బిగువులు = పటుత్వములు; వదలినన్ = సడలినను; తుదిన్ = అంతము; లేదు = లేదు; ఈ = ఈ; తృష్ణన్ = దాహమునకు; దీనిన్ = దీనిని; త్రుంపవలయున్ = తుంచేయవలెను.

భావము:

ఈ కామతృష్ణ అదరదు, బెదరదు. ప్రాణాలు పోతున్నా చలించదు. అవయవాలు వణుకుతున్నా వీడిపోదు. పటుత్వాలు సర్వం సడలినా వదలదు. అంతులేని దీనిని తుంచి వేయాలి.

9-577-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వెయ్యేం డ్లయ్యెను నీతోఁ
గ్రయ్యంబడి యున్నవాఁడఁ గామసుఖములం
గ్రుయ్య దొక యించుకైన
న్డయ్యదు కొనలిడియెఁ దృష్ణ వపద్మముఖీ!

టీకా:

వెయ్యి = వెయ్యి (1000); ఏండ్లు = సంవత్సరములు; అయ్యెన్ = గడచిపోయినవి; నీ = నీ; తోన్ = తోటి; క్రయ్యంబడి = జతకట్టి, కూడి; ఉన్నవాడన్ = ఉన్నాను; కామ = గ్రామ్య; సుఖములన్ = సుఖముల; క్రుయ్యదు = ఆసక్తి తగ్గటం లేదు; ఒకయించుకైనన్ = ఏమాత్రము; డయ్యదు = బడలదు; కొనలిడియెన్ = కొనసాగుతున్నది; తృష్ణ = ఆశాదాహము; నవపద్మముఖీ = సుందరీ {నవపద్మముఖి - నవ (తాజా) పద్మమువంటి ముఖముగలామె, అందగత్తె}.

భావము:

చూడు సుందరీ! నీతోటి జతకట్టి వెయ్యి ఏళ్ళు గడచిపోయాయి. అయినా ఇంకా ఈ గ్రామ్య సుఖాలపై లాలస ఏమాత్రం తగ్గటం లేదు. బడలిక లేదు. తృష్ణ ఇంకా కొనసాగుతోంది.

9-578-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ముదిసెను దంతావళియును
ముదిసెను గేశములు దనువు ముదిసెం దనకున్
ముదియ నివి రెండు చిక్కెను
బ్రదికెడి తీపియును విషయక్ష స్పృహయున్.

టీకా:

ముదిసెను = రాలిపోతున్నవి; దంతాళియును = పళ్ళు; ముదిసెను = వెలిశిపోయాయి; కేశములున్ = వెంట్రుకలు; తనువున్ = శరీరము; ముదిసెన్ = వడలిపోయినది; తన = తన; కున్ = కు; ముదియనివి = వడలనివి; రెండున్ = రెండు (2); చిక్కెను = మిగిలిపోయినవి; బ్రతికెడి = ప్రాణములపై; తీపియునున్ = తీపి; విషయ = గ్రామ్యసుఖముల; పక్ష = పట్ల; స్పృహయున్ = కోరిక.

భావము:

పళ్ళు రాలిపోతున్నాయి. వెంట్రుకలు వెలిసిపోయాయి. శరీరము వడలిపోయింది. కాని వడలకుండా ప్రాణాలపై తీపి గ్రామ్యసుఖాలపై కోరిక అనే రెండు మాత్రమే మిగిలిపోయాయి.

9-579-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లే దాశాలతకుం
డఁ జూడఁగఁ గానరాదు డఁ గనిరేనిన్
డు ముదమున సంసారము
డఁ గందురు తత్త్వవిదులు మలదళాక్షీ!

టీకా:

కడ = అంతు; లేదు = లేదు; ఆశా = తృష్ణ అనెడి; లత = తీవె; కున్ = కు; కడన్ = అంతు; జూడగన్ = చూద్దామనినను; కానగరాదు = కన్పించదు; కడన్ = తుది; కనిరేనిన్ = చూడగలిగినచో; కడు = మిక్కిలి; ముదమునన్ = సంతోషముతో; సంసారమున్ = సంసారబంధములను; కడన్ = నశించుట; కందురు = పొందెదరు; తత్త్వ = తత్వము; విదులు = తెలిసినవారు; కమలదళాక్షీ = పద్మనయన.

