పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : హిరణ్యగ ర్భాగమనము

  •  
  •  
  •  

8-658-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు వింధ్యావళియుం బ్రహ్లాదుండును విన్నవించు నవసరంబున హిరణ్యగర్భుండు చనుదెంచి యిట్లనియె.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; వింధ్యావళియున్ = వింధ్యావళీదేవి; ప్రహ్లాదుండును = ప్రహ్లాదుడు; విన్నవించు = మనవిచేసెడి; అవసరంబునన్ = సమయమునందు; హిరణ్యగర్భుండు = బ్రహ్మదేవుడు {హిరణ్యగర్భుడు - హిరణ్య (బంగారు అండము) నందు గర్భుడు (జనించిన వాడు), బ్రహ్మదేవుడు}; చనుదెంచి = వచ్చి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా ప్రహ్లాదుడూ వింధ్యావళీ విన్నవించు సమయమున బ్రహ్మదేవుడు వచ్చి వామనుడి రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుతో ఇలా అన్నాడు.

8-659-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూతలోకేశ్వర! భూతభావన! దేవ-
దేవ! జగన్నాథ! దేవవంద్య!
న సొమ్ము సకలంబుఁ ప్పక నీ కిచ్చె-
దండయోగ్యుఁడు గాడు దానపరుఁడుఁ;
రుణింప నర్హుండు మలలోచన! నీకు-
విడిపింపు మీతని వెఱపు దీర;
తోయపూరము చల్లి దూర్వాంకురంబులఁ-
జేరి నీ పదము లర్చించునట్టి

8-659.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్తియుక్తుఁడు లోకేశుదము నందు
నీవు ప్రత్యక్షముగ వచ్చి నేఁడు వేఁడ
నెఱిఁగి తన రాజ్య మంతయు నిచ్చి నట్టి
లికిఁ దగునయ్య! దృఢపాశబంధనంబు?"

టీకా:

భూతలోకేశ్వరా = నారాయణ {భూతలోకేశ్వరుడు - భూతలోక (సమస్తమైన ప్రాణులకు) ఈశ్వరుడు, విష్ణువు}; భూతభావన = నారాయణ {భూతభావన - సమస్తప్రాణులచేత ధ్యానించబడువాడు, విష్ణువు}; దేవదేవ = నారాయణ {దేవదేవ - మహాగొప్పదేవుడు, విష్ణువు}; జగన్నాథ = నారాయణ {జగన్నాథ - సర్వ లోకాధిపతి, విష్ణువు}; దేవవంద్య = నారాయణ {దేవవంద్యుడు - దేవతలచే వంద్యుడు (స్తుతింపబడువాడు), విష్ణువు}; తన = తన యొక్క; సొమ్మున్ = సందలను; సకలంబున్ = సమస్తము; తప్పక = వదలక; నీకున్ = నీకు; ఇచ్చెన్ = ఇచ్చివేసెను; దండ = శిక్షించుటకు; యోగ్యుడు = తగినవాడు; కాడు = కాడు; దానపరుడున్ = దాత; కరుణింపన్ = దయచూచుటకు; అర్హుండు = తగినవాడు; కమలలోచన = పద్మాక్ష; నీ = నీ; కున్ = కు; విడిపింపుము = బంధవిముక్తుని చేయుము; ఈతని = ఇతని యొక్క; వెఱపు = బెదురు; తీరన్ = పోవునట్లు; తోయపూరము = జలములను; చల్లి = చల్లి; దూర్వాంకురములన్ = గరికపోచలతో; చేరి = దగ్గరకొచ్చి; నీ = నీ యొక్క; పదములన్ = పాదములను; అర్చించునట్టి = పూజించెడి.
భక్తి = భక్తి; యుక్తుడు = కలవాడు; లోకేశుపదమునందు = సర్వలోకాధిపతివైన; నీవు = నీవు; ప్రత్యక్షముగ = ఎదురుగ; వచ్చి = వచ్చి; నేడు = ఇవాళ; వేడన్ = అడుగుగ; ఎఱిగి = తెలిసికూడ; తన = తన యొక్క; రాజ్యమున్ = రాజ్యము; అంతయున్ = సమస్తమును; ఇచ్చిన = ఇచ్చివేసిన; అట్టి = అటువంటి; బలి = బలి; కిన = కి; తగున = న్యాయమా; అయ్య = తండ్రి; దృఢ = గట్టిగా; పాశ = తాళ్ళతో; బంధనంబు = కట్టవేయుట.

