పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సూర్యవంశారంభము

  •  
  •  
  •  

9-3-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నువుల నడవళ్ళు ర్యాదలును వింటి-
న్వంతరంబున మాధవుండు
దిరిగిన జాడలు దెలిసె సత్యవ్రతుం-
ను రాజు ద్రవిళదేశాధిపుండు
పోయిన కల్పాంతమున విష్ణు సేవించి-
విజ్ఞానమును బొంది వెలుఁగుఱేని
తఁడు వైవస్వతుండై పుట్టి మను వయ్యె-
తనికి నిక్ష్వాకుఁడాదిగాఁగఁ

9-3.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దురు గొడుకులు గల రండ్రు, రఁగ వారి
వంశ మేరీతి వర్తించె? వారిలోనఁ
నినవారిని, జనువారిఁ, నెడువారిఁ
జెప్పవే వ్యాసనందన! చిత్తగించి.

టీకా:

మనువుల = చతుర్దశమనువుల {చతుర్దశమనువులు - 1స్వాయంభువ 2స్వారోచిష 3ఉత్తమ 4తామస 5రేవత 6చాక్షుస 7వైవస్వత (ప్రస్తుతమనువు) 8సూర్యసావర్ణిక 9దక్షసావర్ణిక 10బ్రహ్మసావర్ణిక 11రుద్రసావర్ణిక 12దర్మసావర్ణిక 13రౌచ్య 14భౌమ్యులు}; నడవళ్ళు = నడవడికలు; మర్యాదలును = యశస్సులు; వింటి = విన్నాను; మన్వంతరంబున = మన్వంతరములలో; మాధవుండు = విష్ణుమూర్తి {మాధవుడు - లక్ష్మీదేవికి భర్త, విష్ణువు}; తిరిగిన = సంచరించిన; జాడలున్ = వివరములు; తెలిసెన్ = తెలిసినవి; సత్యవ్రతుఁడు = సత్యవ్రతుడు; అను = అనెడి; రాజు = రాజు; ద్రవిళ = ద్రావిడ; దేశ = రాజ్యమునకు; అధిపుండు = రాజు; పోయిన = గడచిపోయినట్టి; కల్పాంతమునన్ = కల్పముచివరలో; విష్ణున్ = విష్ణుమూర్తిని {విష్ణువు - విశ్వమున వ్యాపించి యుండువాడు, హరి}; సేవించి = కొలిచి; విజ్ఞానమునున్ = తత్త్వమును; పొంది = తెలిసికొని; వెలుఁగుఱేని = సూర్యునికి; అతఁడు = అతను; వైవస్వతుండు = వైవస్వతుడు; ఐ = అనెడి పేరుగలవాడై; పుట్టి = జన్మించి; మనువు = మనువు; అయ్యెన్ = అయ్యెను; అతని = వాని; కిన్ = కి; ఇక్ష్వాకుడు = ఇక్ష్వాకుడు; ఆదిగాగ = మున్నగువారు; పదురు = పదిమంది; కొడుకులు = పుత్రులు; కలరు = ఉన్నారు; అండ్రు = అనెదరు;
పరగ = ప్రసిద్దమైన; వారి = వారియొక్క; వంశము = వంశము; ఏరీతి = ఎలా; వర్తించె = గడచినది; వారి = వారి; లోనన్ = అందు; చనినవారినిన్ = పూర్వులను; చను = ప్రస్థుతపు; వారిన్ = వారిని; చనెడు = పుట్టబోవు; వారిన్ = వారిని; చెప్పవే = చెప్పుము; వ్యాసనందవ = శుకుడా {వ్యాసనందనుడు - వ్యాసుని కొడుకు, శుకుడు}; చిత్తగించి = దయచేసి.

భావము:

“శుకమహర్షి! 1స్వాయంభువ 2స్వారోచిష 3ఉత్తమ 4తామస 5రేవత 6చాక్షుస 7వైవస్వత (ప్రస్తుతమనువు) 8సూర్యసావర్ణిక 9దక్షసావర్ణిక 10బ్రహ్మసావర్ణిక 11రుద్రసావర్ణిక 12దర్మసావర్ణిక 13రౌచ్య 14భౌమ్యులు అనె చతుర్దశమనువుల నడవడికలు యశస్సులు విన్నాను. ఆయా మన్వంతరములలో మాధవుడు సంచరించిన వివరములు తెలిసినవి. సత్యవ్రతుడు అనే రాజు ద్రావిడ రాజ్యమునకు రాజు గడచిపోయినట్టి కల్పము చివరలో విష్ణుమూర్తిని కొలిచి తత్త్వమును తెలిసికొన్నాడు. సూర్యునికి అతను వైవస్వతుడు అనే పేరుతో జన్మించి మనువు అయ్యాడు. వానికి ఇక్ష్వాకుడు మున్నగువారు పదిమంది పుత్రులు పుట్టారు కదా. ప్రసిద్దమైన వారి వంశము ఎలా గడచినది. వారిలో పూర్వులను, ప్రస్తుతపు వారిని, పుట్టబోవు వారిని దయచేసి చెప్పుము.

