పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి చరిత్రము

  •  
  •  
  •  

9-510-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నయుఁ దండ్రియుం జన, యయాతి మహీపతి యై చతుర్దిశల్
న్నుగఁ గావఁ దమ్ములకుఁ బాలిడి శుక్రుని కూఁతురున్ సుసం
న్నగుణాభిరామ వృషర్వుని కూఁతురు నోలి నాండ్రుగా
న్నయశాలి యీ ధరణిక్రధురంధరుఁ డయ్యెఁ బేర్మితోన్."

టీకా:

అన్నయున్ = అన్న; తండ్రియున్ = తండ్రి; చనన్ = మరణించగా; యయాతి = యయాతి; మహీపతి = రాజు; ఐ = అయ్యి; చతుర్దిశల్ = నాలుగుదిక్కులు {చతుర్దిశలు - నల్దిక్కులు, 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము}; పన్నుగన్ = చక్కగా; కావన్ = పాలించుటకు; తమ్ముల్ = చిన్నసోదరుల; కున్ = కు; పాలిడి = పంచిపెట్టి; శుక్రుని = శుక్రుని యొక్క; కూతురున్ = కుమార్తెను; సుసంపన్న = మిక్కిలిసమృద్ధిగగల; గుణ = సుగుణములచే; అభిరామన్ = మనోజ్ఞమైనామె; వృషపర్వుని = వృషపర్వుని; కూతురున్ = కుమార్తెను; ఓలినాండ్రు = అరణము దాసి {అరణము - పెండ్లి యందు అల్లునికి ఆడబడచునకు యిచ్చు ధనము}; కాన్ = అగునట్లు; ఆ = ఆ; నయశాలి = నీతిమంతుడు; ఈ = ఈ; ధరణీచక్ర = భూమండలమును; ధురంధరుడు = పాలించువాడు {ధురంధరుడు - భారము మోయు వాడు, పరిపాలించువాడు}; అయ్యెన్ = అయ్యెను; పేర్మి = గౌరవము; తోన్ = తోటి.

భావము:

అన్న, తండ్రి రాజ్యం వదిలిపోగా యయాతి రాజు అయ్యాడు. తమ్ముళ్ళకు నాలుగుదిక్కులు పంచిపెట్టాడు. శుక్రుని కూతురుని భార్యగా వృషపర్వుని కూతురును అరణం దాసిగా చేపట్టి ఆ నీతిమంతుడు ఈ భూభారాన్ని వహించాడు.”

9-511-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని పరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; విని = విని; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నరేంద్రుండు = రాజు; ఇట్లు = ఇలా; అనియె = అడిగెను .

భావము:

అని శుకుడు చెప్పగా విని పరీక్షిత్తు ఇలా అడిగాడు.

9-512-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పార్థివుఁడు యయాతి బ్రహ్మర్షి భార్గవుఁ
ల్లుఁ డగుట మామ గుట యెట్లు?
రాజు రాచకూఁతు తిజేయఁ దగు గాక
విప్రకన్య నొంద విహిత మగునె?"

టీకా:

పార్థివుడు = క్షత్రియుడు; యయాతి = యయాతి; బ్రహ్మర్షి = బ్రహ్మఋషి; భార్గవున్ = శుక్రుడు; అల్లుడు = కూతురు భర్త; అగుట = ఔట; మామ = పెండ్లాము తండ్రి; అగుట = ఔట; ఎట్లు = ఎలాగైనది; రాజు = రాజవంశపువాడు; రాచకూతున్ = రాజవంశపుస్త్రీని; రతిచేయన్ = వివాహముచేసికొన; తగున్ = పద్దతి; కాక = అలాకాకుండగ; విప్ర = బ్రాహ్మణకులపు; కన్యన్ = కన్యను; ఒందన్ = పొందుట; విహితము = పద్దతి; అగునె = అవుతుందా, కాదు.