భావము:

పద్మనయన! ఈ తృష్ణ అనె తీవెకు చూద్దామన్నా అంతు తుది కనబడదు. తత్వం తెలిసిన మహానుభావులు దీని అంతు చూసి, సంతోషముతో సంసారబంధాలను దాటతారు.

9-580-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మంన హాటక పశు వే
దండాశ్వ వధూ దుకూల ధాన్యాదులు పె
క్కుండియు నాశాపాశము
ఖండింపఁగ లేవు మఱియుఁ డమయ చుమ్మీ.

టీకా:

మండన = నగలు; హాటక = బంగారము; పశు = పశుసంపద; వేదండ = ఏనుగులు; అశ్వ = గుఱ్ఱములు; వధూ = కన్యలు; దుకూల = మేలైన బట్టలు; ధాన్య = పంటసమృద్ధి; ఆదులు = మున్నగునవి; పెక్కు = ఎన్నో; ఉండియున్ = ఉన్నప్పటికి; ఆశా = తృష్ణ అనెడి; పాశమున్ = బంధమును; ఖండింపగన్ = తుంచివేయ; లేవు = సమర్థములు కావు; మఱియున్ = ఇంకను; కడమయ = కొరతగానే ఉండును; చుమ్మీ = సుమా.

భావము:

నగలు, బంగారం, పశుసంపద, ఏనుగులు, గుఱ్ఱాలు, కన్యలు, మేలైన బట్టలు, ఆస్తులు సర్వం ఎన్ని ఉన్నా ఆశాపాశం మాత్రం తెగదు. ఇంకా ఏదో కొరత ఉన్నట్లే అనిపిస్తుంది సుమా.

9-581-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కామోపభోగసుఖములు
వేమాఱును బురుషుఁ డనుభవించుచు నున్నం
గామంబు శాంతిఁ బొందదు
ధూధ్వజుఁ డాజ్యవృష్టిఁ ద్రుంగుడు పడునే?

టీకా:

కామోపభోగ = విషయభోగపు; సుఖములున్ = సుఖములను; వేమాఱు = అనేకసార్లు; పురుషుడు = మానవుడు; అనుభవించుచున్నన్ = అనుభవించుతున్నా; కామంబు = తృష్ణ, కోరిక; శాంతిబొందదు = చల్లారదు; ధూమధ్వజుడు = అగ్నిదేవుడు; ఆజ్య = నేతి; వృష్టిన్ = ధారలతో; త్రుంగుడు = అణగారుట; పడునే = చెందునే.

భావము:

నెయ్యి పోసే కొద్దీ అగ్ని భగ్గుమని మండుతూ ఉంటుంది తప్ప ఎలా అణగారదో? అలాగే విషయభోగాలను ఎంత అనుభవించుతున్నా మానవుడి కామతృష్ణ తీరదు.

9-582-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

క్క తల్లి చెల్లె లాత్మజ యెక్కిన
పాను పెక్కఁ జనదు ద్మనయన!
రమయోగికైన లిమిని నింద్రియ
గ్రామ మధికపీడఁ లుగఁ జేయు.

టీకా:

అక్క = పెద్దసోదరి; తల్లి = అమ్మ; చెల్లెలు = చిన్నసోదరి; ఆత్మజ = కూతరు; ఎక్కిన = ఎక్కినట్టి; పానుపున్ = మంచముపైకి; ఎక్కజనదు = ఎక్కరాదు; పద్మనయన = పద్మాక్షీ; పరమ = మహా; యోగి = ఋషి; కిన్ = కి; ఐనన్ = అయినప్పటికి; బలిమినిన్ = బలవంతముగా; ఇంద్రియ = ఇంద్రియముల; గ్రామము = సమూహము; అధిక = మిక్కిలి; పీడన్ = చీకాకులు; కలుగజేయున్ = కలుగచేస్తాయి.

భావము:

ఓ పద్మా ల్లాంటి కన్ను లున్న దేవయాని! ఎంతటి మహా యోగీశ్వరుల కయినా సరే ఇంద్రియాలు బలవంత మై కీడు చేస్తాయి. అందుచేత కూతుళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లి యెక్కిన మంచం ఎక్క కూడదు.

9-583-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వెంలివిత్తయి తిరుగుచుఁ
గంగారై చెడక ముక్తిఁ గాంక్షించు నతం
డంనలతోడ విడువని
సండములు వదలవలయు లజాతముఖీ!