భావము:

“ఓ దేవదేవా! దేవవంద్యా! జగన్నాధా! కమాలాల వంటి కన్నులుగల శ్రీహరీ! నీవు సకల ప్రాణులకు ఈశ్వరుడవు, ఆరాధ్యనీయుడవు; బలిచక్రవర్తి గొప్పదాత. ఇతడు నీకు తన ధనమంతా ఇచ్చేసాడు. ఇతడు శిక్షింపదగినవాడు కాదు. నీచే దయచూపదగినవాడు. ఇతని భయాన్ని పోగొట్టి బంధవిముక్తుణ్ణి చెయ్యి. ఇతడు నీ పాదాలను కోరి జలములతో అభిషేకించిన, గరిక పత్రితో పూజించిన భక్తుడు. లోకాధిపతివి అయిన నీవు స్వయంగా దరిచేరి అడగడాన్ని తెలిసి కూడా తన రాజ్యమంతా ఇచ్చేసాడు. ఇటువంటి ఈ బలిని త్రాళ్ళతో కట్టివేయడం న్యాయము కాదయ్యా!”

8-660-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన బ్రహ్మవచనంబులు విని భగవంతుం డిట్లనియె.

టీకా:

అని = అని; పలికిన = చెప్పిన; బ్రహ్మ = బ్రహ్మదేవుని; వచనంబులు = మాటలు; విని = విని; భగవంతుండు = విష్ణుమూర్తి {భగవంతుడు - ఐశ్వర్యాదికములు కలుగుటచే పూజ్యుడైనవాడు, విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా విన్నవించిన బ్రహ్మదేవుడి మాటలు విని భగవంతుడు అగు వామనుడు ఇలా అన్నాడు.

8-661-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ్వనిఁ గరుణింప నిచ్ఛయించితి వాని-
ఖిల విత్తంబు నే పహరింతు
సంసార గురుమద స్తబ్ధుఁడై యెవ్వఁడు-
దెగడి లోకము నన్ను ధిక్కరించు
తఁ డెల్ల కాలంబు ఖిల యోనుల యందుఁ-
బుట్టుచు దుర్గతిఁ బొందుఁ బిదప
విత్త వయో రూప విద్యా బలైశ్వర్య-
ర్మ జన్మంబుల ర్వ ముడిగి

8-661.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యేక విధమున విమలుఁడై యెవ్వఁ డుండు
వాఁడు నా కూర్చి రక్షింపలయువాఁడు;
స్తంభ లోభాభిమాన సంసార విభవ
త్తుఁడై చెడ నొల్లఁడు త్పరుండు.

టీకా:

ఎవ్వనిన్ = ఎవిరినైతే; కరుణింపన్ = దయచూపవలెనని; నిచ్చయించితిని = అనుకొనెదనో; వానిని = వానిని; అఖిల = సమస్తమైన; విత్తంబున్ = సంపదలను; నేన్ = నేను; అపహరింతున్ = లాగుకొనెదను; సంసార = సంసార సంబంధమైన; గురు = పెద్ద; మద = మదము చేత {మదము - 1కొవ్వు 2గర్వము, అష్టవిధమదములు 1విత్త 2వయో 3రూప 4విద్యా 5బల 6ఐశ్వర్య 7కర్మ 8జన్మల సంబంధించిన మదములు}; స్తబ్దుడు = నిస్తేజుడు; ఐ = అయ్యి; ఎవ్వడు = ఎవడైతే; లోకమున్ = లోకమును; నన్ను = నన్ను; ధిక్కరించున్ = తిరస్కరించునో; అతడున్ = అతను; ఎల్ల = ఎంత; కాలంబున్ = కాలమైనను; అఖిల = అనేకరకములైన; యోనులన్ = గర్భముల; అందున్ = లో; పుట్టుచున్ = పుడుతూ; దుర్గతిన్ = నరకమును; పొందున్ = పొందును; పిదపన్ = తరవాత; విత్త = ధనము; వయో = యౌవనము; రూప = అందము; విద్యా = విద్యలు; బల = బలము; ఐశ్వర్య = సంపదలు; కర్మ = వృత్తి; జన్మంబులన్ = వంశముల; గర్వమున్ = గర్వములను; ఉడిగి = విడిచిపెట్టి.
ఏకవిధమున = ఏకాగ్రముగా; విమలుడు = నిర్మలుడు; ఐ = అయ్యి; ఎవ్వడు = ఎవరైతే; ఉండున్ = ఉండునో; వాడు = అతడు; నా = నాచేత; కూర్చి = ఇష్టపడి; రక్షింపన్ = కాపాడబడ; వలయున్ = వలసిన; వాడు = వాడు; స్తంభ = అజ్ఞానము; లోభ = అత్యాశ; అభిమాన = గర్వములతో; సంసార = లౌకిక; విభవ = ప్రాభవములతే; మత్తుడు = మదించినవాడు; ఐ = అయ్యి; చెడన్ = నశించుటకు; ఒల్లడు = అంగీకరించడు; మత్ = నాకు; పరుండు = చెందినవాడు.