భావము:

“యయాతి క్షత్రియుడు కదా. బ్రాహ్మణఋషి అయిన శుక్రుని కూతురుని ఎలా పెళ్ళాడాడు. రాజైనవాడు రాచ కన్యను వివాహం చేసుకోడం పద్దతి. అలా కాకుండగ బ్రాహ్మణ కన్యను పొందుట పద్దతి కాదు కదా.”

9-513-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన శుకుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .

భావము:

ఇలా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు.

9-514-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నుజేంద్రు కూఁతురు రళాక్షి శర్మిష్ఠ-
పురములో నొకనాఁడు ప్రొద్దుపోక
వేవురుబోటులు వెంటరా గురుసుత-
గు దేవయానితో నాట మరిగి
పూచిన యెలదోఁట పొంత జొంపముగొన్న-
క్రొమ్మావి చేరువ కొలఁకుఁ జేరి
యందుఁ దమ్ములతేనె లాని చొక్కుచు మ్రోయు-
ళుల ఝంకృతులకు దిరిపడుచు

9-514.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లువ లూడ్చి కొలఁకు డిఁ జొచ్చి తమలోన
బెల్లు రేఁగి నీటఁ ల్లులాడ
నందినెక్కి మౌళి నిందురోచులు పర్వ
శూలి వచ్చెఁ గొండచూలితోడ.

టీకా:

దనుజ = రాక్షసుల; ఇంద్రున్ = రాజు యొక్క; కూతురున్ = కుమార్తె; తరళాక్షి = సుందరి {తరళాక్షి - చలించెడి కన్నులు కలామె, స్త్రీ}; శర్మిష్ఠ = శర్మిష్ఠ; పురము = నగరి; లోన్ = లోపల; ఒక = ఒకానొక; నాడు = దినమున; ప్రొద్దపోక = తోచక; వేవురు = వేయిమంది; బోటులు = చెలులు; వెంటన్ = కూడా; రాన్ = వస్తుండగా; గురు = గురువు యొక్క; సుత = కూతురు; అగు = అయినట్టి; దేవయాని = దేవయాని; తోన్ = తోటి; ఆటన్ = ఆడుకొనుటను; మరిగి = అలవాటుపడి; పూచిన = పూతపూసియున్న; ఎలదోట = ఉద్యానవనము; పొంతన్ = వద్ద; జొంపమున్ = గుబురుగ; కొన్న = ఉన్నట్టి; క్రొమ్మావి = మామిడిచెట్టు; చేరువన్ = దగ్గరలో; కొలకున్ = కొలను; చేరి = చేరి; అందున్ = దానిలోని; తమ్ములన్ = పద్మముల యొక్క; తేనెల్ = మకరందమును; ఆని = తాగి; చొక్కుచున్ = పరవశించి; మ్రోయు = చప్పుడు చేయుచున్న; అళుల = తుమ్మెదల; ఝంకృతుల్ = ఝంకారముల; కున్ = కు; అదిరిపడుచు = ఉలిక్కిపడుతు.
వలువలు = బట్టలు; ఊడ్చి = విప్పి; కొలకున్ = కొలనులోకి; వడిన్ = విసురుగా; చొచ్చి = దూకి; తమలోనన్ = వారిలోవారు; పెల్లున్ = మిక్కిలిగా; రేగి = రెచ్చిపోయి; నీటన్ = నీటిలో; చల్లులాడన్ = జలకాలాడుతుండగా; నందిన్ = నందివాహనమును; ఎక్కి = అధిరోహించి; మౌళిన్ = సిగలో; ఇందు = చంద్రుని; రోచులు = కాంతులు; పర్వన్ = పరచుకొనగా; శూలి = శివుడు {శూలి - త్రిశూలము ఆయుధముగ కలవాడు, శంకరుడు}; వచ్చెన్ = వచ్చెను; కొండచూలి = పార్వతీదేవి; తోడన్ = తోపాటు.