టీకా:

వెంగలివిత్తు = మూఢుడు; అయి = ఐ; తిరుగుచున్ = సంచరిస్తూ; కంగారు = కలతపడినవాడు; ఐ = అయ్యి; చెడకన్ = చెడిపోకుండ; ముక్తిన్ = మోక్షమును; కాంక్షించున్ = కోరుతు; అతండు = మానవుడు; అంగన = స్త్రీల; తోడన్ = తోటి; విడువని = వదలరాని; సంగడములున్ = సాంగత్యమును; వదలవలయున్ = వదలివేయవలెను; జలజాతముఖీ = పద్మనయన.

భావము:

ఓ పద్మనయనా! మోక్షగామి మూఢుడిలా సంచరిస్తూ, కలతపడి చెడిపోకుండ ముందే స్త్రీలతోటి సాంగత్యం వదిలేయాలి.

9-584-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అదిగావున నేఁడు మొదలు తృష్ణాఖండనంబు చేసి, నిర్విషయుండనయి, యహంకారంబు విడిచి, మృగంబులం గలసి, వనంబున సంచరించెద; పరబ్రహ్మంబునందుఁ జిత్తంబుజేర్చెద; బ్రహ్మనిష్ఠ మనుష్యులకు నాశానివారిణి యగుటం జేసి యే నందుఁ దత్పరుండనై యాహారనిద్రాదియోగంబులం బరిహరించెద; నాత్మవిదుండై సంసార నాశంబులఁ దలంచినవాఁడె విద్వాంసుఁ” డని పలికి, పూరుని యౌవనం బతని కిచ్చి ముదిమి దాను గైకొని విగతలోభుండై, నిజ భుజ శక్తిపాలితం బగు భూమండలంబు విభాగించి, ద్రుహ్యునకుఁ బూర్వభాగంబును, యదువునకు దక్షిణభాగంబును, దుర్వసునకుఁ బశ్చిమదిగ్భాగంబును, ననువునకు నుత్తరదిగ్భాగంబును సంరక్షింపుండని యిచ్చి వారల సమక్షంబున.

టీకా:

అదికావునన్ = అందువల్ల; నేడు = ఇవాళ; మొదలున్ = నుండి; తృష్ణా = తృష్ణ, కోరిక; ఖండనంబున్ = నిర్మూలించుట; చేసి = చేసి; నిర్విషయండను = విషయాసక్తి లేనివాడను; ఐ = అయ్యి; అహంకారంబున్ = అహంకారము; విడిచి = వదలిపెట్టి; మృగంబులన్ = జంతువులతో; కలసి = కలిసిపోయి; వనంబునన్ = అడవిలో; సంచరించెదన్ = తిరిగెదను; పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మ; అందున్ = అందు; చిత్తంబున్ = చిత్తమును; చేర్చెదన్ = కలిపెదను; బ్రహ్మనిష్ఠ = బ్రహ్మనిష్ఠ; మనుష్యుల్ = మానవుల; కున్ = కు; ఆశా = తృష్ణను; నివారిణి = తొలగించెడిది; అగుటన్ = అగుట; చేసి = వలన; ఏన్ = నేను; అందున్ = దానిలో; తత్పరుండను = లగ్నమైనవాడను; ఐ = అయ్యి; ఆహార = ఆహారము; నిద్ర = నిద్ర; ఆది = మున్నగువని; యోగంబులన్ = కలుగుటను; పరిహరించెదను = వదలివేసెదను; ఆత్మ = పరబ్రహ్మ; విదుండు = జ్ఞానము కలవాడు; ఐ = అయ్యి; సంసార = సంసారబంధములు; నాశంబున్ = తొలగించుటను; తలంచినవాడె = చేయువాడు మాత్రమే; విద్వాంసుడు = జ్ఞాని; అని = అని; పలికి = చెప్పి; పూరుని = పూరుని యొక్క; యౌవనంబున్ = యౌవనమును; అతని = అతని; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చేసి; ముదిమిన్ = ముసలితనమును; తాను = అతను; కైకొని = తీసుకొని; విగత = విడిచిన; లోభుండు = లోభము కలవాడు; ఐ = అయ్యి; నిజ = తన; భుజపాలితంబు = పరిపాలనలో నున్నది; అగు = ఐన; భూమండలంబున్ = భూచక్రమును; విభాగించి = విభజించి; ద్రుహ్యున్ = ద్రుహ్యున; కున్ = కు; తూర్పు = తూర్పువైపు; భాగంబునున్ = భాగమును; యదువున్ = యదువున; కున్ = కు; దక్షిణ = దక్షిణవైపు; భాగంబునున్ = భాగమును; తుర్వసున్ = తుర్వయున; కున్ = కు; పశ్ఛిమ = పడమర; దిక్ = వైపు; భాగంబునున్ = భాగమును; అనువున్ = అనువున; కున్ = కు; ఉత్తర = ఉత్తరపు; దిక్ = వైపు; భాగంబునున్ = భాగమును; సంరక్షింపుండు = పాలించండి; అని = అని; ఇచ్చి = ఇచ్చి; వారల = వారి; సమక్షంబునన్ = ఎదురుగ.