9-4-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చెవులార నేఁడు వినియెద
వివంశమునందుఁ గలుగు రాజుల కీర్తుల్
విరింపు వరుసతోడను
భువిఁ బుణ్యుల కీర్తి వినినఁ బుణ్యము గాదే! "

టీకా:

చెవులార = మనస్ఫూర్తిగా; నేఁడు = ఇవాళ; వినియెద = వింటాను; రవివంశమున్ = సూర్యవంశము; అందున్ = లో; కలుగు = ఉండెడి; రాజుల = రాజులయొక్క; కీర్తుల్ = యశస్సులను; వివరింపు = వివరముగాతెలుపుము; వరుస = క్రమ; తోడను = బద్దముగా; భువిన్ = లోకమునందు; పుణ్యుల = పుణ్యాత్ముల; కీర్తిన్ = గొప్పచరితములు; వినినన్ = విన్నచో; పుణ్యము = పుణ్యము; కాదే = కలుగునుకదా.

భావము:

చెవులారా వింటాను; సూర్యవంశములోని రాజుల యశస్సులను వివరముగా తెలుపుము. లోకమునందు పుణ్యాత్ముల గొప్పచరిత్రలు వినడం పుణ్యము కదా.”

9-5-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనినం బరాశరముని మనుమం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; పరాశరముని మనుమండు = శుకుడు {పరాశరముని మనుమడు - పరాశరుని పుత్రుడు వ్యాసుడు అతని పుత్రుడు శుకుడు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను.

భావము:

అనగా శుకముని ఈ విధముగ చెప్పెను.

9-6-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వినుము, మనువుకులము వేయి నూఱేండ్లును
రఁగ విస్తరించి లుకరాదు,
నాకుఁ దోచినంత రనాథ! వేగంబ
యెఱుకపడఁగఁ బ్రీతి నేర్పరింతు.

టీకా:

వినుము = వినుము; మనువు = మనువుయొక్క; కులము = వంశవృత్తాతంము; వేయినూఱు = నూరువేల; ఏండ్లును = సంవత్సరములైనను; పరగ = నడపినను; విస్తరించి = వివరించి; పలుకరాదు = చెప్పుటసాధ్యముకాదు; నాకున్ = నాకు; తోచిన = తట్టిన; అంత = వరకు; నరనాథ = రాజా {నరనాథుడు - నరులకు ప్రభువు, రాజు}; వేగంబ = శీఘ్రముగ; ఎఱుకపడగన్ = తెలియునట్లు; ప్రీతిన్ = ప్రేమతో; ఏర్పరింతు = తెలిపెదను.

భావము:

“రాజా! శ్రద్ధగా వినుము. మనువుయొక్క వంశవృత్తాంత మంతా నూరువేల సంవత్సరములు ఐనా చెప్పుట సాధ్యము కాదు. నాకు తోచినంత వరకు తెలిపెదను.

9-7-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్కువ దక్కువ పొడవుల
కెక్కటి మొదలయిన పురుషుఁ డింతయుఁ జెడఁ దా
నొక్కఁడుఁ గల్పాంతంబున
క్కజమై నిల్చె విశ్వ తఁడై యుంటన్.

టీకా:

ఎక్కువతక్కువ = పెద్ద చిన్న; పొడవుల = ప్రాణులకు; ఎక్కటి = కేవలుడు, అద్వితీయుడ; మొదలు = మూలమైనవాడు; అయిన = ఐన; పురుషుడు = అంతరాత్మ; ఇంతయున్ = ఈ సృష్టి సమస్తమున్; చెడన్ = లయమైనను; తాన్ = తను; ఒక్కడు = ఒక్కడే ఏకాంతముగ; కల్పాంతంబునన్ = ప్రళయకాలమునందును; అక్కజము = అదికుడు; ఐ = అయ్యి; నిల్చెన్ = మిగిలియుండెను; విశ్వమున్ = సృష్టిసమస్తము; అతడు = తాను; ఐ = అయ్యి; ఉంటన్ = ఉండుటచేతను.

భావము:

కేవలుడు, అద్వితీయుడు పరమాత్మ సర్వ ప్రాణులకు మూలమైనవాడు, అంతరాత్మ. ఈ సృష్టి తానే అయ్యి ఉండుట చేత, సమస్తము లయమైనను తను ఒక్కడే ఏకాంతముగ ప్రళయకాలము నందునను మిగిలి ఉంటాడు.