భావము:

“రాక్షసరాజు కుమార్తె సుందరీమణి శర్మిష్ఠ గురువు శుక్రాచార్యుని కూతురు దేవయాని తోటి ఆడుకొనుటను అలవాటుపడింది. ఒకనాడు తోచక వేయిమంది చెలులు సేవిస్తుండగా శర్మిష్ఠ దేవయానితో కలిసి ఉద్యానవనంలో ఉన్న కొలను చేరి బట్టలు విప్పి కొలనులో రెచ్చిపోయి జలకాలు అడుతున్నారు. నందివాహనం అధిరోహించి పార్వతీ పరమేశ్వరులు వచ్చారు

9-515-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హరుఁ జూచి సిగ్గుపడి మానిను లందఱు సంభ్రమంబునన్
లువలు గట్టుచో దనుజల్లభుకూఁతురు దేవయాని దు
వ్వలువ ధరించి వేగమున చ్చినఁ జూచి యెఱింగెఱింగి నా
లు విది యెట్లు కట్టికొనిచ్చిన దానవు యంచుఁ దిట్టుచున్.

టీకా:

మలహరున్ = శివుని {మలహరుడు - మల (దోషములను) హరుడు (తొలగించెడివాడు), శంకరుడు}; చూచి = చూసి; సిగ్గుపడి = లజ్జకలిగి; మానినుల్ = ఇంతులు; అందఱున్ = అందరు; సంభ్రమంబునన్ = తొట్రుబాటుతో; వలువలు = వస్త్రములను; కట్టుచో = కట్టుకొనునప్పుడు; దనుజ = రాక్షస; వల్లభు = రాజు; కూతురున్ = పుత్రిక; దేవయాని = దేవయాని యొక్క; దువ్వలువ = దుప్పటము, పైబట్ట; ధరించి = కట్టుకొని; వేగమునన్ = శ్రీఘ్రముగ; వచ్చినన్ = రాగా; చూచి = కనుగొని; ఎఱింగెఱింగిన్ = తెలిసితెలిసి; నా = నా యొక్క; వలువ = బట్ట; ఇది = దీనిని; ఎట్లు = ఎలా; కట్టికొని = ధరించి; వచ్చినదానవు = వచ్చావు; అంచున్ = అనుచు; తిట్టుచున్ = తిడుతూ.

భావము:

పరమశివుని చూసి లజ్జతో ఇంతులు అందరు వస్త్రాలు కట్టుకొన్నారు. కాని రాక్షసరాజు పుత్రిక శర్మిష్ఠ పైబట్ట తొందరలో తనది అనుకుని దేవయాని కట్టుకొని రాగా చూసి, శర్మిష్ఠ తెలిసి తెలిసి నా బట్ట ఎలా ధరించావు అంటూ తిట్టింది.

9-516-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవయాని యిట్లనియె.

టీకా:

దేవయాని = దేవయాని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .

భావము:

అంత దేవయాని ఇలా అంది.

9-517-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

" లోకేశుముఖంబునం గలిగె బ్రాహ్మణ్యంబు బ్రహ్మంబునా
మేలై వైదికమార్గముల్ దెలుపుచున్; మిన్నంది యందున్ మహా
శీలుర్ భార్గవు; లందు శుక్రుఁడు సుధీసేవ్యుండు; నే వానికిం
జూలన్ నా వలువెట్లు గట్టితివి రక్షోజాతవై చేటికా!