భావము:

అందుచేత, ఇవాళ్టి నుండి తృష్ణని నిర్మూలించు కుంటాను. విషయాసక్తి, అహంకారం వదలేస్తాను. జంతువులతో కలిసి అడవిలో తిరిగుతాను. పరబ్రహ్మ అందు చిత్తాన్ని చేరుస్తాను. బ్రహ్మనిష్ఠ మానవులకు ఆశను అణిచేది కనుక, నేను అందులో నిమగ్నం అవుతాను. నిద్రాహారాలు మానుకుంటాను. ఆత్మజ్ఞాని అయ్యి సంసారబంధాల నుండి బయటపడ్డవాడే విజ్ఞాని.” అని చెప్పి పూరుని యౌవనాన్ని అతనికి ఇచ్చేసి ముసలితనాన్ని తీసుకొన్నాడు. లోభ విడిచాడు. రాజ్యాన్ని విభజించి ద్రుహ్యునకు తూర్పు భాగం, యదువునకు దక్షిణ భాగం, తుర్వసునకు పడమర భాగం, అనువుకు ఉత్తర భాగం పాలించుకోమని ఇచ్చేసాడు. వారి సమక్షలో..,,

9-585-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నాలుగుచెఱగుల నేలయుఁ
బాలింపుం డనుచు నగ్రవులను బంచెన్
భూలోక మేలు మనుచును
బాలార్కోదారుఁ బూరుఁ ట్టము గట్టెన్.

టీకా:

నాలుగు = నాలుగు (4); చెరుగుల = పక్కల; నేలయున్ = భూమిని; పాలింపుడు = పాలించండి; అనుచున్ = అని; అగ్రభవులన్ = పెద్దవారిని; పంచెన్ = నియమించెను; భూలోకమున్ = భూలోకమును; ఏలుము = పరిపాలించుము; అనుచున్ = అనుచు; బాల = ఉదయ; అర్కు = భానుని వంటి; ఉదారున్ = ప్రకాశించువానిని; పూరున్ = పూరునికి; పట్టముగట్టెన్ = పట్టాభిషిక్తునిచేసెను.

భావము:

నాలుగు దిక్కల భూమిని పెద్దకొడుకులను పాలించండి అని నియమించాడు. భూలోకం అంతటికి బాలభానుని వంటి ప్రకాశం కల పూరుడిని పట్టాభిషిక్తునిగా చేసి, పరిపాలించుకో అన్నాడు.

9-586-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు పూరునికి రాజ్యంబిచ్చి పెక్కువర్షంబులందు ననుభూతంబు లయిన యింద్రియసుఖంబులు వర్జించి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పూరుని = పూరుని; కిన్ = కి; రాజ్యంబున్ = రాజ్యమును; ఇచ్చి = అప్పజెప్పి; పెక్కు = అనేక; వర్షంబుల్ = సంవత్సరముల; అందున్ = నుండి; అనుభూతంబులు = అనుభవిస్తున్నవి; అయిన = ఐన; ఇంద్రియ = ఇంద్రియ; సుఖంబులున్ = సుఖములను; వర్జించి = విడిచిపెట్టి .

భావము:

ఈ మాదిరిగా పూరునికి రాజ్యం అప్పజెప్పి, అనేక ఏళ్ళ నుండి అనుభవిస్తున్న ఇంద్రియ సుఖాలను విడిచిపెట్టాడు.

9-587-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మిక్కలి సుజ్ఞానంబునఁ
క్కగఁ దెగనడచి వైరిడ్వర్గంబున్
ఱెక్కలు వచ్చిన విహగము
గ్రక్కున నీడంబు విడుచు రణి నుదితుఁడై.

