పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-125-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నా తేజము సాధులలో
నాతమై యుండు వారి లఁచు జనులకున్
హేతి క్రియ భీతి నిచ్చుం
జేతోమోదంబుఁ జెఱచు సిద్ధము సుమ్మీ.

టీకా:

నా = నాయొక్క; తేజమున్ = తేజస్సు; సాధుల = మంచివారి; లోన్ = లో; ఆతతము = విరివియైనది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; వారిన్ = వారిని; అలచు = కష్టపెట్టెడి; జనుల = వారి; కున్ = కి; హేతి = అగ్నిశిఖల; క్రియన్ = వలె; భీతిన్ = భయమును; ఇచ్చున్ = కలుగజేయును; చిత్ = మానసిక; మోదంబున్ = సంతోషమును; చెఱచున్ = పాడుచేయును; సిద్దము = తప్పకుండ; సుమ్మీ = సుమా.

భావము:

నా తేజస్సు సాధుపురుషులలో విరివిగా ఉంటుంది. వారిని కష్టపెట్టే వారికి అగ్నిశిఖల వలె భయాలను కలుగజేస్తుంది. వారికి తప్పకుండ మానసిక సంతోషం లేకుండా చేస్తుంది సుమా.