టీకా:

ఆ = ఆ; లోకేశు = బ్రహ్మదేవుని {లోకేశు - లోకములకు ప్రభువు, బ్రహ్మ}; ముఖంబునన్ = మోమునుండి; కలిగెన్ = పుట్టినది; బ్రాహ్మణ్యంబున్ = బ్రాహ్మణకులము; బ్రహ్మంబున్ = పరబ్రహ్మ; నా = వలె; మేలు = ఉత్తమమైనది; ఐ = అయ్యి; వైదిక = వేదముల యొక్క; మార్గముల్ = విధానములను; తెలుపున్ = తెలియజేయును; మిన్నంది = అతిశయించి; అందున్ = వారిలో; మహా = గొప్ప; శీలుర్ = నియమవంతులు; భార్గవుల్ = భృగువంశీయులు; అందున్ = వారిలో; శుక్రుడు = శుక్రుడు; సుధీ = బుద్ధిమంతులచేత; సేవ్యుండు = పూజింపబడెడివాడు; నేన్ = నేను; వాని = అతని; కిన్ = కి; చూలన్ = పుట్టినామెను; నా = నా యొక్క; వలువన్ = వస్త్రమును; కట్టితివి = కట్టుకొంటివి; రక్షస్ = రాక్షసవంశమున; జాతవు = పుట్టినామెవు; ఐ = అయ్యి; చేటికా = దాసీ.

భావము:

ఆ బ్రహ్మదేవుడి ముఖం నుండి బ్రాహ్మణకులం పుట్టింది. వారిలో గొప్ప నియమవంతులై వేదవిధానాలు చెప్పే ఉత్తమమైనది భృగువంశీయులు. వారిలో విఙ్ఞులచే పూజింపబడు వాడు శుక్రుడు. నేను అతనికి పుట్టినామెను. దాసీ! రాక్షస వంశంలో పుట్టిన నువ్వు నా వస్త్రం ఎందుకు కట్టుకున్నావు.

9-518-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హిమవతులైన భూసుర
హిళల విత్తమ్ములు పెఱగువల కగునే?
హిఁ బసిఁడిగొలుసు లిడినన్
విహితములే కుక్కలకు హవిర్భాగంబుల్?

టీకా:

మహిమవతులు = అధికురాలు; ఐన = అయినట్టి; భూసుర = బ్రాహ్మణ; మహిళల = స్త్రీల; విత్తములున్ = సొత్తులు; పెఱ = ఇతర; మగువల = స్త్రీల; కున్ = కు; అగునే = చెందుతాయా; మహిన్ = లోకములో; పసిడి = బంగారపు; గొలుసులు = హారములు; ఇడినన్ = పెట్టనను; విహితములే = అర్హములా, కాదు; కుక్కల్ = కుక్కల; కున్ = కు; హవిర్భాగంబుల్ = యాగభాగములు.

భావము:

అధికురాలైన బ్రాహ్మణకన్యల సొత్తులు ఇతర కన్యలకు చెందుతాయా? లోకంలో కుక్కలకు ఎన్ని బంగారుహారాలు పెట్టినా యాగభాగాలకు అర్హములు కాదు కదా.

9-519-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మీ తండ్రి మాకు శిష్యుఁడు
మా తండ్రి గురుండు గొంతమాత్రం బైనం
బ్రీతిం గావింపక పరి
భూతం జేయుదువె తులువ పోఁడిమిఁ జెనఁటీ!"

టీకా:

మీ = మీ; తండ్రి = తండ్రి; మా = మా; కున్ = కు; శిష్యుడు = శిష్యుడు; మా = మా; తండ్రి = తండ్రి; గురుండు = గురువు; కొంతమాత్రంబు = కొంచముపాటి; ఐనన్ = అయినను; ప్రీతిన్ = ఆదరమును; కావింపక = చూపకుండగ; పరిభూతన్ = అవమానింపబడినామెను; చేయుదువె = చేస్తావా; తులువ = దుష్టురాలా; పోడిమిన్ = చెడునడతతో; చెనటీ = కుత్సితిరాలా.

భావము:

మీ తండ్రి మాకు శిష్యుడు, మా తండ్రి గురువు కొంచమైనా గౌరవం చూపకుండా అవమానిస్తావా దుష్టురాలా! కుత్సితిరాలా!”