టీకా:

మిక్కిలి = అధికమైన; సుజ్ఞానంబునన్ = గొప్పజ్ఞానముతో; చక్కగన్ = ఒప్పుగా; తెగనడచి = అణచివేసి; వైరిషడ్వర్గంబున్ = అరిషడ్వర్గమును {అరిషడ్వర్గము - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములనెడి ఆరుగురు శత్రు కూటములు}; ఱెక్కలు = రెక్కలు; వచ్చిన = వచ్చినట్టి; విహగము = పక్షి; గ్రక్కున్ = శీఘ్రముగ; నీడంబున్ = గూడు; విడుచు = వదలివేయు; కరణిన్ = విధముగ; ఉదితుడు = జ్ఞానియై; ఐ = అయ్యి.

భావము:

రెక్కలు వచ్చిన పక్షి శీఘ్రముగ గూడు వదలివేయునట్లు, జ్ఞాని అయి అతిశయించిన గొప్పజ్ఞానంతో అరిషడ్వర్గాలను చక్కగా అణచివేసాడు.

9-588-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కారుణికోత్తముఁడగు హరి
కారుణ్యముకతన నతఁడు నుఁడై గెలిచెం
గ్రూములగు విషయంబుల
నూక గెలువంగ శక్తుఁ డొక్కఁడు గలఁడే?

టీకా:

కారుణికోత్తముడు = కరుణామయుడు; అగు = ఐన; హరి = విష్ణువు; కారుణ్యము = దయ; కతనన్ = వలన; అతడున్ = అతడు; ఘనుడు = గొప్పవాడు; ఐ = అయ్యి; గెలిచెన్ = జయించెను; క్రూరములు = కఠోరమైనవి; అగు = ఐన; విషయంబులన్ = విషయవాంఛలను; ఊరకన్ = ఉత్తినే; గెలువంగన్ = జయించుటకు; శక్తుండు = సమర్థుడు; ఒక్కడు = ఏ ఒక్కడైనను; కలడే = ఉన్నాడా, లేడు.

భావము:

కరుణామయుడు ఐన విష్ణువు దయవలన అతడు కఠోరమైనవి ఐన విషయవాంఛలను సుళువుగా జయించాడు. అలా జయించ గల సమర్థుడు లోకంలో ఏ ఒక్కడైనను ఉన్నాడా?

9-589-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు నిర్మూలితసకలసంగుండై సత్త్వరజస్తమోగుణంబుల దిగనాడి నిర్మలంబయి, పరమంబయిన వాసుదేవాభిధానబ్రహ్మంబునందు యయాతిభూపాలుండు స్వతస్సిద్ధయయిన భాగవతగతిం జెందెను; అంత.

టీకా:

మఱియున్ = ఇంకను; నిర్మూలిత = తెంచుకొన్న; సకల = సమస్తమైన; సంగుండు = బంధములు కలవాడు; ఐ = అయ్యి; సత్త్వ = సత్వగుణము; రజస్ = రజోగుణము; తమోగుణంబులన్ = తమోగుణములను; దిగనాడి = అతిక్రమించి; నిర్మలంబు = స్వచ్ఛమైనది; అయి = ఐ; పరమంబు = ఉత్తమగతి; అయిన = ఐనట్టి; వాసుదేవ = వాసుదేవుడు అనెడి; అభిదాన = పేరు కలిగిన; బ్రహ్మంబున్ = పరబ్రహ్మము; అందున్ = లో; యయాతి = యయాతి అనెడి; భూపాలుండు = రాజు; స్వతసిద్ద = స్వయంభువు; అయిన = ఐనట్టి; భాగవత = భాగవతులు పొందెడి; గతిన్ = ఉత్తమగతిని; చెందెను = పొందెను; అంత = అంతట.

భావము:

ఇలా సంసార బంధాలు అన్నీ తెంచుకొని, త్రిగుణాలను అతిక్రమించి ఆ యయాతి భాగవతులు పొందెడి ఉత్తమగతిని పొంది, పరిశుద్ధము, పరమము అయిన వాసుదేవు పరబ్రహ్మంలో లీనమయ్యాడు. అంతట.....

9-590-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్రాణేశుఁ డాడిన లుకులు నగవులు-
గాఁ జూడ కంతరంమున నిలిపి
థికులై పోవుచుఁ బానీయశాలలఁ-
ల్లగా నుండెడి నుల యట్ల
సంసారమునఁ గర్మసంబంధులై వచ్చి-
యాలు బిడ్డలు మగం నుచుఁ గూడి
యుండుట గాని సంయోగంబు నిత్యంబు-
గా దీశమాయాప్రల్పితంబు

9-590.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దీని విడుచుట దగ వని తెగువ మెఱసి
నిద్రచాలించి మేల్కొన్న నేర్పు చాల
లిగి భార్గవి సర్వసంముల విడిచి
రిపరాధీన యై ముక్తి రిగె నధిప!"

