పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : ప్రహ్లా దాగమనము

  •  
  •  
  •  

8-656-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీకుం గ్రీడార్థము లగు
లోకంబులఁ జూచి పరులు లోకులు కుమతుల్
లోకాధీశుల మందురు
లోములకు రాజవీవ లోకస్తుత్యా!

టీకా:

నీ = నీ; కున్ = కు; క్రీడార్థము = సంచరించు విహారస్థలాలు; అగు = అయిన; లోకంబులన్ = లోకములను; చూచి = చూసి; పరులు = ఇతరులు; లోకులు = ప్రజలు; కుమతుల్ = మూర్ఖులు; లోక = లోకములకు; అధీశులము = పాలకులము; అందురు = అనుకొనెదరు; లోకముల్ = సర్వలోకములకు; రాజవు = రాజువు; ఈవ = నీవుమాత్రమే; లోకస్తుత్యా = నారాయణ {లోకస్తుత్య - సర్వలోకముల స్తుతింపబడువాడు, విష్ణువు}.

భావము:

“ఓ లోకపూజ్యుడా! లోకాలు నీకు సంచరించే విహార స్థలాలు. నిజానికి లోకాలకు రాజువు నీవే. కాని తెలివిలేని మూర్ఖులు ఈ లోకాలకు తామే పాలకులని భావిస్తారు.