9-520-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని భర్జించుచున్న దేవయాని పలుకులు విని, కరాళించి, మ్రోగుచున్న భుజంగి చందంబున నిట్టూర్పులు నిగిడించి, పెదవులు గొఱుకుచు శర్మిష్ఠ యిట్లనియె.

టీకా:

అని = అని; భర్జించుచున్న = మండిపడుతున్న; దేవయాని = దేవయాని యొక్క; పలుకులు = మాటలు; విని = విని; కరాళించి = నిందించుచు; మ్రోగుచున్న = బుసలుకొడుతున్న; భుజంగి = ఆడ పాము {భుజంగమము - భుజములచే పాకునది, పాము}; చందంబునన్ = వలె; నిట్టూర్పులు = నిట్టూర్పులు; నిగిడించి = వదలి; పెదవులున్ = పెదవులను; కొరుకుచున్ = కొరుకుతు; శర్మిష్ఠ = శర్మిష్ఠ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .

భావము:

అని మండిపడుతున్న దేవయాని మాటలు విని, శర్మిష్ఠ పెద్దగా అరుస్తూ బుసలుకొడుతున్న ఆడ పాములా నిట్టూరుస్తూ పెదవులు కొరుకుతు ఇలా అంది.

9-521-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బిక్షుండై తమ తండ్రి మా జనకునిన్ బిక్షించినం దన్ను సం
క్షింపం దుది నింత యై మఱపుతో రాజప్రసూనాకృతి
న్రక్షోరాజతనూజతో సుగుణతో నాతో సమం బాడెడిం
గుక్షిస్ఫోటముగాఁగ దీనిఁ జెలు లీ కూపంబునం ద్రోవరే."

టీకా:

భిక్షుండు = బిచ్చగాడు; ఐ = అయ్యి; తమ = మీ యొక్క; తండ్రి = తండ్రి; మా = మా యొక్క; జనకునిన్ = తండ్రిని; భిక్షించినన్ = అడుక్కొనగా; తన్నున్ = అతనిని; సంరక్షింపన్ = కాపాడగా; తుదిన్ = చివరకు; ఇంత = ఇంత పెద్దది; ఐ = అయ్యి; మఱపు = మరచిపోవుట; తోన్ = చేత; రాజ = క్షత్రియపు; ప్రసూన = పుట్టుక కలామె; ఆకృతిన్ = వలె; రక్షస్ = రాక్షస; రాజ = రాజు యొక్క; తనూజ = పుత్రిక {తనూజ - తనువున పుట్టినామె, పుత్రిక}; తోన్ = తోటి; సుగుణ = బుద్ధిమంతురాలి; తోన్ = తోటి; నా = నా; తోన్ = తోటి; సమంబున్ = సమానముగా; ఆడెడిన్ = పేలుతున్నది; కుక్షి = కడుపు; స్పోటము = బద్దలు; కాగన్ = అయ్యేలాగున; దీనిన్ = ఈపెను; చెలులు = చెలికత్తెలు; ఈ = ఈ; కూపంబునన్ = నూతిలోకి; త్రోవరే = తొయ్యండి.

భావము:

“మీ తండ్రి మా తండ్రిని బిచ్చగాడిలా అడుక్కోగా, మా తండ్రి సంరక్షించాడు. చెలికత్తెలారా! అదంతా మరచి రాక్షసరాజు పుత్రికను నాతో సమానమైన రాచకన్నెలా అహంకరించి పేలుతోంది. దీని కడుపు బద్దలు అయ్యేలా ఈమెను ఈ నూతిలోకి తొసెయ్యండి."

9-522-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి

టీకా:

అని = అని; పలికి = చెప్పి .

భావము:

అలా దేవయానిని నూతిలోకి తోసెయ్యమని ఆఙ్ఞాపించి.