భావము:

“ఎవడి మీద నేను దయ చూపాలని అనుకుంటానో, వాడి సంపద అంతటిని అపహరిస్తాను. సంసార సంబంధమైన గొప్ప మైకంతో ఎవడు లోకాన్ని నిందించి నన్ను తిరస్కారిస్తుంటాడో, వాడు ఎప్పటికీ నానా యోనులలో పుడుతూ, చచ్చి నరకానికి పోతూ ఉంటాడు. ఎవడైతే ధనానికి, వయస్సుకు, రూపానికి, విద్యకు, బలానికి, ఐశ్వర్యానికి, వృత్తికి, జన్మకు సంబంధించిన గర్వాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటాడో, వాడిని నేను ప్రీతితో కాపాడుతాను. నా భక్తుడు అయినవాడు అజ్ఞానంతో, దురాశతో, గర్వంతో, లౌకికసంపదలతో మదించి నశించడాన్ని ఆశించడు.

8-662-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్ధుండై గురుశాపతప్తుఁడయి తా బంధువ్రజత్యక్తుఁడై
సిద్ధైశ్వర్యముఁ గోలుపోయి విభవక్షీణుండునై పేదయై
శుద్ధత్వంబును సత్యముం గరుణయున్ సొంపేమియుం దప్పఁ డు
ద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెం బుణ్యుం డితం డల్పుఁడే.

టీకా:

బద్ధుండు = బంధింపబడినవాడు; ఐ = అయ్యి; గురు = గురువు యొక్క; శాప = శాపమువలన; తప్తుడు = తపించువాడు; అయి = ఐ; తాన్ = అతను; బంధు = బంధువుల; వ్రజ = సమూహములచే; త్యక్తుడు = విడువబడినవాడు; ఐ = అయ్యి; సిద్ధ = ప్రాప్తించిన; ఐశ్వర్యమున్ = సంపదలు; కోలుపోయి = నశించి; విభవ = ప్రాభవములు; క్షీణుండున్ = నశించినవాడు; ఐ = అయ్యి; పేద = పేదవాడు; ఐ = అయ్యి; శుద్ధత్వంబునన్ = స్వచ్ఛతను; సత్యమున్ = సత్యమును; కరుణయున్ = దయను; సొంపున్ = ప్రసన్నతలను; ఏమియున్ = ఏమాత్రము; తప్పడు = విడువలేదు; ఉద్బుద్ధుండు = జ్ఞాని; ఐ = అయ్యి; అజయ = అజయ (గెలువసాధ్యముకాని); ఆఖ్యన్ = పేరుకలిగిన; మాయన్ = మాయను; గెలిచెన్ = జయించెను; పుణ్యుడు = పుణ్యాత్ముడు; ఇతడు = ఇతగాడు; అల్పుడే = తక్కువవాడా కాదు.

భావము:

ఈ పుణ్యాత్ముడు బంధింపబడ్డాడు. గురువు శాపంవలన పరితాపానికి గురయ్యాడు. బంధువులనుండి విడువబడ్డాడు. ప్రాప్తించిన అధికారాన్ని ఐశ్వర్యాన్నీ కోల్పోయి పేదవాడు అయ్యాడు. ఐనా నిర్మలంగా ఉన్నాడు. సత్యాన్ని దయనూ సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు. జ్ఞానియై గెలవడానికి సాధ్యంకాని అజయ అని పేరు పడ్డ మాయను గెలిచాడు. ఇతడు చాలా గొప్ప మహానీయుడు.

8-663-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సురనాథుఁ డనుచు నఘుని మర్యాద
యేను జూత మనుచు నింత వలుక
నిజము పలికె నితఁడు నిర్మలాచారుండు
మేలుమేలు నాకు మెచ్చువచ్చు.

టీకా:

అసుర = రాక్షసులకు; నాథుడు = రాజు; అనుచున్ = అనుచు; అనఘుని = పుణ్యుని; మర్యాద = మంచినడవడిని; ఏను = నేను; చూతము = పరీక్షించెదము; అనుచున్ = అనుకొనగా; ఇంతవలుక = ఇంతవరకు; నిజమున్ = సత్యమునే; పలికెన్ = పలికెను; ఇతడు = ఇతను; నిర్మల = నిర్మలమైన; ఆచారుండు = నడవడికగలవాడు; మేలుమేలు = చాలామంచిది; నా = నా; కున్ = కు; మెచ్చువచ్చు = మెప్పుగొలుపుతున్నది;

భావము:

ఇతడిని పుణ్యాత్ముడైన రాక్షసేశ్వరుడిగా ఆదరించాలనే ఉద్దేశంతోనే నేను ఇంతవరకూ ఊరకున్నాను. ఇతడు మంచి నడవడి కలవాడు; సత్యవాది; మేలు మేలు ఈతని ప్రవర్తనకు నాకు మెప్పుకలుగుచున్నది.