పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి శాపము

  •  
  •  
  •  

9-541-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వరాలిఁ జూచి మన మాఁపగ లేక మనోభవార్తుఁడై
యా నభర్త మున్ను కవి యాడిన మాట దలంచి యైనఁ జే
తోసుఖంబులం దనిపెఁ ద్రోవఁగవచ్చునె దైవయోగముల్
రాజఁట సద్రహస్యమఁట రాజకుమారిని మాన నేర్చునే?

టీకా:

ఆ = ఆ; జవరాలిన్ = యౌవనవతిని; చూచి = చూసి; మనమున్ = మనసు; ఆపగలేక = పట్టలేక; మనోభవ = మన్మథునిచే {మనోభవుడు - మనసున పుట్టువాడు, మన్మథుడు}; ఆర్తుడు = బాధింపబడినవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; జనభర్త = రాజు {జనభర్త – జనుల ప్రభువు, రాజు}; మున్ను = ఇంతకు ముందు; కవి = శుక్రాచార్యుడు; ఆడిన = చెప్పిన; మాటన్ = హెచ్చరికను; తలంచి = గుర్తుంచుకొని; ఐనన్ = కూడా; చేతోసుఖంబులన్ = రతిసౌఖ్యములతో; తనిపెన్ = తృప్తిపరచెను; త్రోవగన్ = తప్పించుకొనుటకు; వచ్చునే = సాధ్యమా, కాదు; దైవయోగంబుల్ = దైవఘటన; రాజు = అతను రాజు; అటన్ = అట; సత్ = మిక్కిలి; రహస్యము = గుట్టు వ్యవహారము; అటన్ = అట; రాజకుమారిని = రాకుమారిని; మానన్ = వదల; నేర్చునే = కలడా.

భావము:

ఆ యౌవనవతి అందచందాలు చూసి మనసు పట్టలేక, ఇంతకు ముందు శుక్రాచార్యుడు చెప్పిన హెచ్చరిక గుర్తుండి కూడ, యయాతి శర్మిష్ఠతో క్రీడించాడు. దైవఘటన తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కదా. అతను రాజు కదా. వ్యవహారం మిక్కిలి గుట్టుగా సాగడం సుళువే కదా. మరి వచ్చింది రాకుమారి ఎందుకు వదుల్తాడు.