టీకా:

ప్రాణేశుడు = భర్త {ప్రాణేశుడు - ప్రాణములకు ప్రభువు, భర్త}; ఆడిన = చెప్పిన; పలుకులు = మాటలు; నగవులున్ = పరిహాసములు; కాన్ = ఐనట్లు; చూడకన్ = తీసుకొనకుండ; అంతరంగమునన్ = మనసునందు; నిలిపి = ఉంచుకొని; పథికులు = బాటసారులు; ఐ = అయ్యి; పోవుచున్ = వెళ్తు; పానీయశాలలన్ = చలివేంద్రములలో; చల్లగా = స్థిమితముగా; ఉండెడి = గడిపెడి; జనుల = వారి; అట్ల = వలె; సంసారమునన్ = ప్రపంచములో; కర్మసంబంధులు = కర్మానుసారులు; ఐ = అయి; వచ్చి = చేరి; ఆలు = భార్య; బిడ్డలు = పిల్లలు; మగండున్ = భర్త; అనుచున్ = అనుకొనుచు; కూడి = కలసి; ఉండుటన్ = ఉండటమే; కాని = తప్పించి; సంయోగంబున్ = కలసి ఉండుట; నిత్యంబు = శాశ్వతము; కాదు = కాదు; ఈశ = భగవంతుని; మాయా = మాయచేత; ప్రకల్పితంబు = కల్పితములు.
దీనిన్ = దీనిని; విడుచుటన్ = వదిలేయడమే; తగవు = ధర్మము; అని = అని; తెగువన్ = జాగరూకతను; మెఱసి = అతిశయించి; నిద్ర = నిద్రను; చాలించి = ఆపి; మేల్కొన్న = మేల్రొన్నంత; నేర్పున్ = తెలివి; చాల = అధికముగ; కలిగి = పొంది; భార్గవి = దేవయాని; సర్వ = సమస్తమైన; సంగములన్ = తగులములను; విడిచి = వదలివేసి; హరి = విష్ణుమూర్తికి; పరాధీన = వశురాలు; ఐ = అయ్యి; ముక్తి = మోక్షమున; కిన్ = కు; అరిగెన్ = వెళ్ళను; అధిప = రాజా.

భావము:

ఓ రాజ పరీక్షిత్తూ! భర్త చెప్పిన మాటలను పరిహాసాలుగా భావించక దేవయాని మనసులో నిలుపుకుంది. చలివేంద్రాలలో సేదదీరే బాటసారులులాగ, ప్రపంచంలో కర్మానుసారులు అయి చేరి భార్య, పిల్లలు, భర్త, అనుకుంటూ కలసి ఉంటారు. తప్పించి ఈ పొత్తులు శాశ్వతం కాదు. భగవంతుని మాయాకల్పితాలు. క్షణికమైన వీటిని వదిలేయడమే ధర్మం అని గ్రహించింది. దేవయాని సమస్త తగులాలను వదలి, శ్రీహరి ధ్యానంలో నిండుగా నిమగ్నమై ముక్తిపదాన్ని చేరింది.”

9-591-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని యిట్లు యయాతిచరితంబు చెప్పి “భగవంతుండును సర్వభూతనివాసుండును, శాంతుండును, వేదమయుండును నైన వాసుదేవునికి నమస్కరించెద” నని శుకుం డిట్లనియె.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; యయాతి = యయాతి యొక్క; చరితంబు = కథను; చెప్పి = చెప్పి; భగవంతుండును = మహిమాన్వితుడు; సర్వ = సమస్తమైన; భూత = జీవుల యందు; నివాసుండును = వసించువాడు; శాంతుండును = శాంతమే తానైనవాడు; వేదమయుండును = వేదస్వరూపుడు; ఐన = అయిన; వాసుదేవుని = నారాయణుని; కిన్ = కి; నమస్కరించెదను = మొక్కెదను; అని = అని; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .

భావము:

ఈ విధంగా యయాతి కథను చెప్పి “మహిమాన్వితుడు, సమస్త జీవుల యందు వసించువాడు, శాంతుడు, వేదమయుడు అయిన నారాయణునికి మ్రొక్కుతాను.” అని శుకుడు మరల ఇలా అన్నాడు.