పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : నహుషుని వృత్తాంతము

 •  
 •  
 •  

9-506-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అది యట్లుండె; నహుషునకు యతియు, యయాతియును, సంయాతియు, నాయాతియు, వియతియుఁ, గృతియు నన నార్గురు గొడుకులు దేహికి నింద్రియంబుల చందంబున సంభవించి; రందుఁ బెద్దకొడుకగు యతికి రాజ్యం బిచ్చిన నతండు విరక్తుండై.

టీకా:

అది = ఆ విషయము; అట్లు = అలా; ఉండెన్ = ఉన్నది; నహుషున్ = నహుషున; కున్ = కు; యతియున్ = యతి; యయాతియునున్ = యయాతి; సంయాతియున్ = సంయాతి; ఆయాతియున్ = ఆయాతి; వియతియున్ = వియతి; కృతియున్ = కృతి; అనన్ = అనెడి; ఆర్గురు = ఆరుగుర; కొడుకులున్ = పుత్రులు; దేహి = దేహధారి; కిన్ = కి; ఇంద్రియంబుల = ఇంద్రియముల; చందంబునన్ = వలె; సంభవించిరి = పుట్టరి; అందున్ = వారిలో; పెద్దకొడుకు = పెద్దకొడుకు; అగు = ఐన; యతి = యతి; కిన్ = కి; రాజ్యంబున్ = రాజ్యమును; ఇచ్చినన్ = అప్పజెప్పగా; అతండు = అతను; విరక్తుండున్ = విరాగి; ఐ = అయ్యి.

భావము:

దేహికి ఆరు ఇంద్రియాలు ఉన్నట్లు, నహుషునికి యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అని ఆరుగురు కొడుకులు పుట్టారు. వారిలో పెద్దకొడుకు యతికి రాజ్యం అప్పజెప్పగా అతను విరాగి అయ్యాడు.

9-507-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"రాజ్యంబు పాపమూలము
రాజ్యముతో నొడలెఱుంగ రాదు సుమతియున్
రాజ్యమునఁ బూజ్యు నెఱుఁగడు
రాజ్యము గీజ్యమ్ము ముక్తితునకు నేలా?"

టీకా:

రాజ్యంబున్ = రాజ్యము; పాప = పాపసంభవించుటకు; మూలము = మూలకారణము; రాజ్యము = రాజ్యము; తోన్ = తోటి; ఒడలెఱుంగరాదు = మదము పెరుగును {ఒడలెఱుగరాదు - గర్వము వలన ఒళ్ళు తెలియదు}; సుమతియున్ = మంచిబుద్ధి కలవాడైనను; రాజ్యమునన్ = రాజ్యము వలన; పూజ్యున్ = పూజింపదగినవానిని; ఎఱుగడు = తెలియలేడు; రాజ్యమున్ = రాజ్యము; గీజ్యమున్ = గీజ్యము; ముక్తి = మోక్షము; రతున్ = కోరువాని; కున్ = కి; ఏలా = ఎందుకు.

భావము:

రాజ్యం పాపం కలుగడానికి మూలకారణం. రాజ్యాధికారంతో ఒడలెఱుగని గర్వము కలుగుతుంది. రాజు మంచి బుద్ధి కలవాడైనా పూజ్యుణ్ణి గౌరవించలేడు. మోక్షం కోరేవాడికి ఈ రాజ్యం గీజ్యం ఎందుకు.

9-508-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని పలికి వాఁడు రాజ్యంబునకుం బాసి చనియె.

టీకా:

అని = అని; పలికి = అనుకొని; వాడు = అతడు; రాజ్యంబున్ = రాజ్యపాలన; కున్ = కి; పాసి = దూరమై; చనియెన్ = పోయెను .

భావము:

అని అతడు రాజ్యపాలన వదులుకున్నాడు.

9-509-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హుషుఁడు మఖశతమును
మానుగఁ నొనరించి యింద్రమానిని గవయం
బూని మునీంద్రులు మోచిన
యాముపై నుండి కూలె హి యై నేలన్.

టీకా:

ఆ = ఆ; నహుషుడున్ = నహుషుడు; మఖ = యజ్ఞములను; శతమున్ = నూటిని; మానుగన్ = చక్కగా; ఒనరించి = చేసి; ఇంద్రమానినిన్ = శచీదేవిని {ఇంద్రమానిని - ఇంద్రుని భార్య, శచీదేవి}; గవయన్ = సురతమునకు; పూని = సిద్దపడి; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; మోచిన = మోయుచున్న; యానమున్ = పల్లకి; పైన్ = మీద; నుండి = నుంచి; కూలెన్ = కూలిపోయెను; అహి = సర్పము; ఐ = అయ్యి; నేలన్ = నేలమీదకి.

భావము:

ఆ నహుషుడు వంద యజ్ఞాలు చక్కగా చేసి ఇంద్ర పదవి పొందాడు. శచీదేవిని పొందుకు పిలిచాడు. మునులు మోస్తున్న పల్లకి ఎక్కి నేల కూలి సర్పం అయ్యాడు.