9-523-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బోటిపిండుచేతఁ బొదువంగఁ బట్టించి
రాజసమున దైత్యరాజతనయ
దొడరి దేవయానిఁ ద్రోపించె వలు వీక
క్రుంకి నూతిలోనఁ గుతిలఁకొనఁగ.

టీకా:

బోటి = చెలుల; పిండు = సమూహము; చేతన్ = చేత; పొదువంగ = గట్టిగా; పట్టించి = పట్టింపించి; రాజసమున్ = అధికార గర్వముతో; దైత్య = రాక్షస; రాజ = రాజు యొక్క; తనయ = కుమార్తె; తొడరి = యత్నించి; దేవయానిన్ = దేవయానిని; త్రోపించెన్ = తోయించెను; వలువన్ = బట్టలు; ఈకన్ = ఇవ్వకుండగ; క్రుంకి = ములిగి; నూతి = నుయ్యి; లోనన్ = లోపల; కుతిలకొనగన్ = బాధపడునట్లుగా.

భావము:

రాక్షస రాజు కూతురుని అన్న గర్వంతో శర్మిష్ఠ చెలులచేత బలవంతంగా దేవయానిని వివస్త్రగా బావిలోకి తోయించింది. ఆమె నూతిలో పడి అలా బాధపడుతూ ఉండిపోయింది.

9-524-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు చేసి శర్మిష్ఠ పోయిన వెనుక, యయాతిభూపాలుండు వేఁట మార్గంబున నడవిం దిరుగుచు, దైవయోగంబున నా దేవయాని యున్న నూయి జేరం జనుదెంచి యందు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; చేసి = చేసి; శర్మిష్ఠ = శర్మిష్ఠ; పోయినన్ = వెళ్ళిపోయిన; వెనుకన్ = తరవాత; యయాతి = యయాతి అనెడి; భూపాలుండు = రాజు; వేటన్ = వేటాడెడి; మార్గంబునన్ = దారిలో; అడవిన్ = అడవి అందు; తిరుగుచున్ = సంచరించుచు; దైవయోగంబునన్ = దైవఘటనవలన; ఆ = ఆ; దేవయాని = దేవయాని; ఉన్న = ఉన్నట్టి; నూయిన్ = నూతిని; చేరన్ = దగ్గరకు; చనుదెంచి = వచ్చి; అందున్ = దానిలో.

భావము:

ఇలా చేసి శర్మిష్ఠ వెళ్ళిపోయిన తరవాత, రాజు యయాతి అడవిలో వేటాడెడి దారిలో సంచరిస్తూ, దైవఘటనవలన ఆ దేవయాని ఉన్న నూతి దగ్గరకు వచ్చాడు. దానిలో....

9-525-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బంధువుల నెల్లఁ జీరుచు
నందు జలామగ్ననగ్న యై వగచుచు ని
ర్భంమునఁ జిక్కి వ్రీడా
సింధువున మునింగి యున్న చేడియఁ గనియెన్.

టీకా:

బంధువులన్ = చుట్టాలను; ఎల్లన్ = అందరను; చీరుచున్ = పిలుస్తూ; అందున్ = దానిలో; జల = నీటిలో; ఆమగ్న = ములిగియున్న; నగ్న = వివస్త్ర; ఐ = అయ్యి; వగచుచున్ = దుఃఖించుచు; నిర్బంధమునన్ = కదలలేనిస్థితిలో; చిక్కి = చిక్కుకొని; వ్రీడా = సిగ్గుల; సింధువునన్ = సముద్రమునందు; మునింగి = మునిగి; ఉన్న = ఉన్నట్టి; చేడియన్ = స్త్రీని; కనియెన్ = చూసెను.

భావము:

పేరుపేరునా చుట్టాలను పిలుస్తూ ఆ బావిలో నీటిలో మునిగి వివస్త్రగా చిక్కుకొని కదలలేనిస్థితిలో సిగ్గుతో దుఃఖంతో అలమటిస్తున్న దేవయానిని చూసాడు.